NAMAZ , Full namaz rakat, How to pray namaz for beginners, How to pray namaz sunni step by step pdf, How to pray namaz for female, नमाज, How to pray namaz step by step, Salah meaning English, Full namaz surah

 


అవుజుబిల్లాహి మినిషైతాన్ నిర్రజీమ్, బిస్మిల్లాహ్ హిరహ్మాన్ నిర్రహీమ్
అస్సలమలేకుం వారహ్మతుల్లాహి వాబరకాతుహు

ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా - అల్లాహ్ సృష్టి కర్త అని మనం నమ్ముతాం. మరియు అల్లాహ్ - దైవదూతలని, జిన్నులని, మనుషులని, చేసాడని, ప్రాణం ఉన్నవాటిని, ప్రాణం లేనివాటిని, భూమిఆకాశాలను, నక్షత్రాలు, గ్రహాలూ, ఖగోళాలు , స్వర్గం , నరకం - ఎలా ఎన్నింటినో సృష్ట్టించి నడిపిస్తున్నాడని -  ఖురాన్ మరియు హదీసులు, ఇస్లాం ఆధారంగా నమ్ముతాము. ఇలా నమ్మేవారిని విశ్వాసి లేదా ముస్లిం అని అంటారు. ఇంకా అనేక మంది ప్రవక్తలను మనుషులలో నుండి ఎన్నుకొని ఆ మనుషులకు మార్గదర్శకాలను ఆ ప్రవక్తల ద్వారా, గ్రంధాల ద్వారా తెలియచేసాడని నమ్ముతాం. ప్రళయదినం & విధివ్రాతను కూడా నమ్ముతాం. మరి అల్లాహ్ చివరి ప్రవక్త గా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాసలాం గారిని ఎన్నుకున్నాడని - ఆ ప్రవక్త కూడా ఒక మానవుడు + అల్లాహ్ యొక్క భక్తుడు అని మనందరం కూడా ఖురాన్ హదీసుల ఆధారంగా సాక్షం ఇస్తుంటాం.
 
ఆ అల్లాహ్ మనమీద కొన్ని బాధ్యతలు పెట్టాడు, అవి 
1 . కల్మా  2 . నమాజ్ 3 . ఉపవాసం 4 . జకాత్ 5 . హజ్

ఈ రోజు మనం నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము - ఈ నమాజ్ అల్లాహ్ ను ప్రతేకంగా ప్రదానము గా ఆరాధించే పద్ధతి. ప్రతి సమాజంలో చరిత్రలో ఈ నమాజ్ అనేది ఉంది . ఒక సమాజంలో ఎక్కువ నమాజులు , ఒక సమాజంలో తక్కువ నమాజులు, కానీ ప్రవక్త ముహమ్మద్(స) గారి ద్వారా ఈ సమాజంపై మీరాజ్ లో 5 నమాజులు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది . 

ఈ నమాజ్ ద్వారా ఇహలోకంలో, పరలోకంలో ఎటువంటి లాభాలు ఉన్నాయో ఖురాన్ & హదీశులలో చెప్పడం జరిగింది. ఈ నమాజ్ ని అల్లాహ్ యొక్క దైవదూత జిబ్రయీల్ (ఆ) గారు, ప్రవక్త ముహమ్మద్ (స) గారు, సహాబాలు, తాబియన్లు, తాబే తాబియన్లు, హదీసువేత్తలు ఎంతోమంది తెలియచేసారు. ప్రవక్తలు, సహాబాలు అలాంటివారు - వ్యాపారం , పరిపాలన , అనేక వృత్హులు, జాబులు చేసుకుంటూ, భార్య, భర్త, కుటుంబం, బంధుత్వ, స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ కూడా - నమాజు చదవడానికి , ఖురాన్ & ఇస్లాం నేర్చుకోవడానికి సమయాన్ని తీసేవారు. 

సహాబాలందరూ ఇస్లాం స్వీకరించినవారే , వారి కుటుంబాలకు, సమాజానికి , ఇస్లాం పరిచయంచేసారు . వారు ప్రాణాలు పోయే సమయాలలో కూడా నమాజ్ కోసం ఎక్కువ ప్రాముఖ్యత చూపించారు. ప్రయాణంలో, అనారోగ్యంతో, యుద్ధ సమయాలలో కూడా నమాజ్ కోసం సమయాన్ని తీసేవారు. వాహనంపైనా, నిల్చుని, కూర్చొని, పడుకొని వారు ఎటువంటి స్థితిని ఎదుర్కొంటే ఆ స్థితిలోనే నమాజ్ కోసం ప్రయత్నించేవారు. నమాజ్ కోసం వుజూ చేయడానికి నీళ్లు లేకపోతే తయమ్మమ్ చేసేవారు. ఒక నమాజ్ అయ్యిపోయాక తర్వాత నమాజుగురించి దృష్టిలో పెట్టుకొని వారి పనులు చేసుకుంటూ, ఎదురుచూస్తుండేవారు. అనుక్షణం అల్లాహ్ పట్ల భయం భక్తి గొరవం మర్యాద కలిగి ఉండేవారు. ప్రవక్త ముహమ్మద్ (స) గారి ఆదేశాల ప్రకారం గడిపేవారు.

ఆనాడు అక్కడ ఎడారి ప్రాంతం, కింద కాలిపోయే ఇసక, పైన ఖజూర్ చెట్టు ఆకులు కర్రలతో కట్టుకున్న మస్జీద్ లు, నీళ్లు వసతి లేనటువంటి వాతావరణం అది. భయం భయం గా దాకొన్ని నమాజ్ చేసే పరిస్థితులనుండి, బహిరంగంగా చదవగలిగే స్వతంత్రాన్ని తెచ్చుకున్న సమాజం అది. వారికి ఎటువంటి వసతులు లేకపోయినా అంటే ఉదాహరణకు అజాన్ కి మైకులు లేకపోయినా, చల్లటి నీళ్లు లేకపోయినా, అద్దాల మస్జీద్ లు, ఏసి సౌకర్యాలు, ఫాన్లు లేకపోయినా - నమాజ్ సమయానికి మస్జీద్ లు, వీధులు అన్నీ నిండిపోయేయి. ఆనాడు అదే ఖురాన్, ఈనాడు అదే ఖురాన్, ఆనాడు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ (స) గారి వాక్కులు + పద్ధతులే ఈనాటి హదీసులు. మనఁదరి ఆరాధనలు అల్లాహ్ కె సాంతం + అర్పితం. మనందరికీ నమాజ్ పద్ధతి ఒక్కటే, ఖురాన్ ఒక్కటే, ఇస్లాం ఒక్కటే, ఖిబ్లా ఒక్కటే, ప్రవక్త (స) గారి పద్ధతులు ఒక్కటే, మక్కా కాబా ఒక్కటే, కయామత్ ఒక్కటే, అందరం మరలిపోవాలసింది అల్లాహ్ వద్దకే. ఆ నాడు అదే ఇస్లాం, ఈనాడు అదే ఇస్లాం... కానీ... 

ఈనాడు మంచి మంచి సౌకర్యాలతో మస్జీద్ లు ఉన్నాయి. డిజైన్లు, అందచందాలు, అంతస్తులు, మైకులు, చల్లటి నీళ్లు, టక్నాలజీ వుజూ కానాలు, మిరిమిట్లు గొలిపించే లైటింగ్ లతో ఇంకా అనేక సౌకార్యాలతో మస్జీద్ లు ఉన్నాయి. కొన్ని మస్జీద్ ల కింద, బయట, భాగంలో దుకాణాలు, ఇండ్లు, వ్యాపార సంస్థలు చూస్తుంటాం. మరికొన్ని చోట్ల చుట్టూ ముస్లింల ఇండ్లు దగ్గర్లో మస్జీద్ చూస్తుంటాం. కొన్ని మస్జీద్ లలో ఇమామ్, మోజాన్ లకు ఉండడానికి సౌకర్యాలు చూస్తుంటాం. కొన్ని ఊర్లలో ముస్లింలు ఉన్నా మస్జీద్ లు ఉండని ప్రాంతాలు కూడా చూస్తాం. కొన్ని ప్రాంతాలలో మస్జీద్ లు ఉన్నా నమాజ్ చేసే వారు లేక పాడుబడ్డ కట్టడాలుగా పడివుండటాన్ని మనం ఈనాడు ఎక్కడో ఒకదగ్గర చూస్తూనేఉన్నాం. మస్జీద్ లు + నమాజ్ లు కొంతమందికేనా? పోనీ ఇమాంలు, మోజన్లు, ముసలివారికేనా? మనకు ఖురాన్ హదీసులు ఇస్లాం నేర్పిందేంటి?

మనలో కొంతమందికి : అజాన్ అవుతూ ఉంటది, కానీ జవాబు చెప్పడానికి కూడా నోరురావడం లేదు, దరూద్ చదవలేకపోతున్నాము. కొంతమంది మస్జీద్ లకి వెళ్ళుతున్నారు, మనం కేవలం శుక్రవారం మాత్రమే వెళ్లుతున్నాము, మనలో కొంతమంది ఆ శుక్రవారం కూడా చదువులు/జాబులు/ప్రయాణాలు లాంటి అనేక సాకులతో వెళ్లలేకపోతున్నాము. నమాజ్ రూల్స్ మనకు ఎంతవరకు తెలుసు? కొన్ని నమాజులు చేస్తున్నాం, కొన్ని వదిలేస్తున్నాం. పెండ్లిళ్లు + ఫంక్షన్లు + ప్రోగ్రామ్లు ఉంటె నమాజ్ వదిలేయవచ్చా? ఆ మేకప్ లు తర్వాత వుజూ చేయడం నమాజ్ కాంగతేంటి? శుక్రవారం నమాజ్ విలువ ఏంటి? అజాన్ గొప్పదనం? మనం మనకొచ్చిన భాషలో ఖురాన్ ఒక్కసారైనా పూర్తి చేశామా? మరి జీవితంలో ఎన్నోభాషలలో వున్నపుస్తకాలను మనం పూర్తిచేస్తున్నాము కదా? ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో, బ్రతికి ఉన్నపుడు + చనిపోయాక కూడా ఉపయోగపడే ఈ ఖురాన్ ని మనము ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాము. ఈనాడు ఇంటర్నెట్ లో ఆప్ లలో అన్ని బాషలలో ఖురాన్ దొరుకుతుంది కదా? అదే మొబైలలో, టీవీ లో ఎన్నో చూస్తున్నాం, చేస్తున్నాం - మరి ఈ ఖురాన్ కి, నమాజ్ కి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నాము. - మనం ఖురాన్, నమాజ్, ఇస్లాం కి ఎందుకు దూరంఅవ్వుతున్నామో - దీనికి సమాధానం కూడా ఖురాన్ లో ఉంది తెలుసా.. సరే మనం నమాజ్ గురించి మాట్లాడుకుంటున్నాము కదా...

సాధారణంగా మనలో అతితక్కువమంది నమాజ్ సమయానికి అజాన్ విని, మస్జీద్ కి వెళ్లి, ఇమామ్ వెనుక ముక్తదీలతో కలసి, జమాత్ తో నమాజ్ చదువుతూ ఉంటాం, మస్జీద్ లలో శుక్రవారం నిండినంత జనం, ఇతర దినాలలో నమాజులలో కనిపియ్యదు. మనలో కొంతమంది రాత్రి మొబైల్, టీవీ, వర్క్ లలో బిజీగా వుండి, రాత్రి లేటుగా పడుకుంటాం, ఉదయం ఫజర్ నమాజ్ అజాన్ వినం, వినిపించినా జవాబు చెప్పం, లేదా వినిపియ్యకుండా ఉంటె బాగుండూ అనుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. ఆ నమాజ్ వదిలేస్తాం. అదే జాబ్, బిజినెస్, పరీక్షలు, హాస్పిటల్ అపాయింట్మెంట్ లేదా పెండ్లి, ఫంక్షన్ లాంటి ఇతర వాటికి కచ్చితంగా లేచి, స్నానంచేసి, ఎవరూ బలవంతం చేయకపోయినా, మన ఇష్టపూర్వకంగా తయారై వెళ్తాము. మరి నమాజ్ విషయానికొస్తే ఎదో అయిపోతుంది మనకు. సరే ఫజర్ నమాజ్ తర్వాత రెండవది జొహార్నమాజ్ అప్పుడు మనం బిజీ, తర్వాత అసర్నమాజ్ అప్పుడూ బిజీ, తర్వాత మగ్రిబ్ నమాజ్ అప్పుడూ బిజీయే, తర్వాత ఇషా నమాజ్ అప్పుడూ బిజీనే. మరి నమాజ్ ఎప్పుడు, ఎవరికోసం, మనజీవితంలో అతిముఖ్యమైన వ్యవస్తాగా అల్లాహ్ మనకు నమాజ్ వ్యవస్థను ముందుగా స్థాపించమన్నాడు. మరి మనం దానికే దూరం అయిపోతున్నాము. అసలు ఖురాన్ & హదీసులలో దీనిగురించి అల్లాహ్ మనకు ఎం ఆదేశాలు ఇచ్చాడో తెలుసా? ఇప్పుడు వాటిలో కొన్ని విషియాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. (ఇన్షాల్లాహ్).....

మస్జీద్ లలో పదవులు కావాలి, సమాజంలో పదవులు కావాలి, ముస్లిం పేరుమీద పథకాలు - రాయితీలు కావాలి, ముస్లిం కోటాలో లభించే అన్ని వసతులు కావాలి - కానీ నమాజ్ విషయానికొస్తే ఏమఔతుంది మనకు? కొన్ని ఆటలు ద్వారా నమాజ్ కి దూరం అవుతున్నాము, టీవీలు, మొబైలులో టైంపాస్ ద్వారా నమాజ్ కి దూరం అవుతున్నాము, ఇంకా ఎటువంటి వాటి ద్వారా నమాజ్ కి దూరం అవుతున్నామో మీరే చెప్పాలి. మస్జీద్ ముందునుండి వెళ్తుంటాము కానీ లోపలి వెళ్లి నమాజ్ చేయలేకపోతున్నాము. మనకి ఖురాన్ గురించి తెలుసు హదీసులు / ఇస్లాం గురించి తెలుసు - వీటికి సంబంధించి చాలా జ్ఞానం మనకుంది, ఐన నమాజులు దూరం. ఈనాడు ఎందుకు మస్జిదులలో జనం లేక కాళీగావున్నాయి. ఒక్కొక్కదగ్గర కేవలం ఇమామ్ మాత్రమే నమాజ్ చేసుకుంటున్నారు, ఒక్కొక్క దగ్గర ఇమామ్/మోజాన్ మాత్రమే నమాజ్ చేసుకుంటున్నారు. మరోదగ్గర ముగ్గురు లేదా ఒకలైన్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ అక్క ఆ ఏరియాలో ముస్లింలు కుటుంబాలు మాత్రం చాలానే ఉన్నాయి. మనం అనుకుంటాం - ఈ సారి రంజాన్ నుండి పూర్తిగా అన్ని నమాజులు చేయాలి అని, ఇంకొంతమంది అనుకుంటారు రేపటినుండి లేదా శుక్రవారం నుండి పూర్తిగా నమాజులు చేయాలి అని, ఇంకొంతమంది అనుకుంటాం కొంచెం సెటిల్ అయ్యాక లేదా పలానా పని పూర్తయ్యాక నమాజులు ప్రారంభిద్దాం అని. కానీ మనం అనుకున్న రోజులు వస్తాయి వెళ్తాయి, మనం మాత్రం మళ్ళీ అలానే ఉంటాం. దీనికి పరిస్కారం ఏంటి?

ఇప్పుడు మస్జీద్ లకు, నమాజ్ లకు, ఖురాన్ కి, ఇస్లాం పద్ధతులకు ఇలా దూరంగా ఉంటె - సమాదిజీవితంలో (ఆలమే బర్జక్)లో మన పరిస్థితి ఏంటి? ప్రళయదినంరోజు మన పరిస్థితి ఏంటి? పరలోకంలో మన పరిస్థితి ఏంటి? అల్లాహ్ వద్ద మన పరిస్థితి ఏంటి? - అంతెందుకు ఈ లోకంలో ముందు ముందు జీవితకాలంలో - మన పిల్లల పరిస్థి ఏంటి? మన బంధుమిత్రుల పరిస్థి ఏంటి? మన సమాజం పరిస్థి ఏంటి? - ఇస్లాం/ఖురాన్/హదీసుల ద్వారా సృష్టికర్త అల్లాహ్ మనకేం నేర్పించాడు? మనం ఎంతెలుసుకున్నాం? మనం ఎంపాటిస్తున్నాము? మనం మన కుటుంబసభ్యులకు బంధుమిత్రులకు ఎంనేర్పిస్తున్నాము? సమాజంతో ఎలా మెలుగుతున్నాము? 

67+ SALAH QUOTES IN QURAN (VERSES IN QURAN ABOUT ISLAMIC PRAYERS)

నమాజ్ గురించి ఖురాన్ లో 67 + కంటే ఎక్కువ సార్లు చెప్పబడింది. నమాజ్ అల్లాహ్ ను ఆరాధిచే ప్రత్యేకమైన సాధనం, దీనిద్వారా పరిశుద్ధత, పాప విమోచన లబిస్తాయి. ఆధ్యాత్మికత లభిస్తుంది. అల్లాహ్ పట్ల భక్తి భయం గౌరవం ప్రేమ మర్యాద పెంపొందుతుంది. తప్పు లేదా పాపలు చేయకుండా నమాజ్ మనలను ఆపుతుంది. ఎలా అనేది ఖురాన్ లో మనకు సమాధానం లభిస్తుంది. మనకు కావలసిన సహనం/ఓపిక నమాజుద్వారా లభిస్తుంది. ఎన్ని టెన్షన్లు/ప్రాబ్లమ్స్ వున్నా నమాజ్ చదివినవారికి చదివేవారికి తెలుసు ప్రశాంతత ఎలా లభిస్తుందో. విశ్వాసి మరియు అవిశ్వాసి (కాఫిర్) కి మధ్య తేడాను - అల్లాహ్ నమాజ్ ద్వారా చూస్తాడు. నమాజ్ ద్వారా కుటుంబంలో బంధుమిత్రులతో సమాజంతో వ్యాపారలావాదేవీలతో ఎలా క్రమశిక్షణగా ఉండాలో నేర్పిస్తుంది.

VERSES OF THE QURAN ABOUT SALAH

2:2)ఈ గ్రంథం (అల్లాహ్‌ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపు తుంది.
(2:3)వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.
(2:4)మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.
(2:5)ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.
(2:43)(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి.
(2:44)ప్రజలకైతే మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, కాని మీ స్వయాన్ని మరచిపోతారే?! చూడబోతే మీరు గ్రంథపారాయణం చేస్తారాయె. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
(2:45)మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమయిన పనే. కాని (అల్లాహ్‌కు) భయపడేవారికి (ఇది సులువైనపని).
(2:83)మేము ఇస్రాయీల్‌ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము (దాన్ని గుర్తుకు తెచ్చుకోండి) : “అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాధలను, అగత్యపరులను (ఆదరించాలి). ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి, జకాత్‌ ఇస్తూ ఉండాలి.” అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు.
(2:110)మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్‌ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్‌ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్‌ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు.
(2:153)ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్‌ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.
(2:177)మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.
(2:238)నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యలో వున్న నమాజును. అల్లాహ్‌ సమక్షంలో వినమ్రులై నిలబడండి.
(2:239)పరిస్థితులు భయానకంగా ఉన్నప్పుడు నడుస్తూనో లేక వాహనంపై పోతూనో (నమాజు చేయండి). శాంతిభద్రతలు నెలకొన్న తరువాత అల్లాహ్‌ మీకు బోధించిన విధంగా ఆయన్ని ధ్యానించండి. దాని గురించి అంతకుముందు మీకు తెలీదు.
(2:277)విశ్వసించి (సున్నత్‌ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్‌ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
(4:43)విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా - స్నానం చేయనంతవరకూ - నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే - అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు.
(4:77)“మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి” అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్‌కు భయపడవలసిన రీతిలో- పైగా అంతకంటే ఎక్కువగానే- జనులకు భయపడసాగారు. “ప్రభూ! నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలంపాటు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వలేదు?” అని అనసాగారు. వారితో ఇలా చెప్పు: ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. (అల్లాహ్‌కు) భయపడేవారికి పరలోకమే మేలైనది. మీకు (అక్కడ) ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు.
(4:101)మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం గనక మీకుంటే, మీరు నమాజులను కుదించుకోవటంలో తప్పులేదు. నిశ్చయంగా అవిశ్వాసులు మీ బహిరంగ శత్రువులే.
(4:102)(ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి. మరి వారు సజ్దా చేయగానే మీ వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పటి వరకూ నమాజ్‌లో పాల్గొనని రెండవ సమూహం వచ్చి నీతోపాటు నమాజు చేయాలి. వారు కూడా తమ రక్షణ సామగ్రిని, తమ ఆయుధాలను చేబూని ఉండాలి. మీరు మీ ఆయుధాల పట్ల, సామగ్రిపట్ల ఏమరుపాటుకు లోనైతే, ఒక్కసారిగా మీపై విరుచుకుపడాలని అవిశ్వాసులు కోరుకుంటారు. అయితే వర్షం మూలంగా లేక అస్వస్థత మూలంగా ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అది దోషం కాదు. అయినా ఆత్మరక్షణ సామగ్రిని వెంట తీసుకొని ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ తిరస్కారుల కోసం అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
(4:103)మరి మీరు నమాజును నెరవేర్చిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి. అయితే పరిస్థితులు కుదుటపడిన తరువాత మాత్రం నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.
(4:142)నిశ్చయంగా కపటులు అల్లాహ్‌ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్‌ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్దకంతో, కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు. ఏదో నామ మాత్రంగా దైవాన్ని స్మరిస్తారు.
(4:143)వారు ఎటూ కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు. పూర్తిగా అటూ ఉండరు, సరిగ్గా ఇటూ ఉండరు. అల్లాహ్‌ ఎవరినయితే అపమార్గం పాల్జేస్తాడో వాని కోసం నీవు ఏ మార్గాన్నీ కనుగొనలేవు.
(4:162)అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానంగలవారూ, విశ్వసించినవారూ, నీపై అవతరింపజెయ్య బడినదానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్‌ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ - వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము.
(5:6)ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే - అట్టి పరిస్థితిలో - నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో 'తయమ్ముమ్‌' చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష!
(5:12)అల్లాహ్‌ ఇస్రాయీల్‌ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే పన్నెండు మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్‌ వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్‌ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ, వారిని గౌరవించి వారికి సహాయ పడితే, అల్లాహ్‌కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం (సవావుస్సబీల్‌) నుంచి తప్పిపోయాడు.”
(5:55)(ముస్లిములారా!) వాస్తవానికి మీ స్నేహితులు అల్లాహ్‌, ఆయన ప్రవక్త, ఇంకా నమాజును నెలకొల్పే, జకాతును చెల్లించే, రుకూ చేసే (ఆరాధనలో అణకువను కలిగి ఉండే) విశ్వాసులు మాత్రమే.
(5:58)మీరు నమాజు కోసం పిలిచినప్పుడు వారు దాన్ని నవ్వులాటగా, తమాషాగా చేసుకుంటారు. ఎందుకంటే వారు బొత్తిగా బుద్ధిలేనివారు.
(5:91)సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని సృజించాలనీ, అల్లాహ్‌ స్మరణ నుంచీ, నమాజు నుంచీ మిమ్మల్ని దూరంగా ఉంచాలని షైతాను కోరుకుంటున్నాడు. కనుక ఇకనయినా వాటిని మానుకోండి.
(5:106)ఓ విశ్వాసులారా! మీలో ఎవరికయినా మరణ సమయం దగ్గరపడి, అతడు విల్లు చెప్పదలచినప్పుడు మీలోని ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండటం భావ్యం. ఆ ఇద్దరు వ్యక్తులూ ధర్మచింతన గలవారై ఉండాలి. (వారు మీ వారై ఉండాలి). లేదా మీరు ప్రయాణావస్థలో ఉండి, మీకు మరణ విపత్తు దాపురిస్తే అన్యులిద్దరిని కూడా సాక్షులుగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అనుమానం కలిగితే నమాజు అనంతరం ఆ ఇద్దరినీ ఆపుకోండి. మరి వారిద్దరూ దేవునిపై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి: “మేము స్వప్రయోజనం కోసం ప్రమాణాలను అమ్ముకునేవాళ్ళం కాము. (మేము సాక్ష్యమిచ్చే వ్యక్తి) మా బంధువు అయినాసరే (మేము నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తాము). అల్లాహ్‌ యొక్క సాక్ష్యాన్ని మేము దాచి పెట్టము. ఒకవేళ మేమలా చేస్తే ఘోరమైన పాపానికి పాల్పడిన వారమవుతాము.”
(6:72)(ఇంకా ఇలా ఆదేశించబడింది:) “నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు.”
(6:92)ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్‌ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు.
(6:162)ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం - ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.
(7:170)ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ, నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్య ఫలాన్ని మేము వృథా చేయము.
(8:3)వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు.
(9:11)ఇప్పటికయినా వారు పశ్చాత్తాపం చెంది, నమాజ్‌ను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లించటం మొదలెడితే వారు మీ ధార్మిక సోదరులే. తెలిసినవారి కోసం మేము మా ఆయతులను ఈ విధంగా విడమరచి చెబుతున్నాము.
(9:18)అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.
(9:54)వారు పెట్టే ఖర్చు స్వీకరించబడక పోవటానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు: వారు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్దకంతో వస్తారు. (దైవ మార్గంలో) ఖర్చుపెట్టినా అయిష్టంగానే ఖర్చుపెడతారు.
(9:71)విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.
(11:87)వారిలా అన్నారు : "ఓ షుఐబ్‌! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి పెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా,రుజువర్తనునిలా ఉన్నావే?!"
(11:114)దినము యొక్క రెండు అంచులలోనూ నమాజును స్థాపించు – రాత్రి ఘడియలలో కూడా! నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి. హితబోధను గ్రహించగలిగే వారికి ఇదొక హితోపదేశం.
(13:22)వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుపెడతారు. చెడును సయితం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే.
(14:31)(ఓ ప్రవక్తా!) క్రయవిక్రయాలుగానీ, స్నేహబంధాలుగానీ ఉండని రోజు రాకముందే నమాజులను నెలకొల్పమనీ, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు.
(14:37)"మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదలిపెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు - వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు.
(14:40)"నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు."
(17:78)నమాజును నెలకొల్పు - సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుంచి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆను పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది.
(17:79)రాత్రిపూట కొంతభాగం తహజ్జుద్‌ (నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను ''మఖామె మహ్‌మూద్‌''కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.
(17:110)వారికి చెప్పు : "అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా - ఏ పేరుతో పిలిచినా - మంచి పేర్లన్నీ ఆయనవే." నువ్వు నీ నమాజును మరీ బిగ్గరగానూ, మరీ మెల్లగానూ పఠించకు. వీటికి నడుమ మధ్యేమార్గాన్ని అవలంబించు.
(19:30)ఆ పసివాడు ఇలా పలికాడు: "నేను అల్లాహ్‌ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు.
(19:31)"నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు."
(19:32)"ఇంకా - ఆయన నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు.
(19:55)అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్‌ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు.
(19:59)ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు.
(19:60)కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు.
(20:14)"నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు.
(20:132)నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సయితం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటంలేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే.
(21:73)ఇంకా - మా ఆదేశానుసారం ప్రజలకు మార్గదర్శకత్వం వహించటానికి మేము వారిని ఇమాములు (నాయకులు)గా తీర్చిదిద్దాము. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలనీ, నమాజులను నెలకొల్పుతూ ఉండాలనీ, జకాత్‌ (దానాన్ని) చెల్లిస్తూ ఉండాలనీ మేము వారికి సూచించాము (వారి వైపుకు వహీ పంపాము). వారంతా మమ్మల్నే ఆరాధించేవారు.
(22:25)నిశ్చయంగా ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్‌ మార్గం నుండి, మస్జిదె హరామ్‌ నుండి (జనులను) అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వమానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము. స్థానికులకు, బయటి నుంచి వచ్చే వారికి కూడా (ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది.)
(22:41)(ఈ విశ్వాసులు ఎలాంటివారంటే) మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు ఖచ్చితంగా నమాజును నెలకొల్పుతారు. జకాతు (అనే విధ్యుక్త దానధర్మాన్ని) చెల్లిస్తారు. మంచి పనులు చేయమని ఆజ్ఞాపిస్తారు. చెడు పనుల నుంచి ఆపుతారు. సమస్త వ్యవహారాల ఫలితం అల్లాహ్‌ అధీనంలోనే ఉంది.
(22:78)అల్లాహ్‌ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రాహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్‌ఆన్‌కు పూర్వం కూడా ఆయన (అల్లాహ్‌) మిమ్మల్ని 'ముస్లింలు' గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా (మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాళిపై సాక్షులుగా ఉండటానికి(ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్‌ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు!
(23:1)నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు.
(23:2)వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు.
(23:3)వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు
(23:4)వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు.
(23:5)వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.
(24:37)(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.
(24:41)భూమ్యాకాశాలలో వున్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులూ అల్లాహ్‌ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు (జనులు) చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
(24:56)నమాజును నెలకొల్పండి. జకాతును ఇవ్వండి. దైవప్రవక్తకు విధేయులుగా మసలుకోండి. తద్వారానే మీరు కరుణించబడతారు.
(24:58)ఓ విశ్వాసులారా! మీ అధీనంలో వున్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞవయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి - 1.ఫజ్ర్‌ నమాజుకు పూర్వం, 2.మధ్యాహ్నం (జుహ్ర్‌) వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3.ఇషా నమాజు తరువాత. ఈ మూడు వేళలు మీరు ఏకాంతం (పరదా)లో ఉండే వేళలు. ఈ మూడు వేళల్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించటంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూపోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు.
(27:3)వారు (విశ్వాసులు) నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు.
(29:45)(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
(30:31)(ప్రజలారా!) అల్లాహ్‌ వైపునకే మరలి, ఆయనకు భయపడుతూ ఉండండి. నమాజును నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి.
(31:4)వారు (ఆ సద్వర్తనులు) నమాజులను నెలకొల్పుతారు. జకాతు ఇస్తూ ఉంటారు. పరలోకంపై (పూర్తి) విశ్వాసం కలిగి ఉంటారు.
(31:17)"ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.
(33:33)మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష.
(33:56)నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి 'సలాములు' పంపుతూ ఉండండి.
(35:18)బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా, అతడు - సమీప బంధువు అయినాసరే - కొద్దిగా కూడా ఎత్తుకోడు. (ఓ ప్రవక్తా!) చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజులను నెలకొల్పేవారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. (కడకు అందరూ) అల్లాహ్‌ వైపునకే మరలిపోవలసి ఉంది.
(40:55)కనుక (ఓ ప్రవక్తా!) సహనం వహించు. నిస్సందేహంగా అల్లాహ్‌ వాగ్దానం నిజమైనది. నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.
(42:38)ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు.
(42:39)తమపై దౌర్జన్యం జరిగినప్పుడు, ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు.
(42:40)అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.
(58:13)ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే.
(62:9)ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.
(62:10)మరి నమాజు ముగిసిన తరువాత భూమిలో విస్తరించి, దైవానుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.
(70:19)నిశ్చయంగా మానవుడు మహా దూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు.
(70:20)(కాస్తంత) కీడు కలగగానే కలవరం చెందుతాడు.
(70:21)మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు.
(70:22)కాని నమాజు చేసేవారు మాత్రం అలాంటివారు కారు.
(70:23)వారు తమ నమాజుల (వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు.
(70:34)ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు.
(70:35)ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు.
(73:20)(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నువ్వు ఒక్కోసారి మూడింట రెండు వంతుల రాత్రి కంటే కొంచెం తక్కువ, ఒక్కోసారి సగం రాత్రి, ఒక్కోసారి మూడింట ఒక వంతు రాత్రి ఆరాధనలో నిలబడుతున్నావనీ, నీ సహచరుల్లోని ఒక వర్గం కూడా ఇలాగే చేస్తుందన్న సంగతి నీ ప్రభువుకు బాగా తెలుసు. రేయింబవళ్ళ లెక్కను ఖచ్చితంగా మదించగలవాడు అల్లాహ్ మాత్రమే. ఎట్టి పరిస్థితిలోనూ మీరు దీనిని నిర్వర్తించలేరని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మీపై దయదలిచాడు. కాబట్టి మీరు ఖుర్ఆన్ లో సులభంగా పఠించగలిగినంత భాగాన్ని పఠించండి. మీలో కొందరు వ్యాధి గ్రస్తులుంటారనీ, మరి కొందరు భువిలో సంచరించి దైవానుగ్రహాన్ని (అంటే ఉపాధిని) అన్వేషించేవారున్నారనీ, ఇంకా కొందరు దైవమార్గంలో యుద్ధం చేసేవారు కూడా ఉంటారని ఆయనకు తెలుసు. కాబట్టి మీరు సులువుగా పఠించగలిగినంత ఖుర్ఆన్ ను పఠించండి. నమాజును నెలకొల్పండి. జకాత్ ను ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు మంచి రుణం ఇవ్వండి. మీరు మీ కోసం ఏ మంచిని (పుణ్యకార్యాన్ని) ముందుగా పంపినా, దాన్ని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్య ఫలం రూపంలో అత్యధికంగా పొందుతారు. క్షమాపణకై అల్లాహ్ ను అర్ధిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.
(74:40)వారు (స్వర్గ) వనాలలో (కూర్చొని) అడుగుతూ ఉంటారు,
(74:41)అపరాధుల గురించి.
(74:42)“ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానికి తీసుకు వచ్చింది?” (అని ప్రశ్నిస్తారు).
(74:43)వారిలా సమాధానమిస్తారు : “మేము నమాజు చేసే వారము కాము.”
(74:44)“నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము.”
(74:45)“పైగా, మేము పిడివాదన చేసే వారితో (తిరస్కారులతో) చేరి, వాదోపవాదాలలో మునిగి ఉండేవారం.”
(98:5)వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.
(107:1)తీర్పు (దినము)ను ధిక్కరించే వాడిని నీవు చూశావా?!
(107:2)వీడే అనాధను గెంటివేసేవాడు.
(107:3)నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం (ఇతరులకు) ప్రేరేపించనివాడు.
(107:4)ఆ నమాజీలకు వినాశం తప్పదు (‘వైల్’ అనే నరక స్థానం వారికొరకు ఉన్నది).
(107:5)(ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.
(107:6)వారు (ఒకవేళ నమాజు చేసినా)పరులకు చూపటానికి చేస్తారు.
(107:7)అతి సామాన్యమైన వాడుక వస్తువులు సయితం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు.

UPDATE.....COMMING SOON.....


Comments