- Get link
- X
- Other Apps
Qurbani
Bakrid
hajj
zul hijjah
eid ul adha
awuzubillahi minisahithaan nerrazeem - bisimillah irrahmaan nirraheem
video:
12 నెలలలో 4 పవిత్రమైన నెలలు ఉన్నాయి
ఆ 4 ఇంటిలో జిల్ హిజ్జా నెల 1, ఇది 12 వ నెల
ఈ నెల మీద అల్లాహ్ ప్రమాణం చేసివున్నాడు (సూరత్ అల్-ఫజ్ర్ – 1 & 2 వచనాలు.)
: “ఉదయం సాక్షిగా; మరియు పది రాత్రుల సాక్షిగా.”
1 . ఈ నెల పాపవిమోచన నెల, పుణ్యాలు సంపాదించే నెల
2 . చెడుపనులు మానేసి మంచి జీవితం వైపుకు ప్రేరేపించే నెల ఇది
3. తీర్ధయాత్ర నెల
- Ibrahim (Abraham) to sacrifice his beloved son, Ismail (Ishmael)
Surah As-Saffat (37:100-111)
4. ఈ నెలలోనే హజ్ చేస్తారు
5. కాబాను చాలామంది దర్శించి తవాఫ్ చేస్తారు
6. ఈ నెలలోనే ఖుర్బానీ ఇస్తారు
7. ఉధియా విధింపు ఈ నెలలోనే ఉంది
8. ఈద్ అల్-అధా
9. పవిత్ర మాసం:
ముహర్రం, రజబ్ మరియు జుమాద్ అల్-అఖిర్‌లతో పాటు ఇస్లాంలో నాలుగు పవిత్ర మాసాలలో ధు అల్-హిజ్జ ఒకటి.
10. యుద్ధ నిషేధం:
11. ధుల్-హిజ్జా తొమ్మిదవ రోజును అరఫా దినం
Because : ఈ రోజులు మన ధర్మకార్యాలను మరియు
ఆరాధనలను పెంచుకోవడానికి,
మన మంచి పనులన్నింటినీ అల్లాహ్‌కు అంకితం చేయడానికి ,
ఆయన దయ మరియు క్షమాపణను అడగడానికి,
బంధుత్వ సంబంధాలను నిలబెట్టడానికి,
మంచిని ఆస్వాదించడానికి మరియు
చెడును నిషేధించడానికి
మన వంతు కృషి చేయడానికి ఒక శుభ సమయం. This month
10 DAYS
· ఎక్కువ ప్రార్థనలు చేయడం ( నఫిలా ).
· ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయండి.
· ఉపవాసం (ఈ పది రోజులు, ముఖ్యంగా అరఫా ).
· నవాఫిల్‌లో పెరుగుదల
· దానధర్మాలు ( సదఖా ) చేయడం.
· వారికి ఆర్థిక స్తోమత ఉంటే హజ్ పుణ్యం ఆచరించండి.
· వీలైనంత ఎక్కువ దిక్కర్ చేయండి ( తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ ).
· తహ్మీద్: అల్-హమ్దు లిల్లాహ్ (సర్వ స్తోత్రాలు దేవునికే)
· తహ్లీల్: లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు)
· తస్బీహ్: సుభాన్-అల్లాహ్ (దేవునికి మహిమ కలుగుగాక)
· "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్-అల్లాహ్, అల్లాహు అక్బర్, వ లిల్లాహ్ హిల్-హమ్ద్." – అర్థం –
· అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు; అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ కే స్తోత్రాలు.
· ఇస్తిగ్‌ఫార్
· ఇస్టిగ్‌ఫార్ ఒత్తిడి మరియు ఆందోళనను తొలగిస్తుంది.
· ఇస్తిగ్‌ఫార్ దయ యొక్క తలుపు తెరుస్తుంది.
· ఇస్తిగ్‌ఫార్ జీవనోపాధిని అందిస్తుంది.
· పాపాలను తుడిచే సాధనం.
· మీ దుఆ (ప్రార్థన) అంగీకరించబడింది.
· ప్రవక్త (స) ఇలా అన్నారు: “అరఫా ఉపవాసం గత మరియు రాబోయే రెండు సంవత్సరాల పాపాలను పరిహరించుకుంటుంది.” - ముస్లిం.
జిల్ హిజ్జా నెల పది రోజుల ప్రత్యేకతలు మరియు ఘనత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ దైవభీతిని కలిగి ఉండండి. ఎల్లవేళలా మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. తెలుసుకోండి అల్లాహ్ తన సృష్టి రాశులలో కొన్నింటికి కొన్నింటిపై ప్రాధాన్యతను ఇచ్చాడు అవి మనుషులైనా, ప్రదేశమైనా, సమయమైనా లేదా ఏదైనా ఆరాధనైనా. దీని వెనుక వివేకాత్మకమైనటువంటి నిర్ణయం ఉంటుంది ఇది కేవలం అల్లాహ్ కి మాత్రమే తెలుసు! అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
(وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ مَا كَانَ
لَهُمُ الْخِيَرَةُ)
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం
లేదు.
మనం ఈ ఉపన్యాసంలో జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలకు ఉన్నటువంటి గొప్పదనం మరియు ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం!
మొదటి ప్రత్యేకత: ఏమిటంటే అల్లాహ్ తఆలా ఈ దినముల గురించి ప్రత్యేకంగా ఖురాన్ లో తెలియజేశాడు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
لِّيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَّعْلُومَاتٍ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి).
ఈ వాక్యంలో ఉన్న నిర్ణీత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలు. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు: “నిర్ణిత దినాలు అనగా జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు”
జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు ఘనత కలిగినటువంటివి అనడానికి మరొక ఆధారం ఏమిటంటే అల్లాహ్ తఆలా వాటి రాత్రుల యొక్క ప్రస్తావన చేస్తూ ఇలా అంటున్నాడు:
وَالْفَجْرِ وَلَيَالٍ عَشْرٍ
ఉషోదయం సాక్షిగా! పది రాత్రుల సాక్షిగా!
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వాక్యం యొక్క వివరణలో పది రాత్రుల యొక్క ప్రస్తావన చేసి ఇవి జిల్ హిజ్జా మాసపు మొదటి పది రోజులే అని తెలియజేశారు. ఇబ్నే అబ్బాస్, ఇబ్నే జుబైర్, ముజాహిద్ మరియు ఇతర పండితుల యొక్క అభిప్రాయం కూడా ఇదే.
జిల్ హిజ్జా మాసం యొక్క పది రోజుల శ్రేష్టతకు గల మరో కారణం ఏమిటంటే ఆ దినాలలో చేసేటువంటి ఆచరణ పుణ్యఫలం రీత్యా సంవత్సరంలోని ఇతర రోజులు కంటే ఎక్కువగా ఉంటుంది హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
జిల్ హిజ్జా మాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అల్లాహ్ దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహ పడుతూ, “దైవప్రవక్తా! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా?” అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధన ప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగిరాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్ఠుడే)” అని చెప్పారు. (బుఖారీ)
ఇబ్నే రజబ్ (రహిమహుల్లాహ్) ఈ హదీస్ యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నారు:
నిశ్చయంగా ఇది ఒక గొప్ప హదీస్. ఎందుకంటే ఏదైనా చిన్న ఆచరణ ఘనత కలిగినటువంటి సమయంలో చేయడం మూలంగా ఆ సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఆచరణ యొక్క ఘనత కూడా పెరుగుతుంది, అదే విధంగా జిల్ హిజ్జా యొక్క మొదటి పది రోజులలో చేసేటువంటి ఆచరణలు ఇతర దినాలలో చేసేటువంటి ఆచరణలు కంటే గొప్పవిగా పేర్కొనడం జరిగింది. అయితే అందులో కేవలం జిహాద్ కు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది అది కూడా ధన మన ప్రాణాలతో బయలుదేరి మళ్లీ తిరిగి రాకపోవడం.
అనగా ఈ హదీస్ ద్వారా వెలువడేటువంటి మరొక విషయం ఏమిటంటే జిల్ హిజ్జా యొక్క మొదటి దినాలలో చదివే నఫిల్ రంజాన్ యొక్క చివరి భాగంలో చదివే నఫీల్ కంటే ఉత్తమమైనవి. అదేవిధంగా జిల్ హిజ్జా యొక్క పది రోజులలో చేయబడే ఫరజ్ లు ఇతర దినాలలో చేయబడే ఫరజ్ ల కంటే గొప్పవి.
జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో అరఫా దినము కూడా ఉంది. అల్లాహ్ తఆలా తన ధర్మాన్ని పరిపూర్ణంగావించిన రోజు మరియు ఈ వాక్యం అవతరణ కూడా జరిగింది:
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ
دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీ పై నా అనుగ్రహాన్ని
పూర్తిచేశాను
జిల్ హిజ్జా యొక్క పది దినాల యొక్క శ్రేష్టతకు గల మరొక కారణం: ఈ పది దినాలలో ఖుర్బాని దినం కూడా ఉంది. ఈ ఈ దినమునే పెద్ద హజ్ అని కూడా అంటారు. ఈ రోజున ఎన్నో ఆరాధనలు ఏకమవుతాయి. ఖుర్బానీ, తవాఫ్ కాబా (ప్రదక్షణ), సఫా, మర్వా కొండల మధ్య పరిగెత్తడం (సయీ చేయడం), శిరోముండనం, జమరాత్ (షైతాన్) కు రాళ్ళు విసరడం.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు హదీసులో ఇలా తెలియజేశారు: అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత గొప్ప దినము ఖుర్బానీ దినము అనగా (జిల్ హిజ్జా మాసం పదవ దినం). ఆ తరువాత ఖుర్రా దినము, అనగా జిల్ హిజ్జా మాసం పదకొండవ దినము.(అబూ దావూద్). ఇక్కడ ఖుర్బానీ దినాన్ని ఖుర్రా దినముగా పేర్కొనడం జరిగింది దీనికి గల కారణం ఏమిటంటే ఆ రోజున హాజీలు మినా ప్రదేశంలో ఆగి ఉంటారు.
ఓ ముస్లిం లారా! ఈ పది దినాలలో చేసేటువంటి 6 గొప్ప ఆచరణలు ఉన్నాయి అవి:
1. అతి ఎక్కువగా అల్హందులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని స్మరిస్తూ ఉండాలి అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “అల్లాహ్ వద్ద ఈ పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ అత్యంత ప్రియమైనవి కావు, కనుక ఈ పది రోజుల్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అల్హందులిల్లాహ్ ను ఎక్కువగా స్మరిస్తూ ఉండండి” (అహ్మద్)
బుఖారి (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు: ఇబ్నే ఉమర్ మరియు అబూ హురైరా వారు ఈ పది దినాలలో బజారులోకి వెళ్లి అతి బిగ్గరగా తక్బీర్ పలికేవారు అది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా వారితో పాటు తక్బీర్ పలికే వారు (బుఖారి)
తక్బీర్ ఇలా పలకాలి:
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్)
కాబట్టి ఈ పది దినములలో అతి ఎక్కువగా అల్లాహ్ ని స్మరించడం ఉన్నతమైన ఆచరణగా తెలుపబడింది. ఇళ్లల్లో బజారుల్లో అల్లాహ్ స్మరణకు అనుమతించబడిన ప్రతి చోట ఈ విధంగా అల్లాహ్ ను స్మరించడం ఉత్తమం. దీని ద్వారా అల్లాహ్ యొక్క మహిమ ఆయన ఎంత గొప్పవాడో ప్రదర్శించబడుతుంది. మరియు వీటిని పఠించేటప్పుడు పురుషులు ఒకేసారి బిగ్గరగా పటించాలి. స్త్రీ ఎవరైనా ఉంటే ఆమె నెమ్మదిగా తక్బీర్ పట్టించాలి.
నేటి కాలంలో తక్బీర్ విధానాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. చాలా కొద్ది మంది మాత్రమే దీనిపై ఆచరిస్తున్నారు కాబట్టి ఈ సున్నత్‌ను పునరుద్ధరించడానికి మరియు అజాగ్రత్తగా ఉన్నవారిని అప్రమత్తం చేయడానికి, తక్బీర్‌ను ఇతరులకు వినిపించేలా బిగ్గరగా చదవాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తక్బీర్ చదవాలి, సమిష్టిగా తక్బీర్ పఠించడానికి ధర్మంలో అనుమతి లేదు. ఇది ధర్మానికి విరుద్ధమైన చర్య.
2. జిల్ హిజ్జా మొదటి పది దినాలలో చేయవలసిన మరొక పని: ఉపవాసాలు పాటించడం. కాబట్టి ఈనెలలో తొమ్మిది రోజులు ఉపవాసాలు పాటించడం అభిలషణీయంగా పరిగణించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా జిల్ హిజ్జా యొక్క తొమ్మిది దినాలు ఉపవాసం పాటించేవారు.
హునైదా బిన్ ఖాలిద్ తన భార్య తో ఉల్లేఖిస్తున్నారు మరియు ఆమె ప్రవక్త గారి కొందరి సతీమణులతో ఉల్లేఖించారు: మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం వారు జిల్ హిజ్జా మాసం యొక్క తొమ్మిది ఉపవాసాలు, ఆషురా ఉపవాసం, మరియు ప్రతి నెల మూడు ఉపవాసాలు, సోమ మరియు గురువారం ఉపవాసాలను పాటించేవారు. (అబూ దావూద్)
అబూ ఉమామ అల్ బాహిలి (రదియల్లాహు అన్హు) గారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని ఈ విధంగా ప్రశ్నించారు: ఓ మహా ప్రవక్తా! అల్లాహ్ నాకు లాభం చేకూర్చడానికి ఏదైనా ఆచరణ గురించి తెలియజేయండి. అప్పుడు ప్రవక్త వారు ఇలా సమాధానం ఇచ్చారు; “నువ్వు ఉపవాసం పాటించు ఎందుకంటే దానికి తగిన ఆచరణ మరొకటి లేదు“. (నసాయి)
3. ఈ పది దినములలో చేసేటువంటి ఆచరణలలో మరొకటి: అరఫా ఉపవాసం పాటించాలి. దీని ఆధారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అరఫా నాటి ఉపవాసం గురించి విచారించడం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ “అది క్రితం యేడు మరియు వచ్చే యేటి పాపాలన్నింటినీ తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. (ముస్లిం)
4. ఈ పది రోజులలో చేసే మరో ఆచరణ (ఈద్ నమాజ్) ప్రార్థన కూడా ఇది ప్రసిద్ధి చెందినది.
5. ఈ పది రోజులలో చేసేటువంటి మరో ఆచరణ: ఖుర్బానీ ఇవ్వడం. ఇది స్తోమత కలిగినటువంటి వారిపై తప్పనిసరి అవుతుంది. పండుగ రోజున ఖుర్బానీ ఇవ్వడం “తష్ రీఖ్” దినాలలో ఖుర్బానీ ఇవ్వడం కంటే ఉత్తమం, ఎందుకంటే పండుగ రోజు పది రోజులలో చివరి రోజు, మరియు ఈ పది రోజులు అన్నింటికంటే ఉత్తమమైన రోజు మరియు “తష్ రీఖ్” దినాలు ఈ పది రోజులలో చేర్చబడలేదు. కనుక పండుగ రోజు ఖుర్బానీ ఇవ్వడం సదాచరణలో త్వరపడడాన్ని సూచిస్తుంది. (తస్హీలుల్ ఫిఖ్హ్ )
6. జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో చేయవలసిన మరొక ఆచరణ: హజ్ మరియు ఉమ్రా చేయడం.
ఇవి ఈ పది రోజులలో చేసేటువంటి అత్యుత్తమ కార్యాలు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చూపించినటువంటి విధానం ప్రకారం హజ్ నెరవేర్చాలి మరియు అందులో వారించబడినటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. అనగా అపసవ్యమైన చేష్టలకు, వ్యర్థ విషయాలకు, పోట్లాటలకు దూరంగా ఉంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చేసినటువంటి వాగ్దానం ప్రకారం పుణ్యఫలం ప్రాప్తం అవుతుంది. అనగా ఆమోదముద్ర పడిన హజ్ ప్రతిఫలం స్వర్గము. (బుఖారి,ముస్లిం)
ఓ అల్లాహ్ దాసులారా! ఇవి ఆరు ఆచరణలు జిల్ హిజ్జా మాసం మొదటి పది దినములలో చేయవలసిన పది ఆచరణలు. ఈ ఆరాధనలు సంవత్సరం మొత్తంలో కంటే ఈ పది రోజులకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. అందుకే ఈ పది రోజులు ఔన్నత్యం రీత్యా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. మరియు మూల ఆరాధనలు అన్నీ కూడా ఇందులో మమేకమయ్యాయి ఉదాహరణకు నమాజ్, రోజా, సదఖా మరియు హజ్.
ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ప్రజలు రంజాన్ యొక్క చివరి భాగంలో అతి ఎక్కువగా కార్యాచరణను మరియు ఆరాధన లో పాల్గొంటారు. కానీ వాస్తవంగా జిల్ హిజ్జ మాసం యొక్క మొదటి పది దినాలు వాటికంటే ఎంతో ప్రాధాన్యత గలవి కనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈ దినాలలో ఆరాధన చేయాలి.
తాబయీ లలో గొప్ప వ్యక్తి అయిన సయీద్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) జిల్ హిజ్జా యొక్క పది రోజులు వచ్చినప్పుడు,వారు తమ ప్రాణాలను పణంగా పెట్టేంత వరకు తీవ్ర ప్రయత్నంతో మరియు అంకితభావంతో ఆరాధన చేసేవారు. (ఫత్ హుల్ బారి)
మరియు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు: జిల్ హిజ్జా యొక్క రాత్రులలో దీపాన్ని సైతం ఆర్పకండి. అనగా అతి ఎక్కువగా ఆ రాత్రిల్లో ఖురాన్ పారాయణం మరియు తహజ్జుద్ చదువుతూ ఉండండి.
కాబట్టి! మనం ఈ రోజుల్లో అల్లాహ్ యొక్క సహాయం కోరుతూ ఉండాలి మరియు అనేక మంచి పనులు చేస్తూ ఉండాలి. ఆచరించడంలో ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నించాలి. మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండి ఈ ఆచరణల ప్రతిఫలం ఆశించాలి. ఎందుకంటే ఈ రోజు ఆచరించే అవకాశం ఉంది రేపు లెక్క తీసుకోబడే రోజు(తీర్పు దినం) అక్కడ మనకు ఆచరించడానికి అవకాశం లభించదు.
అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఓ విశ్వాసులారా! జిల్ హిజ్జా యొక్క పది రోజులు రంజాన్ చివరి పది రోజుల కంటే గొప్పవని తెలుసుకోవాలి. మరియు ఈ రోజుల్లో ఎంతో శ్రమతో మరియు అంకితభావంతో ఆరాధన చేయాలి.
ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) ఈ విధంగా వ్రాశారు: ఈ పది రోజులు అన్ని రోజుల్లో కెల్లా హదీసుల్లో వీటి ఘనత గురించి తెలుపబడింది. మరియు చాలామంది ధార్మిక పండితులు కూడా ఈ రోజులను రంజాన్ యొక్క చివరి భాగంపై ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే రమజాన్ చివరి భాగంలో ఉన్న ఆరాధనలే ఈ దినాల్లో కూడా ఆచరించబడతాయి. నమాజ్, రోజా, సదఖా మొదలైనవి. కానీ జిల్ హిజ్జా పది దినాలకు గల ప్రత్యేకత ఏమిటంటే అందులో హజ్ ఆరాధన ఉంది.
మరొక వాక్యంలో ఇలా ఉంది: రమజాన్ యొక్క చివరి పది రోజులు ఘనత కలిగినటువంటివి ఎందుకంటే అందులో లైలతుల్ ఖాదర్ రాత్రి ఉంది అది 1000 నెలల కంటే ఉన్నతమైనది.
మరొక వర్గం వారు మధ్యస్తంగా ఇలా తెలియజేశారు: జిల్ హిజ్జా యొక్క మొదటి పది దినములు మరియు రంజాన్ యొక్క చివరి పది రాత్రులు ఎంతో ఘనత కలిగినటువంటివి. (అల్లాహ్ కు బాగా తెలుసు)
మరియు మీరు తెలుసుకోండి! అల్లాహ్ మిమ్మల్ని కరుణించుగాక! ఖుర్బానీ ఇచ్చేటువంటి వ్యక్తి వెంట్రుకలను గోళ్లను తీయడం నుండి వారించబడింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా తెలియజేశారు: మీరు జిల్ హిజ్జా మాసం నెలవంకను చూడగానే ఖుర్బానీ యొక్క సంకల్పం గనుక ఉంటే మీరు మీ వెంట్రుకలను మరియు గోళ్ళ ను తీయకండి. (ముస్లిం).
మరొక హదీసులో ఇలా ఉంది: ఎవరైతే ఖుర్బానీ యొక్క సంకల్పం చేశారో వారు జిల్ హిజ్జ మాసం ప్రారంభం అవగానే వెంట్రుకలను మరియు చర్మాన్ని కత్తిరించరాడు. (ముస్లిం)
ఓ ముస్లిం లారా! ఇస్లాం యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే వాటిని దూరం చేస్తుంది. కనుక ఏ వ్యక్తి అయినా వెంట్రుకలు గోళ్లు మరియు చర్మాన్ని తీసేటువంటి అవసరం వస్తే తీసేయవచ్చు ఇబ్నే ఉసైమీన్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరికైనా వెంట్రుకలు గోళ్ళు మరియు చర్మం కత్తిరించేటువంటి అవసరం వస్తే వాళ్లు వాటిని తీయొచ్చు. ఉదాహరణకు; ఏదైనా గాయం కారణంగా వెంట్రుకలు తీయాల్సి వచ్చింది లేక గోరు ఊడిపోయింది లేక చర్మం తెగి వేలాడుతూ ఉంది ఆ సందర్భంలో కత్తిరించవచ్చు, అయితే ఇందులో వారిపై ఎటువంటి తప్పు ఉండదు.
ఓ ముస్లిం లారా! అదేవిధంగా ఒక హజీ ఖుర్బానీ చేసే సంకల్పం చేయగానే అతను కూడా ఇదే ఆజ్ఞ పరిధిలోకి వస్తాడు. ఉమ్రా పూర్తి చేసే వరకు వెంట్రుకలు చర్మం కత్తిరించరాదు ఒకవేళ ఉమ్రా పూర్తి చేస్తే అతను తన వెంట్రుకలు తప్పక తీయాలి (అతను ఖుర్బానీ ఇచ్చే సంకల్పం చేసుకున్నప్పటికీ) ఎందుకంటే ఉమ్రా తర్వాత వెంట్రుకలు తీయడం ఆరాధనలో భాగం. ఇది ఇబ్నే బాజ్ మరియు ఇబ్నే ఉసైమీన్ వారి మాట.
మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప విషయం గురించి తెలియచేశాడు అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.
(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు,సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.
ఓ అల్లాహ్! మాకు జిల్ హిజ్జా మాసం యొక్క పది దినాలను ప్రసాదించు. మరియు వాటిలో ఉపవాసం పాటించి నీ కొరకు తహజ్జుద్ నమాజ్ చదివే భాగ్యాన్ని ప్రసాదించు!
ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.
ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయ పడుతున్నాము మరియు ఆ స్వర్గం లోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము. మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
The 12 Islamic months in Telugu are:
1) ముహర్రం (Muharram), 2) సఫర్ (Safar),
3) రబీ అల్-అవ్వల్ (Rabi' al-Awwal),
4) రబీ అల్-ఆఖర్ (Rabi' al-Thani or Rabi' al-Akhir),
5) జుమాదాల్ అల్-అవ్వల్ (Jumada al-Awwal),
6) జుమాదాల్ అల్-ఆఖర్ (Jumada al-Thani),
7) రజబ్ (Rajab), 8) షాబన్ (Sha'ban),
9) రమాదాన్ (Ramadan), 10) శవ్వాల్ (Shawwal),
11) ధుల్-ఖదా (Dhu al-Qa'dah), and
12) ధుల్-హిజ్జా (Dhu al-Hijjah).
ధు అల్-హిజ్జా ఇస్లామిక్ క్యాలెండర్‌లో పన్నెండవ మరియు చివరి నెల, దీనిని తీర్థయాత్ర నెల (హజ్) అని కూడా పిలుస్తారు . ఇస్లాంలో యుద్ధం నిషేధించబడిన నాలుగు పవిత్ర మాసాలలో ఇది ఒకటి. "ధు అల్-హిజ్జా" అనే పేరు "తీర్థయాత్ర యజమాని" అని అనువదిస్తుంది.
ధు అల్-హిజ్జా యొక్క ముఖ్య లక్షణాలు:
హజ్:
ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒకటైన మక్కాకు వార్షిక తీర్థయాత్ర ఈ నెలలో జరుగుతుంది.
అరఫా దినం:
ధుల్-హిజ్జా తొమ్మిదవ రోజును అరఫా దినంగా పిలుస్తారు, ఇది ప్రత్యేక భక్తి మరియు ప్రార్థన దినం.
ఈద్ అల్-అధా:
ఈ ముఖ్యమైన ఇస్లామిక్ సెలవుదినం ధు అల్-హిజ్జా పదవ రోజున వస్తుంది, ఇది హజ్ తీర్థయాత్ర ముగింపును సూచిస్తుంది.
పవిత్ర మాసం:
ముహర్రం, రజబ్ మరియు జుమాద్ అల్-అఖిర్‌లతో పాటు ఇస్లాంలో నాలుగు పవిత్ర మాసాలలో ధు అల్-హిజ్జ ఒకటి.
యుద్ధ నిషేధం:
హజ్ కోసం మక్కాకు ప్రయాణించే మరియు తిరిగి వచ్చే యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి ధు అల్-హిజ్జా సమయంలో పోరాటం సాంప్రదాయకంగా నిషేధించబడింది.
దుల్ హిజ్జాలో త్యాగం ఏమిటి?
ఖుర్బానీ అంటే త్యాగం. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ మాసం ధుల్ హిజ్జా సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఒక జంతువును - మేక, గొర్రె, లేదా ఒంటెను - వధిస్తారు - ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను దేవుని కొరకు బలి ఇవ్వడానికి చూపిన సంసిద్ధతను ప్రతిబింబించడానికి.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ ఈ (పది) రోజుల కంటే అల్లాహ్ కు సత్కార్యాలు అత్యంత ప్రియమైనవి
ఇస్లామిక్ ధర్మంలో దుల్ హిజ్జా అంటే ఏమిటి?
ఈ నెల యొక్క అరబిక్ పేరు, ధు అల్-హిజ్జా, అంటే "తీర్థయాత్ర యజమాని" లేదా "తీర్థయాత్ర నెల" అని అర్థం. ఈ నెలలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం యాత్రికులు కాబాను సందర్శించడానికి మక్కాలో సమావేశమవుతారు. హజ్ ఆచారాలు ఎనిమిదవ రోజున ప్రారంభమై నాలుగు లేదా ఐదు రోజులు కొనసాగుతాయి.
10 DAYS
- ఎక్కువ ప్రార్థనలు చేయడం ( నఫిలా ).
- ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయండి.
- ఉపవాసం (ఈ పది రోజులు, ముఖ్యంగా అరఫా ).
- దానధర్మాలు ( సదఖా ) చేయడం.
- వారికి ఆర్థిక స్తోమత ఉంటే హజ్ పుణ్యం ఆచరించండి.
- వీలైనంత ఎక్కువ దిక్కర్ చేయండి ( తహ్లీల్, తక్బీర్, తహ్మీద్ ).
"ఈ పది రోజుల కంటే అల్లాహ్ ముందు గొప్ప రోజులు లేదా మంచి పనులు అతనికి అత్యంత ప్రియమైన రోజులు లేవు , కాబట్టి వాటిలో తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్‌లను ఎక్కువగా పఠించండి." - అహ్మద్.
దుల్ హిజ్జా 8 నుండి 12 లేదా 13 వ తారీకు ఉందా?
హజ్ యాత్ర ప్రతి సంవత్సరం ఒకే సమయంలో జరుగుతుంది - ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పన్నెండవ నెల అయిన జుల్ హిజ్జా నెలలో.
హజ్ జుల్ హిజ్జా 8వ తేదీన ప్రారంభమై జుల్ హిజ్జా 13వ తేదీ వరకు కొనసాగుతుంది .
ఇస్లామిక్
ఆచరణలో జుల్-హిజ్జా యొక్క ప్రాముఖ్యత
ఈ నెలలోని మొదటి పది రోజులు ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత
పవిత్రమైనవిగా పరిగణించబడతాయి . ఈ రోజులను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)
ప్రత్యేకంగా ఆశీర్వదించబడినవిగా హైలైట్ చేశారు, ఇవి భక్తిని మరియు
ధర్మకార్యాలను పెంచుతాయి.
హజ్ ఖుర్బానీ ని ఏమంటారు?
ఉధియా (అరబిక్: أضحية), సాధారణంగా ఖుర్బానీ అని పిలుస్తారు (అరబిక్: قربانى) అనేది సాధారణంగా దుల్ హిజ్జా 10 వ తేదీన చేసే జంతు బలి.
History: 8 జిల్ హజ్ నాడు ఏం జరుగుతుంది?
కాబా దగ్గర రక్తపాతం నివారించడానికి, ఇమామ్ హుస్సేన్‌ను చంపాలనే ఉద్దేశ్యంతో యాజిద్ సైన్యం హాజీల దుస్తుల కోడ్‌లో ఉండటంతో, 8వ తేదీన జిల్‌హాజ్ ఇమామ్ హుస్సేన్ (అ) తన హజ్‌ను ఉమ్రాగా మార్చుకుని, కుటుంబ సభ్యులు మరియు సహచరులతో కలిసి కర్బలా వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు .
దుల్ హిజ్జా గురించి అల్లాహ్ ఏమన్నాడు?
దుల్-హిజ్జా ఒక
పవిత్ర మాసం
అల్లాహ్ ఇలా అంటున్నాడు: “నిశ్చయంగా, అల్లాహ్ నిర్ణయించిన నెలల సంఖ్య పన్నెండు - అల్లాహ్
గ్రంథంలో1 ఆకాశాలనూ, భూమినీ
సృష్టించిన రోజు నుండి - వాటిలో నాలుగు పవిత్రమైనవి. అదే సరైన మార్గం. కాబట్టి ఈ
నెలల్లో ఒకరికొకరు అన్యాయం చేసుకోకండి.
ఉదియా (అరబిక్: أضحية), సాధారణంగా ఖుర్బానీ (అరబిక్: قربانى ) అని పిలుస్తారు, ఇది సాధారణంగా దుల్ హిజ్జా 10 వ తేదీన చేసే జంతు బలి . ఇది బుద్ధిమంతుడు, పరిణతి చెందినవాడు, తగినంత సంపద కలిగి ఉన్నవాడు మరియు జకాత్ తప్పనిసరి అయిన మరియు ముసాఫిర్ కాని ప్రతి ముస్లింపై తప్పనిసరి .
హజ్ యాత్రికులకు ఉధియా విధింపు గురించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి . హనఫీ మద్హబ్ ప్రకారం , ఉధియా మక్కా నివాసితులకు అంటే ముఖిమ్‌లకు మాత్రమే తప్పనిసరి. ముసాఫిర్ అయిన యాత్రికుడికి ఇది తప్పనిసరి కాదు . ఇతర ఆలోచనా విధానాల ప్రకారం, ఉధియా రెండు సందర్భాల్లోనూ తప్పనిసరి కాదు కానీ ముస్తహబ్‌గా పరిగణించబడుతుంది .
ఉదియాను ప్రపంచంలో ఎక్కడైనా నిర్వహించవచ్చు మరియు ఇంటి నుండి బయలుదేరే ముందు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదియా కూపన్లను మక్కా మరియు మినాలోని కియోస్క్‌ల నుండి లేదా మక్కా హిల్టన్ టవర్స్‌లో ఉన్న అల్-రాజ్హి బ్యాంక్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
అల్లాహ్ ప్రమాణం
అల్లాహ్ ఖురాన్‌లో ప్రస్తావించాడు. అలాగే, ఆయన మనకు దుల్ హజ్జా నెల మొదటి పది రోజుల గొప్ప విలువను చూపించాడు , వాటిపై ప్రమాణం చేశాడు.
ఖురాన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: “ఉదయం సాక్షిగా; మరియు పది రాత్రుల సాక్షిగా.” – సూరత్ అల్-ఫజ్ర్ – 1 & 2 వచనాలు.
ఖురాన్ పండితులలో చాలామంది ప్రకారం, అల్లాహ్ ప్రమాణం చేయడానికి తగినంత ముఖ్యమైన రోజులుగా పేర్కొనబడినవి దుల్-హిజ్జా నెల మొదటి పది రోజులు . కాబట్టి, ఈ రోజులు మన ధర్మకార్యాలను మరియు ఆరాధనలను పెంచుకోవడానికి, మన మంచి పనులన్నింటినీ అల్లాహ్‌కు అంకితం చేయడానికి , ఆయన దయ మరియు క్షమాపణను అడగడానికి, బంధుత్వ సంబంధాలను నిలబెట్టడానికి, మంచిని ఆస్వాదించడానికి మరియు చెడును నిషేధించడానికి మన వంతు కృషి చేయడానికి ఒక శుభ సమయం.
ఈ శుభ దినాలలో చేయవలసిన చిట్కాలు
ఈ శుభ దినాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అల్లాహ్ సాన్నిహిత్యాన్ని మరియు క్షమాపణను పొందడానికి ప్రయత్నిస్తారు.
కాబట్టి వారు తమ ఆరాధనలను భక్తితో మరియు అల్లాహ్ కు పూర్తి సమర్పణతో పెంచుకుంటారు, ఆయన దయను పొందడానికి మరియు వారి పాపాలు మరియు తప్పులు క్షమించబడతాయని ఆశిస్తున్నారు.
ఈ రోజుల్లో అల్లాహ్ కు అత్యంత అనుకూలమైన కొన్ని ఆరాధనలు ఇక్కడ ఉన్నాయి .
ఖురాన్ చదవండి
ఖురాన్ చదవడం - అల్లాహ్ మాటలు - ఖురాన్ ఆయతులను పఠించడం ద్వారా మనకు గొప్ప ప్రతిఫలాలను ఇస్తుంది ; మీరు చదివే ప్రతి అక్షరానికి, మీరు ఒక మంచి కార్యం (హసనా) పొందుతారు.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ఖురాన్ చదవండి, ఎందుకంటే అది నిశ్చయంగా ప్రళయ దినాన దాని సహచరులకు మధ్యవర్తిగా వస్తుంది.” - ముస్లిం.
కాబట్టి, ఈ పది రోజుల్లో మీ సమయాన్ని ఖురాన్ పఠనం చేయడానికి మరియు దానిలోని ఆయతులను బాగా అర్థం చేసుకోవడానికి వెచ్చించండి, ఇది ఇహలోకంలో మరియు పరలోకంలో విజయానికి దారితీస్తుంది.
మరియు గుర్తుంచుకోండి, ఇతర రోజులలో ఖురాన్ చదవడం వల్ల మనకు 10 గుణించిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఖురాన్ చదవడం వల్ల మనకు లభించే ప్రతిఫలాలను ఊహించుకోండి!
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ఎవరైతే అల్లాహ్ గ్రంథం నుండి ఒక లేఖను చదువుతారో , అతనికి ఒక ప్రతిఫలం ఉంటుంది. మరియు ఆ ప్రతిఫలం 10 గుణించబడుతుంది. నేను అలీఫ్, లామ్, మీమ్ ఒక అక్షరం అని చెప్పడం లేదు, బదులుగా నేను “అలీఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం, మరియు “మీమ్” ఒక అక్షరం అని చెబుతున్నాను.” – తిర్మిది .
నవాఫిల్‌లో పెరుగుదల
అల్లాహ్ సుబ్హానహు వ త'ఆలా తన సేవకులు తన కరుణను కోరుతూ, కష్టపడటం చూడటానికి ఇష్టపడతాడు. ఆరాధనలలో ఒకటి ఎక్కువ ప్రార్థనలు చేయడం - మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అల్లాహ్ తో మాట్లాడతాము - మరియు అల్లాహ్ కు ప్రార్థన చేయడం కంటే గౌరవనీయమైన కార్యం మరొకటి లేదు .
నఫీలా (అదనపు ప్రార్థనలు) ప్రార్థన తప్పనిసరి ఆరాధన కాదు; కాబట్టి, నఫీల్ ప్రార్థన చేసేవారికి అల్లాహ్ నుండి మంచి ప్రతిఫలం లభిస్తుంది మరియు ఈ దీవించిన పది రోజులలో చేసినప్పుడు ఈ ప్రతిఫలాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ధిక్ర్ లో పెరుగుదల
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ఈ పది రోజుల కంటే అల్లాహ్ ముందు గొప్ప రోజులు లేవు లేదా మంచి పనులు అతనికి అత్యంత ప్రియమైనవి కావు, కాబట్టి వాటిలో తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీద్‌లను ఎక్కువగా పఠించండి.” – అహ్మద్ .
1. తహ్మీద్: అల్-హమ్దు లిల్లాహ్ (సర్వ స్తోత్రాలు దేవునికే)
2. తహ్లీల్: లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు)
3. తస్బీహ్: సుభాన్-అల్లాహ్ (దేవునికి మహిమ కలుగుగాక)
తక్బీర్ ను ఈ క్రింది విధంగా కూడా పఠించవచ్చు:
"అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్-అల్లాహ్, అల్లాహు అక్బర్, వ లిల్లాహ్ హిల్-హమ్ద్." – అర్థం –
అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు; అల్లాహ్ మహా గొప్పవాడు, అల్లాహ్ కే స్తోత్రాలు.
ఇస్తిగ్‌ఫార్
ఇస్తిగ్‌ఫార్ అంటే నిర్లక్ష్యం మరియు అవిధేయతకు నాలుక మరియు హృదయం రెండింటి ద్వారా అల్లాహ్ నుండి క్షమాపణ కోరడం . ఇస్తిగ్‌ఫార్ పఠించడం వల్ల మీకు అల్లాహ్ నుండి గొప్ప ప్రయోజనాలు మరియు ప్రతిఫలాలు లభిస్తాయి .
అల్లాహ్ యొక్క దూత ( ﷺ) ఇలా అన్నారు: “ఎవరైనా నిరంతరం (అల్లాహ్ నుండి) క్షమాపణ కోరుతూ ఉంటే, అల్లాహ్ అతనికి ప్రతి బాధ నుండి బయటపడటానికి మరియు ప్రతి ఆందోళన నుండి ఉపశమనం కలిగించడానికి ఒక మార్గాన్ని నియమిస్తాడు మరియు అతను ఊహించని విధంగా అతనికి జీవనోపాధిని అందిస్తాడు.” – అబూ దావూద్.
- ఇస్టిగ్‌ఫార్ ఒత్తిడి మరియు ఆందోళనను తొలగిస్తుంది.
- ఇస్తిగ్‌ఫార్ దయ యొక్క తలుపు తెరుస్తుంది.
- ఇస్తిగ్‌ఫార్ జీవనోపాధిని అందిస్తుంది.
- పాపాలను తుడిచే సాధనం.
- మీ దుఆ (ప్రార్థన) అంగీకరించబడింది.
ఉపవాసం
ఒక హదీస్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా అన్నాడు: “ఆదమ్ కుమారుని కర్మలన్నీ అతని కోసమే, ఉపవాసం తప్ప, అది నా కోసమే, దానికి నేను ప్రతిఫలం ఇస్తాను.” – బుఖారీ .
ఉపవాసం అనేది అల్లాహ్ స్వయంగా సుబ్హానహుగా ఇచ్చే ఏకైక మంచి కార్యం . మరియు అల్లాహ్ తన మతాన్ని పరిపూర్ణం చేసిన అరఫా దినాన ఉపవాసం ఉండటం.
ప్రవక్త (స) ఇలా అన్నారు: “అరఫా ఉపవాసం గత మరియు రాబోయే రెండు సంవత్సరాల పాపాలను పరిహరించుకుంటుంది.” - ముస్లిం.
ఛారిటీకి విరాళం ఇవ్వండి
సదఖా ఇవ్వడం కూడా ఉత్తమమైన ఆరాధనలలో ఒకటి. ఖురాన్‌లోని అనేక శ్లోకాలు సమాజంలోని పేద మరియు బలహీన ముస్లింలకు దానధర్మాలు చేయడం యొక్క విలువను స్పష్టం చేస్తాయి.
మరియు ప్రవక్త ﷺ కూడా చాలాసార్లు సదఖా ఇవ్వడం గురించి మాట్లాడారు . ఆయన ﷺ తన సహచరులను వీలైనప్పుడల్లా సదఖాను దానం చేయమని ప్రోత్సహించారు, ముఖ్యంగా ఈ పది రోజులలో, ఎందుకంటే మీ సదఖా లేదా జకాత్ యొక్క ప్రతిఫలం గరిష్టంగా మరియు విస్తరింపజేయబడుతుంది. మీ దాతృత్వం పరలోక తీర్పు రోజున కూడా మీకు సహాయం చేస్తుంది.
ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “పునరుత్థాన దినమున విశ్వాసుల నీడ వారి దానధర్మాలుగా ఉంటుంది. ” - తిర్మిది .
ఖుర్బానీ ఖురాన్ లో వ్రాయబడిందా?
ఖురాన్ మరియు హదీసులు. ఖుర్ఆన్ లో ఖుర్బాన్ అనే పదం మూడుసార్లు కనిపిస్తుంది : ఒకసారి జంతు బలిని సూచిస్తూ మరియు రెండుసార్లు దేవునికి దగ్గరయ్యే ఏదైనా చర్య యొక్క సాధారణ అర్థంలో త్యాగాన్ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, దబీహా అనేది ఉదియా రోజు వెలుపల సాధారణ ఇస్లామిక్ వధను సూచిస్తుంది.
హజ్ 10 రోజులు ఎందుకు?
"దుల్ హిజ్జా పది రోజులు గొప్పగా విశిష్టమైనవిగా ఉండటానికి అత్యంత స్పష్టమైన కారణం ఈ కాలంలో జరిగే గొప్ప ఆరాధనలు - సలావత్ (ప్రార్థనలు), సియామ్ (ఉపవాసం), సదఖా (దానధర్మాలు) మరియు హజ్ (తీర్థయాత్ర) - సమావేశమే . ఈ గొప్ప పనులు మరే ఇతర కాలాల్లోనూ కలిసి ఉండవు."
ముజ్దలిఫా ఎప్పుడు బయలుదేరాలి?
మినాలో ఏమి పఠించాలి?
Meeqat అర్థం?
భర్త భార్యకు ఖుర్బానీ ఇవ్వవచ్చా?
ఖుర్బానీ ఎందుకు ఖరీదైనది?
దుల్ హిజ్జా సమయంలో జుట్టు కత్తిరించవచ్చా?
దుల్ హిజ్జా సమయంలో ఏ సూరత్ చదవాలి?
9 వ జిల్ హజ్ పేరు ఏమిటి?
షియాలు దుల్ హిజ్జా జరుపుకుంటారు?
ముస్లింలు హజ్ యాత్రకు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారు?
తవాఫ్ దేనికి?
అరఫా మరియు అరఫా మధ్య తేడా ఏమిటి?
ఖుర్బానీ క్రూరమైనదా?
కుర్బానీ ఎన్ని?
ఈద్ పండుగకు ఆడ మేకను బలి ఇవ్వవచ్చా?
ఖుర్బానీ ఫర్జ్ లేదా సున్నత్?
హలాల్ ఖురాన్ లో వ్రాయబడిందా?
మొదటి ఖుర్బానీ ఎవరు?
హజ్ 7వ రోజు ఏం జరుగుతుంది?
ఇస్లాం మతంలో ముఖ్యమైన రోజు ఏది?
హజ్ సమయం ఎంత?
బక్రా ఈద్ నాడు మేకలను ఎందుకు బలి ఇస్తారు?
హజ్ లో nahr అర్థం?
మహమ్మద్ ప్రవక్త మరణం తరువాత మొదటి ఖలీఫా ఎవరు?
ఇస్లాంలో భర్త తన భార్య డబ్బులు తీసుకోవచ్చా?
చనిపోయినవారికి ఖుర్బానీ ఇవ్వవచ్చా?
భార్య తరపున భర్త జకాత్ చెల్లించవచ్చా?
జుట్టు ఎప్పుడు కత్తిరించకూడదు?
ముస్లింలు హజ్ తర్వాత జుట్టు ఎందుకు కత్తిరించుకుంటారు?
ఇస్లాంలో గోర్లు కత్తిరించవచ్చా?
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment