- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.
* నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయ మని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.
- 99:6
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ٦
ఆ రోజు ప్రజలు తమతమ కర్మలు చూపించ బడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
- 99:7
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ٧
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు.
మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడు తుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడినిగానీ, సహాయకుడినిగానీ పొందలేడు!
మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయిఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూరపు-బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.
- 39:52
ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి. (1/8)
- 39:53
* ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment