- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అస్సలమలేకుం వారహ్మతుల్లహి వాబరకాతుహు
అవుజుబిల్లాహి మినిషైతాన్ నిర్రజీం,
బిస్మిల్లః హిర్హ్మాన్ నిర్రహీం
ఖురాన్ & హదీసుల ఆదారంగా చూసినట్లయితే
ఖురాన్లోని వాక్యం 59:7, 49:1, 47:33
ప్రవక్త ముహమ్మద్ (స) మీకు ఇచ్చినదానిని పుచ్చుకోండి,
దేనినున్డైతే మిమ్మల్ని ఆపారో దానినుండి ఆగిపోండి,ల ఆయన్ని మించిపోయే ప్రయత్నం
చేయవద్దు.
అల్లాహ్ & దూతలు – ప్రవక్త (స)పై
దరూద్ పంపుతారు. మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి (ఖురాన్ ఆహజాబ్ :56)
ప్రవక్త ముహమ్మద్ (స) గారి పేరు వినికూడా
దరూద్ చెప్పని వారు నాశనమైపోతారని, ప్రవక్త (స) చెప్పారని అబూహురైరా రజి) గారు
తెలియచేసారు.
((9:128)మీ దగ్గరకు స్వయంగా
మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ
కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను
వాత్సల్యం కలవాడు, దయామయుడు.
(9:129)ఇక వారు గనక వైముఖ్యధోరణిని కనబరుస్తే “నాకు అల్లాహ్
చాలు. ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు. నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన
మహోన్నతమైన పీఠానికి (అర్ష్‌కు) అధిపతి” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
(21:108)వారికి చెప్పు: "మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని మాత్రమే నా
వద్దకు సందేశం (వహీ) పంపబడుతోంది. మరి మీరు కూడా విధేయులవుతారా?"
(21:109)ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే వారికీవిధంగా చెప్పెయ్యి:
"నేను మిమ్మల్ని సమానంగా హెచ్చరించాను. మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం
సమీపంలో ఉందో, దూరాన ఉందో నాకైతే తెలియదు."
(21:110)అయితే మీరు బిగ్గరగా పలికేదీ ఆ ప్రభువుకు తెలుసు. మీరు దాచి
పెట్టేది కూడా ఆయనకు తెలుసు.
(21:111)బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది
(చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు.
(21:112)"ఓ ప్రభూ! న్యాయంగా తీర్పు చెయ్యి. మా ప్రభువు అపార కరుణామయుడు.
మీరు కల్పించే విషయాలపై ఆయన సహాయమే కోరబడుతోంది" అని (ప్రవక్త) స్వయంగా
పలికాడు.
(33:22)విశ్వాసులు (అవిశ్వాసుల) సేనలను చూడగానే (అప్రయత్నంగా) ఇలా
అన్నారు: "అల్లాహ్, ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్, ఆయన ప్రవక్త
చెప్పింది నిజమే." ఆ సంఘటన వారి విశ్వాసాన్ని, ఆత్మ సమర్పణాభావాన్ని మరింత అధికం
చేసింది.
(33:38)అల్లాహ్ తన ప్రవక్త కోసం నిర్ధారించిన దానిని ప్రవక్త అవలంబించటం
ఏ విధంగానూ ఆక్షేపణీయం కాదు. పూర్వం గతించిన వారిలో కూడా దేవుని ఈ సంప్రదాయమే
ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ నిర్ణీత లక్ష్యాలతో కూడుకున్నదై ఉంటుంది.
(33:39)వారంతా (దైవప్రవక్తలంతా) అల్లాహ్ సందేశాలను అందజేసేవారు. అల్లాహ్‌కు
మాత్రమే భయపడేవారు. అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడేవారు కారు. లెక్క తేల్చటానికి
అల్లాహ్ ఒక్కడే చాలు.
(33:40)(ప్రజలారా!) ముహమ్మద్ (సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే
ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు.
అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
(33:41)ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.
(33:42)ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.
(33:45)ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని)
సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము.
(33:46)ఇంకా - అల్లాహ్ ఆజ్ఞచే ఆయన వైపుకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే
దీపంగా (చేసి పంపాము).
(33:47)విశ్వసించిన వారికి అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహం ఉందన్న
శుభవార్తను నువ్వు వారికి వినిపించు.
(33:48)అవిశ్వాసుల, వంచకుల మాట వినకు. (వారి తరఫున జరిగే) వేధింపులను లెక్కచేయకు.
అల్లాహ్‌నే నమ్ముకో. కార్య సాధకునిగా అల్లాహ్ (ఒక్కడే) చాలు.
(33:56)నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై
కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి.
అత్యధికంగా అతనికి 'సలాములు' పంపుతూ ఉండండి.
(33:57)అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను బాధించేవారిపై ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్
శాపం పడుతుంది. ఇంకా వారి కోసం అత్యంత అవమానకరమైన శిక్ష సిద్ధంగా ఉంది.
(48:26)సత్య తిరస్కారులు తమ హృదయాలలో అహంభావాన్ని, అందునా అజ్ఞానకాలపు
అహంభావాన్ని పెంచుకున్న ఆ (క్లిష్ట) తరుణంలో అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన
తరఫున ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా)
వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా.
అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు.
(48:27)నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యంతో కూడుకున్న స్వప్నాన్ని
చూపించాడు. అల్లాహ్ తలిస్తే మీరు తప్పకుండా మస్జిదె హరాం లో సురక్షితంగా
ప్రవేశిస్తారు. శిరోముండనం చేయించుకుంటారు, తల వెంట్రుకలను కత్తిరించుకుంటారు.
మీకే భయమూ ఉండదు. మీకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మరి దానికి ముందే ఆయన ఓ
శీఘ్ర విజయాన్ని కూడా మీకు అనుగ్రహించాడు.
(48:28)తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి దాన్ని ఇతర
ధర్మాలన్నింటిపై పై చేయిగా ఉండేలా చేయటానికి పంపినవాడు ఆయనే. సాక్షిగా అల్లాహ్ యే
చాలు.
(48:29)ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు
అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం
దయార్ద్ర హృదయులు. దైవకృపను,
దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో
వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి
సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది.
వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది.
అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది.
ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను
అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన
వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.
(68:2)(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) నీ ప్రభువు అనుగ్రహం వల్ల
నీవు పిచ్చివాడవు కావు.
(68:3)నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది.
(68:4)ఇంకా, నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు.
ఖురాన్‌లో ఎంతమంది ప్రవక్తల ప్రస్తావన
ఉంది?
అల్లాహ్ మొత్తం 124,000
మంది ప్రవక్తలను వివిధ దేశాలకు
పంపాడని, ప్రవక్త ఆడమ్ మొదటి వ్యక్తి మరియు ప్రవక్త ముహమ్మద్ [సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అతని
సంతానం] చివరి వ్యక్తి అని మన కథనాలలో పేర్కొనబడింది. అయితే, ఖురాన్ వారందరి పేర్లను పేర్కొనలేదు. వారిలో 25
మంది పేర్లు మాత్రమే ఖురాన్‌లో
పేర్కొనబడ్డాయి. అల్లా ఖురాన్‌లో గొప్ప ప్రవక్తతో ఇలా అంటున్నాడు:
وَرُسُلًا قَدۡ قَصَصۡنَـٰهُمۡ عَلَيْكَ مِن قَبۡلُ وَرُسُلًا لَّمۡ
نَقۡصُصۡهُمۡ عَلَيْكَ
మరియు మేము ఇంతకు ముందు మీకు చెప్పిన
సందేశకులు మరియు మేము మీకు చెప్పని దూతలు [అందరూ దేవుని దూతలే]. 1
33:40 مَّا
كَانَ
مُحَمَّدٌ
أَبَا
أَحَدٍ
مِّن
رِّجَالِكُمْ
وَلَٰكِن
رَّسُولَ
اللَّهِ
وَخَاتَمَ
النَّبِيِّينَ
ۗ
وَكَانَ
اللَّهُ
بِكُلِّ
شَيْءٍ
عَلِيمًا
(ప్రజలారా!) ముహమ్మద్
(సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు.
ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.
33:41 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا
اذْكُرُوا اللَّهَ ذِكْرًا كَثِيرًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించండి.
33:42 وَسَبِّحُوهُ بُكْرَةً
وَأَصِيلًا
ఉదయం, సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి.
33:43 هُوَ الَّذِي يُصَلِّي
عَلَيْكُمْ وَمَلَائِكَتُهُ لِيُخْرِجَكُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۚ
وَكَانَ بِالْمُؤْمِنِينَ رَحِيمًا
మీపై తన కరుణానుగ్రహాలను పంపేవాడు ఆయనే. ఇంకా ఆయన దూతలు కూడా (మీపై
కారుణ్యం కురవాలని ప్రార్థిస్తారు)- ఆయన మిమ్మల్ని చీకట్ల నుంచి వెలికితీసి వెలుగు
వైపుకు తీసుకు వచ్చేటందుకు! అల్లాహ్ విశ్వాసుల పాలిట అపార కరుణామయుడు.
33:44 تَحِيَّتُهُمْ يَوْمَ
يَلْقَوْنَهُ سَلَامٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا
వారు ఆయన్ని (అల్లాహ్‌ను) కలుసుకున్న రోజున, వారికి 'సలాం'తో స్వాగత సత్కారాలు
లభిస్తాయి. వారి కోసం అల్లాహ్ గౌరవప్రదమైన పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
33:45 يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا
أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని)
సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించే వానిగా చేసి పంపాము.
33:46 وَدَاعِيًا إِلَى اللَّهِ
بِإِذْنِهِ وَسِرَاجًا مُّنِيرًا
ఇంకా - అల్లాహ్ ఆజ్ఞచే ఆయన వైపుకు పిలిచేవానిగా, వెలుగును విరజిమ్మే
దీపంగా (చేసి పంపాము).
33:47 وَبَشِّرِ الْمُؤْمِنِينَ
بِأَنَّ لَهُم مِّنَ اللَّهِ فَضْلًا كَبِيرًا
విశ్వసించిన వారికి అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహం ఉందన్న శుభవార్తను
నువ్వు వారికి వినిపించు.
33:48 وَلَا تُطِعِ الْكَافِرِينَ
وَالْمُنَافِقِينَ وَدَعْ أَذَاهُمْ وَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ وَكَفَىٰ
بِاللَّهِ وَكِيلًا
అవిశ్వాసుల, వంచకుల మాట వినకు. (వారి తరఫున జరిగే) వేధింపులను లెక్కచేయకు.
అల్లాహ్‌నే నమ్ముకో. కార్య సాధకునిగా అల్లాహ్ (ఒక్కడే) చాలు.
33:21 لَّقَدْ
كَانَ
لَكُمْ
فِي
رَسُولِ
اللَّهِ
أُسْوَةٌ
حَسَنَةٌ
لِّمَن
كَانَ
يَرْجُو
اللَّهَ
وَالْيَوْمَ
الْآخِرَ
وَذَكَرَ اللَّهَ
كَثِيرًا
నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది- అల్లాహ్
పట్ల, అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే ప్రతి
ఒక్కరి కొరకు.
68:1
ن ۚ
وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ ١
* నూన్. 1 కలం సాక్షిగా! 2 మరియు వారు (దేవ-దూతలు) వ్రాస్తున్నదాని సాక్షిగా!
68:2
مَا أَنتَ
بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ ٢
నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ము'హమ్మద్)
పిచ్చివాడవు కావు!
68:3
وَإِنَّ
لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ ٣
మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ
తరిగిపోని ప్రతిఫలం ఉంది.
68:4
وَإِنَّكَ
لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ ٤
మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన
శీలవంతుడవు! 3
قُلْ إِن
كُنتُمْ تُحِبُّونَ اللَّـهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّـهُ وَيَغْفِرْ
لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّـهُ غَفُورٌ رَّحِيمٌ ٣١
(ఓ ప్రవక్తా!) ఇలా
అను: ''మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమఉంటే మీరు నన్ను అనుసరిం చండి.
(అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు
అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.''
قُلْ
أَطِيعُوا اللَّـهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّـهَ لَا يُحِبُّ
الْكَافِرِينَ ٣٢
(ఇంకా) ఇలా అను: ''అల్లాహ్‌కు మరియు
సందేశహరునికి విధేయులై ఉండండి. ''వారు కాదంటే!
నిశ్చయంగా, అల్లాహ్ సత్య- తిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసు
కోవాలి). 19 (5/8)
إِنَّ
اللَّـهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ ٣٣
* నిశ్చయంగా
అల్లాహ్ ఆదమ్‌ను, నూ'హ్ ను ఇబ్రాహీమ్ సంతతివారిని మరియు 'ఇమ్రాన్
సంతతివారిని (ఆ యా కాలపు) సర్వలోకాల (ప్రజల)పై ప్రాధాన్యత నిచ్చి ఎన్నుకున్నాడు. 20
ذُرِّيَّةً
بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّـهُ سَمِيعٌ عَلِيمٌ ٣٤
వారంతా ఒకే పరంపరకు చెందిన వారు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
62:1
يُسَبِّحُ
لِلَّـهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ الْمَلِكِ الْقُدُّوسِ
الْعَزِيزِ الْحَكِيمِ ١
* ఆకాశాలలో నున్నవి
మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వ సార్వభౌముడు, 1 పరమ పవిత్రుడు, సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు
అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.
62:2
هُوَ
الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ
آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا
مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ ٢
ఆయనే ఆ నిరక్షరాస్యులైన 2 వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను
(ఆయాత్‌లను) చదివి వినిపిస్తు న్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి
గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికివారు అంతకు పూర్వం
స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిఉండే వారు.
62:3
وَآخَرِينَ
مِنْهُمْ لَمَّا يَلْحَقُوا بِهِمْ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٣
మరియు ఇంకా వారిలో చేరని ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన
సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
62:4
ذَٰلِكَ
فَضْلُ اللَّـهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّـهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ ٤
ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను
కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ అనుగ్రహశాలి, సర్వోత్తముడు.
21:107
وَمَا
أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ ١٠٧
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్త!) సర్వ లోకాల వారి కొరకు కారుణ్యంగా
మాత్రమే పంపాము. 52
21:108
قُلْ
إِنَّمَا يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۖ فَهَلْ أَنتُم
مُّسْلِمُونَ ١٠٨
(ఓ ము’హమ్మద్) ఇలా అను:
“నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వ’హీ) అవతరిప
జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన
మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?
21:109
فَإِن
تَوَلَّوْا فَقُلْ آذَنتُكُمْ عَلَىٰ سَوَاءٍ ۖ وَإِنْ أَدْرِي أَقَرِيبٌ أَم بَعِيدٌ
مَّا تُوعَدُونَ ١٠٩
ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: “నేను మీకు
అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో
లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు.”
21:110
إِنَّهُ
يَعْلَمُ الْجَهْرَ مِنَ الْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ ١١٠
నిశ్చయంగా, అయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్తపరిచేది మరియు దాచేది
అంతాతెలుసు.
الَّذِينَ
يَتَّبِعُونَ الرَّسُولَ النَّبِيَّ الْأُمِّيَّ الَّذِي يَجِدُونَهُ مَكْتُوبًا
عِندَهُمْ فِي التَّوْرَاةِ وَالْإِنجِيلِ يَأْمُرُهُم بِالْمَعْرُوفِ
وَيَنْهَاهُمْ عَنِ الْمُنكَرِ وَيُحِلُّ لَهُمُ الطَّيِّبَاتِ وَيُحَرِّمُ
عَلَيْهِمُ الْخَبَائِثَ وَيَضَعُ عَنْهُمْ إِصْرَهُمْ وَالْأَغْلَالَ الَّتِي
كَانَتْ عَلَيْهِمْ ۚ فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ
وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنزِلَ مَعَهُ ۙ أُولَـٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ١٥٧
“ఎవరైతే ఈ
సందేశహరుణ్ణి నిరక్ష్య రాస్యుడైన 68 ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్దవున్న తౌరాత్
మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడిఉన్నదో 69 అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి
నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధ మైన వస్తువులను ధర్మసమ్మతం చేసి, అపరిశుద్ధ మైన
వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారా లను మరియు వారి నిర్బంధాలను
తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన
జ్యోతిని అనుస రించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు.”
قُلْ يَا
أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّـهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ
مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ لَا إِلَـٰهَ إِلَّا هُوَ يُحْيِي وَيُمِيتُ ۖ
فَآمِنُوا بِاللَّـهِ وَرَسُولِهِ النَّبِيِّ الْأُمِّيِّ الَّذِي يُؤْمِنُ
بِاللَّـهِ وَكَلِمَاتِهِ وَاتَّبِعُوهُ لَعَلَّكُمْ تَهْتَدُونَ ١٥٨
(ఓ ము'హమ్మద్!) వారితో
ఇలా అను: “మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి
వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశ హరుడను. 70 భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యదేవుడు
లేడు;ఆయనే జీవన్మరణాలనుఇచ్చేవాడు. కావున అల్లాహ్‌ను మరియు ఆయన
సందేశహరుడు, నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్‌ను మరియు
ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు
మార్గదర్శకత్వం పొందుతారు!” 71
قُولُوا آمَنَّا بِاللَّـهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ ١٣٦
(ఓ ముస్లింలారా!)
మీరు ఇలా అనండి: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు
ఇబ్రాహీమ్ ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర
ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను)
విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం
(ముస్లింలం) అయ్యాము.”
لِّلَّـهِ
مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ
أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّـهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ
وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّـهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٢٨٤
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న దంతా అల్లాహ్‌దే! మీరు మీ మనస్సులలో
ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్ మీ నుంచి దాని లెక్క
తీసుకుంటాడు. 222 మరియు ఆయన తాను కోరినవానిని క్షమిస్తాడు మరియు తాను కోరినవానిని
శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
آمَنَ
الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ
بِاللَّـهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ
مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا
وَإِلَيْكَ الْمَصِيرُ ٢٨٥
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై
అవతరింపజేయబడిన దానిని విశ్వసిం చాడు 223 మరియు (అదేవిధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను
మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: ''మేము ఆయన
ప్రవక్తల మధ్య ఎలాంటి భేద భావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు
దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా
గమ్యస్థానం నీ వైపుకే ఉంది.
لَا
يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا
مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ
رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن
قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ
عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى
الْقَوْمِ الْكَافِرِينَ ٢٨٦
''అల్లాహ్, ఏ ప్రాణి పైననూ
దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దాని (పుణ్య) ఫలితం దానికి
లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ! మేము
మరచినా లేక తప్పుచేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి
భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు
మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున
సత్య-తిరస్కారులకు విరుధ్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు.''
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment