- Get link
- X
- Other Apps
Jesus Name 29 times mention in Quran - ఏసుక్రీస్తు వారి పేరు ఖురాన్ గ్రంథంలో 29 సార్లు వచ్చింది #ESA #JESUS CHRIST #BIBLE #QURAN #ISLAM #ALLAH #YAHOWA #29TIME in #QURAN #TeluguBukhari @TeluguBukhari
- Get link
- X
- Other Apps
Jesus Name 29 times mention in Quran - ఏసుక్రీస్తు వారి పేరు ఖురాన్ గ్రంథంలో 29 సార్లు వచ్చింది #ESA #JESUS CHRIST #BIBLE #QURAN #ISLAM #ALLAH #YAHOWA #29TIME in #QURAN #TeluguBukhari @TeluguBukhari
QURAN VERSES
అస్సలాముఅలైకుమ్ వారహ్మతుల్లాహి వాబరకాతుహు
అవుజుబిల్లాహి మినిషైతాన్ నిర్రజీమ్
బిస్మిల్లాహ్ హిర్రహ్మాన్ నిర్రహీమ్
3:45 إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ
దైవదూతలు, ''ఓ మర్యమ్! అల్లాహ్ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా(JESUS) బిన్ మర్‌యమ్. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్)(YAHOWA) సామీప్యం పొందిన వారిలో ఒకడు.''
4:157 وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا الْمَسِيحَ عِيسَى ابْنَ مَرْيَمَ رَسُولَ اللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِيهِ لَفِي شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ إِلَّا اتِّبَاعَ الظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًا
ఇంకా - “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసా(JESUS)ను మేము హతమార్చాము” అని అనటం వల్ల - (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,
5:72 لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ కుమారుడగు మసీహ్‌యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.
6:83 وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా 'నిదర్శనం' ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
6:84 وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
6:85 وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ
ఇంకా జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్‌లకు కూడా (మేము సన్మార్గం చూపించాము.) వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే.
6:86 وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
ఇంకా - ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము.
6:87 وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
4:170 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను.
4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్‌నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు 'ముగ్గురు' అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు.
4:172 لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا
మసీహ్ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగుచేస్తాడు.
4:173 فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
మరి ఎవరు విశ్వసించి, సత్కార్యాలు ఆచరించారో, వారికి వారి పూర్తి పుణ్య ఫలాన్ని వొసగటమేగాక, తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా; (అల్లాహ్ దాస్యాన్ని) చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణిగానీ, సహాయకుణ్ణిగానీ వారు పొందలేరు.
4:174 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనం (బుర్‌హాన్) వచ్చేసింది. ఇంకా, మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము.
4:175 فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا
కాబట్టి, ఎవరు అల్లాహ్‌ను విశ్వసించి, ఆయనతో తమ సంబంధాన్ని పటిష్ఠం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు.
5:17 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَن يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَن يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ పుత్రుడైన మసీహ్‌యే” అని అన్నవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ అల్లాహ్ మర్యమ్ పుత్రుడైన మసీహ్‌ని, అతని తల్లిని, భూమండలంలోని సమస్త జనులనూ నాశనం చేయదలిస్తే, ఆయన్ని అడ్డుకోగల శక్తి, అధికారం ఎవరికున్నాయి? భూమ్యాకాశాలలోనూ, వాటి మధ్యలోనూ ఉన్నవాటి సమస్త సార్వభౌమత్వానికి అధిపతి అల్లాహ్‌యే. ఆయన తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. అల్లాహ్ ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.”
5:18 وَقَالَتِ الْيَهُودُ وَالنَّصَارَىٰ نَحْنُ أَبْنَاءُ اللَّهِ وَأَحِبَّاؤُهُ ۚ قُلْ فَلِمَ يُعَذِّبُكُم بِذُنُوبِكُم ۖ بَلْ أَنتُم بَشَرٌ مِّمَّنْ خَلَقَ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ وَإِلَيْهِ الْمَصِيرُ
“మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రియమైన వారం” అని యూదులు, నస్రానీలు(నస్రానీలు) అంటారు. (ఓ ప్రవక్తా!) వారిని ఇలా అడుగు : “మరయితే మీ పాపాలకుగాను ఆయన మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? కాదు, మీరు కూడా ఆయన సృష్టించిన మానవ వర్గానికి చెందినవారే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమ్యా కాశాలలోనూ, వాటి మధ్యనూ ఉన్నవాటన్నింటిపై అధికారం అల్లాహ్‌దే. ఆయన వైపుకే మరలిపోవలసి ఉంది.”
5:19 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
5:20 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ جَعَلَ فِيكُمْ أَنبِيَاءَ وَجَعَلَكُم مُّلُوكًا وَآتَاكُم مَّا لَمْ يُؤْتِ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
మూసా తన జాతి వారినుద్దేశించి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి : “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాన్ని కాస్త మననం చేసుకోండి - ఆయన మీలో ప్రవక్తల్ని నియమించాడు. మిమ్మల్ని రాజులుగా చేశాడు. లోకవాసులలో ఎవరికీ ప్రసాదించని దానిని మీకు ప్రసాదించాడు.”
5:21 يَا قَوْمِ ادْخُلُوا الْأَرْضَ الْمُقَدَّسَةَ الَّتِي كَتَبَ اللَّهُ لَكُمْ وَلَا تَرْتَدُّوا عَلَىٰ أَدْبَارِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
“నా జాతివారలారా! అల్లాహ్ మీకు రాసిపెట్టిన ఈ పవిత్ర ప్రదేశంలో ప్రవేశించండి. వెన్నుచూపి మరలిపోకండి. వెన్నుచూపి మరలిపోయారంటే మీరే నష్టపోతారు.”
5:109 يَوْمَ يَجْمَعُ اللَّهُ الرُّسُلَ فَيَقُولُ مَاذَا أُجِبْتُمْ ۖ قَالُوا لَا عِلْمَ لَنَا ۖ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
ఏ రోజున అల్లాహ్ ప్రవక్తలందరినీ సమావేశపరచి, “మీకు ఏం సమాధానం లభించింది?” అని అడుగుతాడో ఆ రోజు, “మాకేమీ తెలియదు. నిశ్చయంగా రహస్య విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం కలవాడవు నువ్వే” అని వారంటారు.
5:110 إِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ اذْكُرْ نِعْمَتِي عَلَيْكَ وَعَلَىٰ وَالِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ الْقُدُسِ تُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ بِإِذْنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًا بِإِذْنِي ۖ وَتُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ بِإِذْنِي ۖ وَإِذْ تُخْرِجُ الْمَوْتَىٰ بِإِذْنِي ۖ وَإِذْ كَفَفْتُ بَنِي إِسْرَائِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِالْبَيِّنَاتِ فَقَالَ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
అప్పుడు అల్లాహ్ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్ ఖుదుస్ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, 'ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు' అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము.
5:111 وَإِذْ أَوْحَيْتُ إِلَى الْحَوَارِيِّينَ أَنْ آمِنُوا بِي وَبِرَسُولِي قَالُوا آمَنَّا وَاشْهَدْ بِأَنَّنَا مُسْلِمُونَ
“మీరు నన్నూ, నా ప్రవక్తనూ విశ్వసించండి” అని నేను హవారీలకు ఆజ్ఞాపించినప్పుడు, “మేము విశ్వసించాము, మేము పూర్తిగా విధేయులమయ్యాము అన్నదానికి నువ్వు సాక్షిగా ఉండు” అని వారన్నారు.
5:112 إِذْ قَالَ الْحَوَارِيُّونَ يَا عِيسَى ابْنَ مَرْيَمَ هَلْ يَسْتَطِيعُ رَبُّكَ أَن يُنَزِّلَ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ ۖ قَالَ اتَّقُوا اللَّهَ إِن كُنتُم مُّؤْمِنِينَ
“మర్యమ్ కుమారుడవైన ఓ ఈసా! నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్లాన్ని ఆకాశం నుంచి దింపగలడా?” అని హవారీలు అడిగిన సందర్భం జ్ఞాపకం చేసుకోదగినది. అప్పుడు ఈసా, “మీరే గనక విశ్వాసులైతే అల్లాహ్‌కు భయపడండి” అన్నాడు.
5:113 قَالُوا نُرِيدُ أَن نَّأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَن قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
దానికి వారిలా అన్నారు: “అందులోని ఆహారాన్ని తినాలని, తద్వారా మా మనసులు సంతృప్తి చెందాలనీ, నీవు మాకు చెప్పిన దంతా సత్యమనే నమ్మకం మాలో మరింత పెరగాలనీ, మేము సాక్ష్యమిచ్చేవారం కాగలగాలనీ కోరుకుంటున్నాము.”
5:114 قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنزِلْ عَلَيْنَا مَائِدَةً مِّنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِّنكَ ۖ وَارْزُقْنَا وَأَنتَ خَيْرُ الرَّازِقِينَ
అప్పుడు మర్యమ్ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : “ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు, అనగా మాలోని తొలివారు, తుది వారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు.”
5:115 قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَن يَكْفُرْ بَعْدُ مِنكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَّا أُعَذِّبُهُ أَحَدًا مِّنَ الْعَالَمِينَ
దానికి అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు: “సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరయినా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించనటువంటి శిక్షను వారికి విధిస్తాను.”
5:116 وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ
(ఆ తరువాత) “మర్యమ్ పుత్రుడవైన ఓ ఈసా! అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా?” అని అల్లాహ్ (నిలదీసి) అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: “(ఓ అల్లాహ్!) నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిదేదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కాని నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.
5:117 مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنتُ عَلَيْهِمْ شَهِيدًا مَّا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنتَ أَنتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
'నా ప్రభువూ, మీ ప్రభువూ అయిన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి' అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారిమధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే.
5:118 إِن تُعَذِّبْهُمْ فَإِنَّهُمْ عِبَادُكَ ۖ وَإِن تَغْفِرْ لَهُمْ فَإِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
“ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయంగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు.”
5:119 قَالَ اللَّهُ هَٰذَا يَوْمُ يَنفَعُ الصَّادِقِينَ صِدْقُهُمْ ۚ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తాడు: “ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం ప్రయోజనకరమవుతుంది. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలు వారికి ప్రాప్తిస్తాయి. అందులో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. వాస్తవానికి గొప్ప సాఫల్యమంటే ఇదే.
5:120 لِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا فِيهِنَّ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలు, భూమి, ఇంకా వాటిలో ఉన్న సమస్త వస్తువుల ఆధిపత్యం అల్లాహ్‌దే. ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
19. సూరా మర్యం

19:1 كهيعص
కాఫ్ - హా - యా - ఐన్ - సాద్. –
19:2 ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهُ زَكَرِيَّا
నీ ప్రభువు తన దాసుడైన జకరియ్యాపై దయదలచినప్పటి ప్రస్తావన ఇది.
19:3 إِذْ نَادَىٰ رَبَّهُ نِدَاءً خَفِيًّا
అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు (జరిగిన సంఘటన ఇది).
19:4 قَالَ رَبِّ إِنِّي وَهَنَ الْعَظْمُ مِنِّي وَاشْتَعَلَ الرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُن بِدُعَائِكَ رَبِّ شَقِيًّا
అతనిలా విన్నవించుకున్నాడు: "నా ప్రభూ! నా ఎముకలు బలహీనమైపోయాయి. వార్థక్యం వల్ల నా తల నెరసిపోయింది. నిన్ను ప్రార్థించి నేనెన్నడూ విఫలుణ్ణి కాలేదు.
19:5 وَإِنِّي خِفْتُ الْمَوَالِيَ مِن وَرَائِي وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا فَهَبْ لِي مِن لَّدُنكَ وَلِيًّا
"నా తదనంతరం నా ఆప్తుల గురించి నాకు భయం పట్టుకుంది. మరేమో నా భార్య గొడ్రాలు. కాబట్టి (ఓ అల్లాహ్!) నాకు వారసుడు ఇవ్వు .
19:6 يَرِثُنِي وَيَرِثُ مِنْ آلِ يَعْقُوبَ ۖ وَاجْعَلْهُ رَبِّ رَضِيًّا
నాకు వారసుడుగా ఉండటంతోపాటు, యాఖూబు సంతతికి కూడా వారసుడు అయ్యే ఒక వారసుణ్ణి నువ్వు నీ వద్ద నుంచి ప్రత్యేకంగా నాకు అనుగ్రహించు. ప్రభూ! నువ్వతన్ని ప్రియతమునిగా చేయి."
19:7 يَا زَكَرِيَّا إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ اسْمُهُ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُ مِن قَبْلُ سَمِيًّا
"ఓ జకరియ్యా! మేము నీకు ఒక కుమారుని శుభవార్తను వినిపిస్తున్నాము - అతని పేరు యహ్యా. మేము ఇంతకు ముందు ఈ పేరుగల వానిని చేయలేదు" (అని సెలవీయబడింది).
19:8 قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَكَانَتِ امْرَأَتِي عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِيًّا
"నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నా భార్యయేమో గొడ్రాలు. నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నవాణ్ణి" అని జకరియ్యా చెప్పుకున్నాడు.
19:9 قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَيَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِن قَبْلُ وَلَمْ تَكُ شَيْئًا
"అలాగే అవుతుంది" అని సెలవీయబడింది. "అది నాకు చాలా తేలిక. ఇంతకు ముందు నీకంటూ ఒక అస్థిత్వమే లేనపుడు నేను నిన్ను పుట్టించలేదా?!" అని నీ ప్రభువు అన్నాడు.
19:10 قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۚ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَ لَيَالٍ سَوِيًّا
"నా ప్రభూ! (మరయితే) నా కొరకు ఏదన్నా సూచనను నిర్ణయించు" అని అతను విన్నవించుకోగా,"నువ్వు కులాసాగా ఉన్నప్పటికీ మూడు రాత్రుల వరకూ ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీ కొరకు ఆనవాలు" అని సెలవీయబడింది.
19:11 فَخَرَجَ عَلَىٰ قَوْمِهِ مِنَ الْمِحْرَابِ فَأَوْحَىٰ إِلَيْهِمْ أَن سَبِّحُوا بُكْرَةً وَعَشِيًّا
అందువల్ల అతను తన కుటీరం నుంచి తన జాతి ప్రజల వద్దకు వచ్చి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడమని సైగ ద్వారా ఉపదేశించసాగాడు.
19:12 يَا يَحْيَىٰ خُذِ الْكِتَابَ بِقُوَّةٍ ۖ وَآتَيْنَاهُ الْحُكْمَ صَبِيًّا
"ఓ యహ్యా! నా గ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మేమతనికి బాల్యం నుంచే విజ్ఞతను వొసగాము.
19:13 وَحَنَانًا مِّن لَّدُنَّا وَزَكَاةً ۖ وَكَانَ تَقِيًّا
ఇంకా మా వద్ద నుంచి వాత్సల్యాన్నీ, పవిత్రతను కూడా ప్రసాదించాము. అతను భయభక్తులు గలవాడు.
19:14 وَبَرًّا بِوَالِدَيْهِ وَلَمْ يَكُن جَبَّارًا عَصِيًّا
అతను తన తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను దౌర్జన్యపరుడూ కాడు, అవిధేయుడూ కాడు.
19:15 وَسَلَامٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا
అతను పుట్టిన రోజునా, మరణించే రోజునా, అతను తిరిగి బ్రతికించి లేపబడే రోజునా అతనికి శాంతి కల్గుగాక!
19:16 وَاذْكُرْ فِي الْكِتَابِ مَرْيَمَ إِذِ انتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا
(ఓ ముహమ్మద్ - స!) ఈ గ్రంథంలో మర్యమ్ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడామె తన వాళ్ళనుంచి వేరై, తూర్పు వైపుకు వచ్చింది.
19:17 فَاتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَا إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا
ఆ తరువాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ (జిబ్రయీలు అలైహిస్సలాం)ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారంలో వచ్చాడు.
19:18 قَالَتْ إِنِّي أَعُوذُ بِالرَّحْمَٰنِ مِنكَ إِن كُنتَ تَقِيًّا
"నేను నీ బారి నుంచి కరుణామయుని (అల్లాహ్) శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవభీతి గలవాడవైనా (ఇక్కణ్ణుంచి వెళ్ళిపో)" అని ఆమె చెప్పింది.
19:19 قَالَ إِنَّمَا أَنَا رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَامًا زَكِيًّا
"నేను నీ ప్రభువు తరఫున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను" అని అతనన్నాడు.
19:20 قَالَتْ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا
"నాకు పిల్లవాడు కలగటమేమిటీ? నన్ను ఏ మగాడూ కనీసం తాకనైనా లేదే! నేను దుర్నడత గల దాన్ని కూడా కానే!!" అని ఆమె అన్నది.
19:21 قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَيَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُ آيَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ أَمْرًا مَّقْضِيًّا
"జరిగేది మాత్రం ఇదే. 'అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా, మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం' అని నీ ప్రభువు సెలవిచ్చాడు" అని అతను వివరించాడు.
19:22 فَحَمَلَتْهُ فَانتَبَذَتْ بِهِ مَكَانًا قَصِيًّا
అంతే, ఆమె గర్భవతి అయింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది.
19:23 فَأَجَاءَهَا الْمَخَاضُ إِلَىٰ جِذْعِ النَّخْلَةِ قَالَتْ يَا لَيْتَنِي مِتُّ قَبْلَ هَٰذَا وَكُنتُ نَسْيًا مَّنسِيًّا
ఆ తరువాత పురిటినొప్పులు ఆమెను ఒక ఖర్జూర చెట్టు క్రిందికి చేర్చాయి. "అయ్యో! నేను ఇంతకు మునుపే చచ్చిపోయి వుంటే, లోకులు నన్ను మరచిపోయి ఉంటే బావుండునే!" అని ఆమె బాధపడసాగింది.
19:24 فَنَادَاهَا مِن تَحْتِهَا أَلَّا تَحْزَنِي قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا
అంతలో (దైవదూత) క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు: "బాధ పడకు. నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు.
19:25 وَهُزِّي إِلَيْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسَاقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا
"ఆ ఖర్జూరపు మొదలును నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాల్తాయి.
19:26 فَكُلِي وَاشْرَبِي وَقَرِّي عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ الْبَشَرِ أَحَدًا فَقُولِي إِنِّي نَذَرْتُ لِلرَّحْمَٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ الْيَوْمَ إِنسِيًّا
"ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏమనిషైనా నీకు తారసపడితే, 'నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను. ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను' అని చెప్పు."
19:27 فَأَتَتْ بِهِ قَوْمَهَا تَحْمِلُهُ ۖ قَالُوا يَا مَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْئًا فَرِيًّا
ఆ తరువాత ఆమె ఆ పసివాణ్ణి ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. "ఓ మర్యమ్! నువ్వు పెద్ద పాపం చేశావు.
19:28 يَا أُخْتَ هَارُونَ مَا كَانَ أَبُوكِ امْرَأَ سَوْءٍ وَمَا كَانَتْ أُمُّكِ بَغِيًّا
ఓ హారూన్ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాడు. నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే!" అని అందరూ అన్నారు.
19:29 فَأَشَارَتْ إِلَيْهِ ۖ قَالُوا كَيْفَ نُكَلِّمُ مَن كَانَ فِي الْمَهْدِ صَبِيًّا
మర్యమ్ తన పసిపిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. "ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమెలా మాట్లాడగలం?" అన్నారు వారంతా.
19:30 قَالَ إِنِّي عَبْدُ اللَّهِ آتَانِيَ الْكِتَابَ وَجَعَلَنِي نَبِيًّا
ఆ పసివాడు ఇలా పలికాడు: "నేను అల్లాహ్ దాసుడను. ఆయన నాకు గ్రంథం వొసగాడు. నన్ను తన ప్రవక్తగా నియమించాడు.
19:31 وَجَعَلَنِي مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَانِي بِالصَّلَاةِ وَالزَّكَاةِ مَا دُمْتُ حَيًّا
"నేనెక్కడున్నాసరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజు, జకాతులకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు."
19:32 وَبَرًّا بِوَالِدَتِي وَلَمْ يَجْعَلْنِي جَبَّارًا شَقِيًّا
"ఇంకా - ఆయన నన్ను నా తల్లికి సేవచేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగానూ, దౌర్భాగ్యునిగానూ చేయలేదు.
19:33 وَالسَّلَامُ عَلَيَّ يَوْمَ وُلِدتُّ وَيَوْمَ أَمُوتُ وَيَوْمَ أُبْعَثُ حَيًّا
"నేను పుట్టిన రోజూ, నేను చనిపోయే రోజూ, నేను సజీవినై తిరిగి లేపబడేరోజూ నాపై శాంతి కలుగుతుంది."
19:34 ذَٰلِكَ عِيسَى ابْنُ مَرْيَمَ ۚ قَوْلَ الْحَقِّ الَّذِي فِيهِ يَمْتَرُونَ
ఇదీ మర్యమ్ కుమారుడైన ఈసా యదార్థ గాథ. ప్రజలు సంశయంలో పడివున్న సత్యవాక్కు ఇదే.
19:35 مَا كَانَ لِلَّهِ أَن يَتَّخِذَ مِن وَلَدٍ ۖ سُبْحَانَهُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్‌కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు. ఆయన పరమ పవిత్రుడు. ఆయన ఏ పనినైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు 'అయిపో' అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే అది అయిపోతుంది.
19:36 وَإِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా నాకూ, మీకందరికీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. కనుక ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం (అని ఈసా - ఏసుక్రీస్తు - బోధించాడు).
19:37 فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِن مَّشْهَدِ يَوْمٍ عَظِيمٍ
మరి ఈ ముఠాలు పరస్పరం విభేదించుకున్నాయి. కాబట్టి సత్యతిరస్కారులు ఒక మహా (కఠినమైన) దినాన హాజరైనపుడు, వారికి మూడుతుంది.
19:38 أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَٰكِنِ الظَّالِمُونَ الْيَوْمَ فِي ضَلَالٍ مُّبِينٍ
వారు మా సమక్షంలో హాజరైన రోజు ఎంత బాగా వింటూ, చూస్తూ ఉంటారు! కాని ఈ దుర్మార్గులు ఈనాడు మాత్రం స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు.
19:39 وَأَنذِرْهُمْ يَوْمَ الْحَسْرَةِ إِذْ قُضِيَ الْأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ
వ్యవహారం తేల్చబడి వారు బాధపడే రోజు గురించి (ఓ ముహమ్మద్ - సఅసం!) వారిని హెచ్చరించు. (ఏమైనా) వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు.
19:40 إِنَّا نَحْنُ نَرِثُ الْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ
స్వయంగా మేమే భూమికీ, భూమిపై ఉండే వారందరికీ వారసులమవుతాము. వారంతా మా వద్దకే మరలించబడతారు.
19:41 وَاذْكُرْ فِي الْكِتَابِ إِبْرَاهِيمَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇబ్రాహీము (అలైహిస్సలాం) వృత్తాంతాన్ని కూడా ప్రస్తావించు. నిస్సందేహంగా అతను సత్యవంతుడైన ప్రవక్త.
19:42 إِذْ قَالَ لِأَبِيهِ يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِي عَنكَ شَيْئًا
అతను తన తండ్రితో, "ఓ నాన్నా! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు?
19:43 يَا أَبَتِ إِنِّي قَدْ جَاءَنِي مِنَ الْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَاتَّبِعْنِي أَهْدِكَ صِرَاطًا سَوِيًّا
"ఓ పితామహా! చూడండి! మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది. కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను.
19:44 يَا أَبَتِ لَا تَعْبُدِ الشَّيْطَانَ ۖ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلرَّحْمَٰنِ عَصِيًّا
"ఓ తండ్రీ! మీరు షైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా షైతాన్ కరుణామయుడైన అల్లాహ్‌కు అవిధేయుడు.
19:45 يَا أَبَتِ إِنِّي أَخَافُ أَن يَمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمَٰنِ فَتَكُونَ لِلشَّيْطَانِ وَلِيًّا
"ఓ నా తండ్రీ! తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, షైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది" అని అన్నప్పుడు...
19:46 قَالَ أَرَاغِبٌ أَنتَ عَنْ آلِهَتِي يَا إِبْرَاهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَاهْجُرْنِي مَلِيًّا
"ఓ ఇబ్రాహీం! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా? విను! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు" అని అతని తండ్రి అన్నాడు.
19:47 قَالَ سَلَامٌ عَلَيْكَ ۖ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّي ۖ إِنَّهُ كَانَ بِي حَفِيًّا
"సరే (నాన్నా). మీకు సలాం! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు.
19:48 وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ وَأَدْعُو رَبِّي عَسَىٰ أَلَّا أَكُونَ بِدُعَاءِ رَبِّي شَقِيًّا
"నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదలి పోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది" అని (ఇబ్రాహీం) చెప్పాడు.
19:49 فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ اللَّهِ وَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۖ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا
ఆ విధంగా ఇబ్రాహీం వాళ్ళందరినీ, వారు అల్లాహ్‌ను కాదని పూజించే వారందరినీ వదలి పోయినప్పుడు, మేమతనికి ఇస్‌హాఖ్‌ను, యాఖూబును అనుగ్రహించాము. వారిద్దరినీ ప్రవక్తలుగా చేశాము.
19:50 وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا
వారందరికీ మేము మా కరుణను ప్రసాదించి, (భావి తరాల నోట) వారి శుభ నామస్మరణను ఉన్నతం చేశాము.
19:51 وَاذْكُرْ فِي الْكِتَابِ مُوسَىٰ ۚ إِنَّهُ كَانَ مُخْلَصًا وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ ఖుర్‌ఆను గ్రంథంలో మూసా విషయాన్ని కూడా ప్రస్తావించు. అతను ఎన్నుకోబడినవాడు, సందేశ వాహకుడైన ప్రవక్త.
19:52 وَنَادَيْنَاهُ مِن جَانِبِ الطُّورِ الْأَيْمَنِ وَقَرَّبْنَاهُ نَجِيًّا
మేమతన్ని తూరు పర్వతం కుడివైపు నుంచి పిలిచాము. రహస్య సంభాషణ నిమిత్తం అతన్ని దగ్గరకు చేర్చాము.
19:53 وَوَهَبْنَا لَهُ مِن رَّحْمَتِنَا أَخَاهُ هَارُونَ نَبِيًّا
ఇంకా మా ప్రత్యేక కృపతో అతని సోదరుడైన హారూనును ప్రవక్తగా చేసి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము.
19:54 وَاذْكُرْ فِي الْكِتَابِ إِسْمَاعِيلَ ۚ إِنَّهُ كَانَ صَادِقَ الْوَعْدِ وَكَانَ رَسُولًا نَّبِيًّا
ఈ గ్రంథంలో ఇస్మాయీలు వృత్తాంతాన్ని గురించి కూడా ప్రస్తావించు. అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు. మా తరఫున పంపబడిన సందేశహరుడు, ప్రవక్త కూడా.
19:55 وَكَانَ يَأْمُرُ أَهْلَهُ بِالصَّلَاةِ وَالزَّكَاةِ وَكَانَ عِندَ رَبِّهِ مَرْضِيًّا
అతను తన కుటుంబీకులకు నమాజు గురించి, జకాత్ గురించి ఆదేశిస్తూ ఉండేవాడు. అతను తన ప్రభువు సన్నిధిలో ప్రియతముడు.
19:56 وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا
ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.
19:57 وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.
19:58 أُولَٰئِكَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِم مِّنَ النَّبِيِّينَ مِن ذُرِّيَّةِ آدَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَاهِيمَ وَإِسْرَائِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَاجْتَبَيْنَا ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُ الرَّحْمَٰنِ خَرُّوا سُجَّدًا وَبُكِيًّا ۩
అల్లాహ్ అనుగ్రహించిన ప్రవక్తలు వీరు. వారు ఆదం సంతతికి చెందినవారు. నూహుతో పాటు మేము ఓడలోకి ఎక్కించిన వారి వంశీయులు. ఇబ్రాహీము, యాఖూబు (ఇస్రాయీలు)సంతతికి చెందినవారు. వారంతా మా ద్వారా సన్మార్గం పొందినవారు, మా చేత ఎన్నుకోబడిన ప్రజల్లోని వారు. వారి ముందు కరుణామయుడైన దేవుని వచనాలు పారాయణం చేయబడినప్పుడు వారు విలపిస్తూ సాష్టాంగపడేవారు.
19:59 فَخَلَفَ مِن بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا الصَّلَاةَ وَاتَّبَعُوا الشَّهَوَاتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا
ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజులను వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారు మున్ముందు చూసుకుంటారు.
19:60 إِلَّا مَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ وَلَا يُظْلَمُونَ شَيْئًا
కాని పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు (మాత్రం నష్టపోరు). వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవంత కూడా అన్యాయం జరగదు.
19:61 جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدَ الرَّحْمَٰنُ عِبَادَهُ بِالْغَيْبِ ۚ إِنَّهُ كَانَ وَعْدُهُ مَأْتِيًّا
అగోచరాలైన, శాశ్వత స్వర్గవనాలలోకి (వారు ప్రవేశిస్తారు.) వాటిని గురించి కరుణామయుడు (అయిన అల్లాహ్) తన దాసులకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం నెరవేరటం తథ్యం.
19:62 لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا إِلَّا سَلَامًا ۖ وَلَهُمْ رِزْقُهُمْ فِيهَا بُكْرَةً وَعَشِيًّا
అక్కడ వారు 'సలామ్' తప్ప వ్యర్థమైన మాటలేవీ వినరు. వారికోసం అక్కడ ఉదయం సాయంత్రం వారి ఆహారం సమకూరుతూ ఉంటుంది.
19:63 تِلْكَ الْجَنَّةُ الَّتِي نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيًّا
మేము మా దాసులలో భయభక్తులు కలిగి ఉండేవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే.
19:64 وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ لَهُ مَا بَيْنَ أَيْدِينَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذَٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا
నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా (దైవదూతలమైన) మేము దిగి రాలేము. మాకు ముందూ, వెనుకా, వాటికి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయన సొత్తే. నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు.
19:65 رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَاعْبُدْهُ وَاصْطَبِرْ لِعِبَادَتِهِ ۚ هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا
ఆకాశాలకూ, భూమికీ, వాటి మధ్య నున్న సమస్తానికీ ప్రభువు ఆయనే. కనుక నువ్వు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనపైనే స్థిరంగా ఉండు. నీకు తెలిసినంతవరకూ ఆయన పేరు గలవాడు ఎవడయినా ఉన్నాడా?
19:66 وَيَقُولُ الْإِنسَانُ أَإِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا
"ఏమిటీ, నేను చచ్చిన తరువాత మళ్లీ బ్రతికించి బయటికి తీయబడతానా?" అని మనిషి అంటున్నాడు.
19:67 أَوَلَا يَذْكُرُ الْإِنسَانُ أَنَّا خَلَقْنَاهُ مِن قَبْلُ وَلَمْ يَكُ شَيْئًا
ఇంతకుముందు అతనికంటూ ఒక అస్థిత్వం లేనపుడు మేమతన్ని సృష్టించామన్న సంగతి ఈ మనిషికి జ్ఞాపకం లేదా?
19:68 فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَالشَّيَاطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا
నీ ప్రభువు సాక్షి! నిశ్చయంగా మేము వాళ్ళను, (వాళ్ళతో పాటు) షైతానులను కూడా పోగు చేసి, నరకం చుట్టూ వారిని మోకాళ్ళ మీద పడి ఉన్న స్థితిలో హాజరు పరుస్తాము.
19:69 ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمْ أَشَدُّ عَلَى الرَّحْمَٰنِ عِتِيًّا
ఆ తరువాత కరుణామయుడైన అల్లాహ్ పట్ల ఎక్కువగా అహంకారంతో విర్రవీగే వారిని మేము ఒక్కో వర్గం నుంచి వేరు పరుస్తాము.
19:70 ثُمَّ لَنَحْنُ أَعْلَمُ بِالَّذِينَ هُمْ أَوْلَىٰ بِهَا صِلِيًّا
ఇంకా నరకంలోకి త్రోయబడటానికి ఎక్కువ అర్హులెవరో మాకు బాగా తెలుసు.
19:71 وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا
మీలోని ప్రతి ఒక్కరూ అక్కడికి రావలసిందే. ఇది నీ ప్రభువు చేసిన తిరుగులేని నిర్ణయం. దాన్ని నిర్వర్తించే బాధ్యత ఆయనపై ఉంది.
19:72 ثُمَّ نُنَجِّي الَّذِينَ اتَّقَوا وَّنَذَرُ الظَّالِمِينَ فِيهَا جِثِيًّا
తర్వాత మేము భయభక్తులు కలిగివున్న వారిని రక్షిస్తాము. దుర్మార్గులను అందులో మోకాళ్లపైపడి ఉన్న స్థితిలోనే వదిలేస్తాము.
19:73 وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا أَيُّ الْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا
స్పష్టమైన మా ఆయతులను వారి ముందు చదివి వినిపించినపుడు అవిశ్వాసులు "ఇంతకీ మన ఇరు వర్గాలలో ఎవరు మంచి స్థితిలోఉన్నారో, ఎవరి సభలు ఉత్తమంగా ఉన్నాయో చెప్పండి?" అని ముస్లిములతో అంటారు.
19:74 وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَاثًا وَرِئْيًا
మేము వీరికి మునుపు వీళ్లకన్నాఎక్కువ సాధన సంపత్తులను, అట్టహాసాలను కలిగి ఉన్న ఎన్నో సముదాయాలను తుదముట్టించాము.
19:75 قُلْ مَن كَانَ فِي الضَّلَالَةِ فَلْيَمْدُدْ لَهُ الرَّحْمَٰنُ مَدًّا ۚ حَتَّىٰ إِذَا رَأَوْا مَا يُوعَدُونَ إِمَّا الْعَذَابَ وَإِمَّا السَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَأَضْعَفُ جُندًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: "అపమార్గానికి లోనై ఉన్నవారికి కరుణామయుడైన అల్లాహ్ బాగా గడువు ఇస్తాడు. కడకు వారు- తమకు వాగ్దానం చేయబడుతున్న శిక్షను లేదా ప్రళయ గడియను చూచినపుడు ఎవరి స్థానం నికృష్టమైనదో, ఎవరి సమూహం బలహీనమైనదో తెలుసుకుంటారు."
19:76 وَيَزِيدُ اللَّهُ الَّذِينَ اهْتَدَوْا هُدًى ۗ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَّرَدًّا
ఇంకా, సన్మార్గం పొందినవారి సన్మార్గంలో అల్లాహ్ వృద్ధిని వొసగుతాడు. మిగిలి ఉండే సత్కార్యాలు పుణ్యఫలం రీత్యానూ, పరిణామం రీత్యానూ నీ ప్రభువు సన్నిధిలో ఎంతో మేలైనవి.
19:77 أَفَرَأَيْتَ الَّذِي كَفَرَ بِآيَاتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا
మా ఆయతులను తిరస్కరించి, "నాకు సిరిసంపదలు, సంతానం తప్పకుండా వొసగబడతాయి" అని చెప్పేవాడిని నువ్వు చూశావా?
19:78 أَطَّلَعَ الْغَيْبَ أَمِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అగోచర విషయమేదయినా అతనికి తెలిసిపోయిందా? లేదా ఆ మేరకు కరుణామయుడైన అల్లాహ్ నుంచి ఏదన్నా వాగ్దానం పొంది ఉన్నాడా?
19:79 كَلَّا ۚ سَنَكْتُبُ مَا يَقُولُ وَنَمُدُّ لَهُ مِنَ الْعَذَابِ مَدًّا
కానే కాదు. వాడు చెప్పేదంతా మేము వ్రాసిపెడతాము. వాడి కోసం శిక్షను పెంచుతూ పోతాము.
19:80 وَنَرِثُهُ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا
వాడు చెబుతున్న వస్తువులన్నింటినీ వాడి తదనంతరం మేము తీసేసుకుంటాము. వాడు ఒంటరిగా మా ముందు హాజరవుతాడు.
19:81 وَاتَّخَذُوا مِن دُونِ اللَّهِ آلِهَةً لِّيَكُونُوا لَهُمْ عِزًّا
వారు అల్లాహ్‌ను కాదని, ఇతరులను – తమకు ఆదరువుగా నిలుస్తారన్న ఉద్దేశంతో - ఆరాధ్యులుగా చేసుకున్నారు.
19:82 كَلَّا ۚ سَيَكْفُرُونَ بِعِبَادَتِهِمْ وَيَكُونُونَ عَلَيْهِمْ ضِدًّا
కాని అలా జరగనేరదు. వారి పూజలను వాళ్లు (వారి మిధ్యా దైవాలు) త్రోసి పుచ్చుతారు. పైగా వారికి శత్రువులుగా (వ్యతిరేకులుగా) మారతారు.
19:83 أَلَمْ تَرَ أَنَّا أَرْسَلْنَا الشَّيَاطِينَ عَلَى الْكَافِرِينَ تَؤُزُّهُمْ أَزًّا
సత్యాన్ని తిరస్కరించేవారిని అదేపనిగా పురిగొల్పుతూ ఉండే షైతానులను మేము వారిపైకి వదలటాన్ని నువ్వు చూడలేదా?
19:84 فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ۖ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا
నువ్వు వారి విషయంలో ఏమాత్రం తొందరపడకు. మేము స్వయంగా వారి గడువును లెక్కిస్తున్నాము.
19:85 يَوْمَ نَحْشُرُ الْمُتَّقِينَ إِلَى الرَّحْمَٰنِ وَفْدًا
భయభక్తులు గలవారిని కరుణామయుడైన అల్లాహ్ సన్నిధిలో అతిథులుగా మేము సమావేశపరచే రోజున,
19:86 وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము.
19:87 لَّا يَمْلِكُونَ الشَّفَاعَةَ إِلَّا مَنِ اتَّخَذَ عِندَ الرَّحْمَٰنِ عَهْدًا
అప్పుడు కరుణామయుడు అయిన అల్లాహ్ తరఫున హామీ పొందినవారు తప్ప ఇతరులెవరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.
19:88 وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉంది అని వారంటున్నారు.
19:89 لَّقَدْ جِئْتُمْ شَيْئًا إِدًّا
నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని తెచ్చారు.
19:90 تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ الْأَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا
త్వరలోనే ఆకాశాలు పగిలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలై పోతాయేమో,
19:91 أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا
కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా.
19:92 وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని (ఔన్నత్యాని)కి ఏమాత్రం శోభించదు.
19:93 إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే.
19:94 لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا
వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు.
19:95 وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا
వారంతా ప్రళయదినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు.
19:96 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ سَيَجْعَلُ لَهُمُ الرَّحْمَٰنُ وُدًّا
నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్ ప్రేమానురాగాలను సృజిస్తాడు.
19:97 فَإِنَّمَا يَسَّرْنَاهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِينَ وَتُنذِرَ بِهِ قَوْمًا لُّدًّا
నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీదీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము.
19:98 وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُم مِّنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا
మేము వీరికి మునుపు ఎన్నో సమూహాలను తుదముట్టించాము. వారిలో ఏ ఒక్కరి జాడనైనా నువ్వు పసిగట్ట గలుగుతున్నావా? లేక కనీసం వారి నిట్టూర్పునైనా వింటున్నావా??
3:58 ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
(ఓ ముహమ్మద్!) మేము నీకు (దివ్య ఖుర్‌ఆన్) ఆయతులను, వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము.
3:59 إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (ఆయన) అతన్ని మట్టితో చేసి 'అయిపో' అని ఆజ్ఞాపించగానే అతను (మనిషిగా) అయిపోయాడు.
3:60 الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ
నీ ప్రభువు తరఫు నుంచి (వచ్చిన) సత్యం ఇదే. జాగ్రత్త! శంకించే వారిలో చేరిపోకు.
3:61 فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: ''రండి! మీరూ మేము కలసి మన కుమారులను, మన స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత - 'అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్ శాపం పడుగాక' అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.''
3:62 إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
3:63 فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
(ఈ సవాలు విసిరిన) తరువాత కూడా వారు (సత్యాన్ని) ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే, అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:64 قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ''ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.'' ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ''మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని వారికి చెప్పేయండి.
3:65 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?!
3:66 هَا أَنتُمْ هَٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు.
3:67 مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు.
3:68 إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ
అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం.
3:69 وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు.
3:70 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ
''ఓ గ్రంథవహులారా! మీరు స్వయంగా అల్లాహ్ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?''
3:71 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
''గ్రంథం కల ఓ ప్రజలారా! తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??''
3:72 وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ''విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!''
3:73 وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
''మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు'' (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం.'' (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ''మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).'' ఓ ప్రవక్తా! వారితో అను: ''అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.''
3:74 يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
''ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.''
3:75 وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు - నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ''నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు'' అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు.
3:76 بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు.
3:77 إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది.
3:78 وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు - అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ''అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది'' అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్‌కు అసత్యాన్ని అంటగడుతున్నారు.
3:79 مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ
అల్లాహ్ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్‌ను) ప్రసాదించిన మీదట కూడా 'మీరు అల్లాహ్‌ను వదలిపెట్టి నాకు దాసులుకండి' అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, 'మీరంతా ప్రభువు వారైపోండి' అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం).
3:80 وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).
3:81 وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ
అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ''నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా, ''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు. ''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్ అన్నాడు.
3:82 فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.
3:83 أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా - తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.
3:84 قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: ''మేము అల్లాహ్‌ను, మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.''
3:3 نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ
(ఓ ప్రవక్తా!) ఆయన నీపై సత్యంతోపాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇన్జీలు(BIBLE) గ్రంథాలను అవతరింపజేశాడు,
43:57 وَلَمَّا ضُرِبَ ابْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ
మర్యమ్ కుమారుని ఉదాహరణ ఇవ్వబడినపుడు నీ జాతి జనులు (సంబరపడి) కేకలు వేశారు.
43:58 وَقَالُوا أَآلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ
"ఇంతకీ మా దేవుళ్ళు మంచివాళ్ళా లేక అతనా?" అని వారు (తరచి తరచి) అడగటం మొదలెట్టారు. వారు నిన్ను అలా అడగటం వెనుక వారి ఉద్దేశం జగడం తప్ప మరేమీ కాదు. అసలా జనులే జగడాలమారులు.
43:59 إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ
అతను (మర్యమ్ కుమారుడైన ఈసా) కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణ (మా శక్తి నిదర్శనం)గా చేశాము.
43:60 وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ
మరి మేమే గనక తలచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం.
43:61 وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా అతను (ఈసా - అలైహిస్సలాం) ప్రళయానికి ఒక సూచన. కాబట్టి మీరు దాని (ప్రళయదినం) విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజు మార్గం.
43:62 وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా! వాడు మీకు బద్ధ విరోధి.
43:63 وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా (ఏసు - అలైహిస్సలాం) ఇలా అన్నాడు: "నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.
43:64 إِنَّ اللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
"నిజానికి నా ప్రభువూ, మీ ప్రభువూ అల్లాహ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం."
5:65 وَلَوْ أَنَّ أَهْلَ الْكِتَابِ آمَنُوا وَاتَّقَوْا لَكَفَّرْنَا عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأَدْخَلْنَاهُمْ جَنَّاتِ النَّعِيمِ
ఒకవేళ ఈ గ్రంథవహులే గనక విశ్వసించి, భయభక్తులతో కూడుకున్న (తఖ్వా) విధానాన్ని అవలంబించినట్లయితే, మేము వారి పాపాలన్నింటినీ వారి నుంచి దూరంచేసి, సుఖ సౌఖ్యాలతో కూడుకున్న స్వర్గవనాలలో వారికి తప్పకుండా ప్రవేశం కల్పించేవారము.
5:66 وَلَوْ أَنَّهُمْ أَقَامُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْهِم مِّن رَّبِّهِمْ لَأَكَلُوا مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِم ۚ مِّنْهُمْ أُمَّةٌ مُّقْتَصِدَةٌ ۖ وَكَثِيرٌ مِّنْهُمْ سَاءَ مَا يَعْمَلُونَ
వారు గనక తౌరాతుకూ, ఇంజీలుకూ, తమ ప్రభువు తరఫున తమ వద్దకు పంపబడిన దానికి కట్టుబడి ఉంటే వారు తమపై నుంచీ, క్రింది నుంచీ పుష్కలంగా ఉపాధిని పొందుతూ, హాయిగా తినేవారు. వారిలో ఒక వర్గం మాత్రం మధ్యేమార్గం అవలంబిస్తుంది. కాని వారిలోని అత్యధికులు చేసే పనులు చాలా చెడ్డవి.
5:67 يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ وَإِن لَّمْ تَفْعَلْ فَمَا بَلَّغْتَ رِسَالَتَهُ ۚ وَاللَّهُ يَعْصِمُكَ مِنَ النَّاسِ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ
ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే, దైవప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించని వాడవవుతావు. అల్లాహ్ నిన్ను ప్రజల (కీడు) నుంచి కాపాడుతాడు. నిశ్చయంగా అల్లాహ్ తిరస్కారులకు సన్మార్గం చూపడు.
5:68 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنجِيلَ وَمَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు తరఫున మీ వద్దకు పంపబడిన దానినీ (మీ జీవితాలలో) నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు.
5:69 إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالصَّابِئُونَ وَالنَّصَارَىٰ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, నసారా (నస్రానీలు) అయినా- ఎవరయినా సరే- వారు గనక అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సదాచరణ చేసినట్లయితే వారికెలాంటి భయంగానీ, చింతగానీ ఉండబోదు.
5:70 لَقَدْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ وَأَرْسَلْنَا إِلَيْهِمْ رُسُلًا ۖ كُلَّمَا جَاءَهُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُهُمْ فَرِيقًا كَذَّبُوا وَفَرِيقًا يَقْتُلُونَ
మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని వారి మనోభీష్టానికి విరుద్ధమైన ఆదేశాలను ప్రవక్తలు వారి వద్దకు తీసుకువచ్చినప్పుడల్లా వారు ప్రవక్తలలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హత్య చేస్తూ ఉన్నారు.
5:71 وَحَسِبُوا أَلَّا تَكُونَ فِتْنَةٌ فَعَمُوا وَصَمُّوا ثُمَّ تَابَ اللَّهُ عَلَيْهِمْ ثُمَّ عَمُوا وَصَمُّوا كَثِيرٌ مِّنْهُمْ ۚ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
తమకు ఏ ఉపద్రవమూ సంభవించదని వారు తలపోశారు. ఈ కారణంగా వారు గుడ్డివారుగా, చెవిటివారుగా ప్రవర్తించారు. అయితే ఆ తరువాత అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలామంది అంధులు, బధిరులు అయిపోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.
5:72 لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۖ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۖ إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
“అల్లాహ్ (అంటే) మర్యమ్ కుమారుడగు మసీహ్‌యే” అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యదార్థానికి మసీహ్ ఖుద్దుగా వారితో ఇలా పలికాడు : “ఓ ఇస్రాయీలు వంశస్థులారా! నాకూ, మీకూ ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే పూజించండి.” ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.
5:73 لَّقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ ثَالِثُ ثَلَاثَةٍ ۘ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا إِلَٰهٌ وَاحِدٌ ۚ وَإِن لَّمْ يَنتَهُوا عَمَّا يَقُولُونَ لَيَمَسَّنَّ الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابٌ أَلِيمٌ
“అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు” అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.
5:74 أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమాపణ కోసం ఆయన్ని వేడుకోరా? అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు కూడా.
5:75 مَّا الْمَسِيحُ ابْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ وَأُمُّهُ صِدِّيقَةٌ ۖ كَانَا يَأْكُلَانِ الطَّعَامَ ۗ انظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ الْآيَاتِ ثُمَّ انظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
మర్యమ్ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!
5:76 قُلْ أَتَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا نَفْعًا ۚ وَاللَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
వారితో ఇలా చెప్పు : ఏమిటీ, మీరు అల్లాహ్‌ను కాదని మీకు నష్టంగానీ, లాభంగానీ చేకూర్చే అధికారంలేని వారిని ఆరాధిస్తున్నారా? అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, సర్వమూ తెలిసినవాడు.
5:77 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ غَيْرَ الْحَقِّ وَلَا تَتَّبِعُوا أَهْوَاءَ قَوْمٍ قَدْ ضَلُّوا مِن قَبْلُ وَأَضَلُّوا كَثِيرًا وَضَلُّوا عَن سَوَاءِ السَّبِيلِ
ఇలా చెప్పేయి : “ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మంలో అన్యాయంగా హద్దులు మీరకండి. పూర్వం తాము మార్గం నుంచి తప్పడమేగాక, ఎంతో మందిని మార్గం నుంచి తప్పించి రుజుమార్గ భ్రష్టులైనవారి మనోవాంఛలను అనుసరించకండి.”
5:78 لُعِنَ الَّذِينَ كَفَرُوا مِن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ لِسَانِ دَاوُودَ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యమ్ పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు అవిధేయతకు పాల్పడేవారు. హద్దుమీరి ప్రవర్తించేవారు.
5:79 كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహుచెడ్డది.
5:80 تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు.
5:81 وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ
వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు.
5:46 وَقَفَّيْنَا عَلَىٰ آثَارِهِم بِعِيسَى ابْنِ مَرْيَمَ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ ۖ وَآتَيْنَاهُ الْإِنجِيلَ فِيهِ هُدًى وَنُورٌ وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ التَّوْرَاةِ وَهُدًى وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
ఆ ప్రవక్తల తరువాత మేము మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేమతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు హితబోధిని కూడా.
5:47 وَلْيَحْكُمْ أَهْلُ الْإِنجِيلِ بِمَا أَنزَلَ اللَّهُ فِيهِ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే పాపాత్ములు.
5:48 وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ مِنَ الْكِتَابِ وَمُهَيْمِنًا عَلَيْهِ ۖ فَاحْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ عَمَّا جَاءَكَ مِنَ الْحَقِّ ۚ لِكُلٍّ جَعَلْنَا مِنكُمْ شِرْعَةً وَمِنْهَاجًا ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَٰكِن لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۖ فَاسْتَبِقُوا الْخَيْرَاتِ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు.
5:49 وَأَنِ احْكُم بَيْنَهُم بِمَا أَنزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّهُ إِلَيْكَ ۖ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ ۗ وَإِنَّ كَثِيرًا مِّنَ النَّاسِ لَفَاسِقُونَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు. ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధించాలన్నదే అల్లాహ్ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.
5:50 أَفَحُكْمَ الْجَاهِلِيَّةِ يَبْغُونَ ۚ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ حُكْمًا لِّقَوْمٍ يُوقِنُونَ
ఏమిటీ, వారు మళ్ళీ అజ్ఞాన (కాల)పు తీర్పు కోరుతున్నారా? నమ్మకం గల వారి కోసం అల్లాహ్ కన్నా ఉత్తమ తీర్పు ఇవ్వగల వాడెవడుంటాడు?
5:25 قَالَ رَبِّ إِنِّي لَا أَمْلِكُ إِلَّا نَفْسِي وَأَخِي ۖ فَافْرُقْ بَيْنَنَا وَبَيْنَ الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: “ప్రభూ! నాకు నా స్వయంపైనా, నా సోదరునిపైన మాత్రమే అధికారం ఉంది. కాబట్టి నువ్వు మమ్మల్ని - ఈ అవిధేయులను వేరు చెయ్యి.”
5:26 قَالَ فَإِنَّهَا مُحَرَّمَةٌ عَلَيْهِمْ ۛ أَرْبَعِينَ سَنَةً ۛ يَتِيهُونَ فِي الْأَرْضِ ۚ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْفَاسِقِينَ
అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: “ఇక ఈ భూమి వారి కోసం నలభై సంవత్సరాల దాకా నిషేధించబడింది. వారు ఎక్కడా నిలువ నీడ లేకుండా నేలపై తచ్చాడుతూ తిరుగుతుంటారు. కనుక నువ్వు ఈ అవిధేయ జనుల విషయంలో దుఃఖించకు.”
5:27 وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ ابْنَيْ آدَمَ بِالْحَقِّ إِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ أَحَدِهِمَا وَلَمْ يُتَقَبَّلْ مِنَ الْآخَرِ قَالَ لَأَقْتُلَنَّكَ ۖ قَالَ إِنَّمَا يَتَقَبَّلُ اللَّهُ مِنَ الْمُتَّقِينَ
(ఓ ముహమ్మద్-స!) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను, “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు, “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు -
5:28 لَئِن بَسَطتَ إِلَيَّ يَدَكَ لِتَقْتُلَنِي مَا أَنَا بِبَاسِطٍ يَدِيَ إِلَيْكَ لِأَقْتُلَكَ ۖ إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
“నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను.
5:29 إِنِّي أُرِيدُ أَن تَبُوءَ بِإِثْمِي وَإِثْمِكَ فَتَكُونَ مِنْ أَصْحَابِ النَّارِ ۚ وَذَٰلِكَ جَزَاءُ الظَّالِمِينَ
“నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు.
5:30 فَطَوَّعَتْ لَهُ نَفْسُهُ قَتْلَ أَخِيهِ فَقَتَلَهُ فَأَصْبَحَ مِنَ الْخَاسِرِينَ
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు.
5:31 فَبَعَثَ اللَّهُ غُرَابًا يَبْحَثُ فِي الْأَرْضِ لِيُرِيَهُ كَيْفَ يُوَارِي سَوْءَةَ أَخِيهِ ۚ قَالَ يَا وَيْلَتَا أَعَجَزْتُ أَنْ أَكُونَ مِثْلَ هَٰذَا الْغُرَابِ فَأُوَارِيَ سَوْءَةَ أَخِي ۖ فَأَصْبَحَ مِنَ النَّادِمِينَ
ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
5:32 مِنْ أَجْلِ ذَٰلِكَ كَتَبْنَا عَلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنَّهُ مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا ۚ وَلَقَدْ جَاءَتْهُمْ رُسُلُنَا بِالْبَيِّنَاتِ ثُمَّ إِنَّ كَثِيرًا مِّنْهُم بَعْدَ ذَٰلِكَ فِي الْأَرْضِ لَمُسْرِفُونَ
ఈ కారణంగానే మేము ఇస్రాయీలు సంతతిపై ఈ ఫర్మానా విధించాము: “ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీకారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.” వారి వద్దకు మా ప్రవక్తలెందరో స్పష్టమయిన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని ఆ తరువాత కూడా వారిలో చాలా మంది అవనిలో దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడేవారు ఉన్నారు.
9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్ (ఏసు క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని నసారా (నస్రానీలు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?
9:31 اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ
వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్‌బార్)ను, సన్యాసుల (రుహ్‌బాన్)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు.
9:32 يُرِيدُونَ أَن يُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَيَأْبَى اللَّهُ إِلَّا أَن يُتِمَّ نُورَهُ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో (ఊది) ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ - అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే - తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదలిపెట్టటానికి అంగీకరించడు.
9:33 هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నీ, సత్యధర్మాన్నీ ఇచ్చి పంపాడు - ముష్రిక్కులకు ఎంత సహించరానిదయినా సరే, ఇతర ధర్మాలపై దానికి ఆధిక్యతను వొసగటానికి!
33:7 وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ابْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَاقًا غَلِيظًا
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము- (ముఖ్యంగా) నీ నుండి, నూహ్ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్ కుమారుడైన ఈసా నుండి. మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము -
43:59 إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَاهُ مَثَلًا لِّبَنِي إِسْرَائِيلَ
అతను (మర్యమ్ కుమారుడైన ఈసా) కూడా ఒక దాసుడు మాత్రమే. మేమతన్ని అనుగ్రహించాము. ఇస్రాయీలు సంతతి వారికొరకు అతన్ని ఒక ఉదాహరణ (మా శక్తి నిదర్శనం)గా చేశాము.
43:60 وَلَوْ نَشَاءُ لَجَعَلْنَا مِنكُم مَّلَائِكَةً فِي الْأَرْضِ يَخْلُفُونَ
మరి మేమే గనక తలచుకుంటే మీకు బదులుగా దైవదూతలనే భూమికి వారసులుగా చేసి ఉండేవారం.
43:61 وَإِنَّهُ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَاتَّبِعُونِ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
నిశ్చయంగా అతను (ఈసా - అలైహిస్సలాం) ప్రళయానికి ఒక సూచన. కాబట్టి మీరు దాని (ప్రళయదినం) విషయంలో సందేహపడకండి. మీరు నన్ను అనుసరించండి. ఇదే రుజు మార్గం.
43:62 وَلَا يَصُدَّنَّكُمُ الشَّيْطَانُ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
షైతాన్ మిమ్మల్ని అడ్డుకోరాదు సుమా! వాడు మీకు బద్ధ విరోధి.
43:63 وَلَمَّا جَاءَ عِيسَىٰ بِالْبَيِّنَاتِ قَالَ قَدْ جِئْتُكُم بِالْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ الَّذِي تَخْتَلِفُونَ فِيهِ ۖ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా (ఏసు - అలైహిస్సలాం) ఇలా అన్నాడు: "నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమరచి చెప్పటానికే వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.
43:64 إِنَّ اللَّهَ هُوَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
"నిజానికి నా ప్రభువూ, మీ ప్రభువూ అల్లాహ్ మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం."
43:65 فَاخْتَلَفَ الْأَحْزَابُ مِن بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ
అయితే ఆ తర్వాత (ఇస్రాయీల్ సంతతికి చెందిన) పలు కూటములవారు పరస్పరం విభేదించుకున్నారు. కనుక దుర్మార్గులకు బాధాకరమైన దినమునందలి శిక్ష వల్ల వినాశం తప్పదు.
43:66 هَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
తమకు తెలీకుండానే, తమపై అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని వారు ఎదురు చూస్తున్నారా?
43:67 الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ
ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు శత్రువులై పోతారు - అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు.
43:68 يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ
ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
43:69 الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ
మా సూచనలను విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)
43:70 ادْخُلُوا الْجَنَّةَ أَنتُمْ وَأَزْوَاجُكُمْ تُحْبَرُونَ
మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి.
4:162 لَّٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
అయితే వారిలో పరిపూర్ణమైన, పరిపక్వతనొందిన జ్ఞానంగలవారూ, విశ్వసించినవారూ, నీపై అవతరింపజెయ్య బడినదానినీ, నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించేవారూ, నమాజులను నెలకొల్పేవారూ, జకాతును చెల్లించేవారూ, అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారూ - వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము.
4:163 إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَىٰ نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا
(ఓ ముహమ్మద్!) మేము నూహ్ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. ఇంకా మేము ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాకూబు మరియు అతని సంతతి వారికి, ఈసా, అయ్యూబు, యూనుసు, హారూను, సులైమానుల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూదుకు జబూరు (గ్రంథం) వొసగాము.
4:164 وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّهُ مُوسَىٰ تَكْلِيمًا
నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా (అలైహిస్సలాం) తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు.
4:165 رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము - ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము). అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, మహావివేకి.
4:166 لَّٰكِنِ اللَّهُ يَشْهَدُ بِمَا أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُ بِعِلْمِهِ ۖ وَالْمَلَائِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
(ఓ ప్రవక్తా!) నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సయితం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహ్‌యే చాలు.
4:167 إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ قَدْ ضَلُّوا ضَلَالًا بَعِيدًا
ఎవరయితే అవిశ్వాసానికి ఒడిగట్టి, అల్లాహ్ మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
4:168 إِنَّ الَّذِينَ كَفَرُوا وَظَلَمُوا لَمْ يَكُنِ اللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا
అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటంగానీ, ఏదైనా మార్గం చూపటంగానీ చేయడు-
4:169 إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرًا
వారికి నరకమార్గం చూపటం తప్ప! వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్‌కు బహు సులువు.
4:170 يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمُ الرَّسُولُ بِالْحَقِّ مِن رَّبِّكُمْ فَآمِنُوا خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
ప్రజలారా! మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు. కాబట్టి మీరు విశ్వసించండి. అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే (అని తెలుసుకోండి). అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడూను.
4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్‌కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్‌నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు 'ముగ్గురు' అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు.
4:172 لَّن يَسْتَنكِفَ الْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا الْمَلَائِكَةُ الْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا
మసీహ్ (అలైహిస్సలాం) గానీ, అల్లాహ్ సామీప్యం పొందిన దూతలుగానీ తాము అల్లాహ్ దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లాహ్ దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి, గర్వాతిశయంతో విర్రవీగే వారినందరినీ అల్లాహ్ తన వద్దకు ప్రోగుచేస్తాడు.
61:5 وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَد تَّعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
మూసా తన జాతివారితో, “ఓ నా జాతి ప్రజలారా! నేను మీ వద్దకు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు?” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకం చేసుకోదగినది). వారు వక్రంగానే ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
61:6 وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ
మర్యమ్ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్” అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే). తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఇది పచ్చి ఇంద్రజాలం” అని వారు అన్నారు (తేలిగ్గా కొట్టి పారేశారు).
61:12 يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَيُدْخِلْكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుబ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం.
61:13 وَأُخْرَىٰ تُحِبُّونَهَا ۖ نَصْرٌ مِّنَ اللَّهِ وَفَتْحٌ قَرِيبٌ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
మీరెంతగానో ఇష్టపడే మరొకటి (అనుగ్రహం) కూడా వొసగుతాడు. అది అల్లాహ్ సహాయం, శీఘ్ర విజయం! (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు.
61:14 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا أَنصَارَ اللَّهِ كَمَا قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ لِلْحَوَارِيِّينَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ ۖ فَآمَنَت طَّائِفَةٌ مِّن بَنِي إِسْرَائِيلَ وَكَفَرَت طَّائِفَةٌ ۖ فَأَيَّدْنَا الَّذِينَ آمَنُوا عَلَىٰ عَدُوِّهِمْ فَأَصْبَحُوا ظَاهِرِينَ
ఓ విశ్వాసులారా! మర్యం కుమారుడైన ఈసా తన హవారీలతో, “అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు?” అని అన్నప్పుడు, “అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము” అని హవారీలు సమాధాన మిచ్చినట్లు మీరు కూడా అల్లాహ్ కు సహాయకులు అవండి. తరువాత ఇస్రాయీలు సంతతివారిలో ఒక వర్గం వారు విశ్వసించగా, మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు.
42:13 شَرَعَ لَكُم مِّنَ الدِّينِ مَا وَصَّىٰ بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ۖ أَنْ أَقِيمُوا الدِّينَ وَلَا تَتَفَرَّقُوا فِيهِ ۚ كَبُرَ عَلَى الْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ ۚ اللَّهُ يَجْتَبِي إِلَيْهِ مَن يَشَاءُ وَيَهْدِي إِلَيْهِ مَن يُنِيبُ
ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్- సఅసం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము. (ఓ ముహమ్మద్ - సఅసం!) నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని (తన కార్యం కొరకు) ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు.
2:136 قُولُوا آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి : ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్‌హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.”
2:137 فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఒకవేళ వారు మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే, సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. వారి బారి నుండి (రక్షించటానికి) నీకు అల్లాహ్ చాలు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
2:252 تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۚ وَإِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ
ఇవి అల్లాహ్ ఆయతులు. వీటిని మేము సత్యబద్ధంగా నీకు వినిపిస్తున్నాము. (ఓ ముహమ్మద్!) నిస్సందేహంగా నువ్వు దైవసందేశహరులలోని వాడవు.
2:253 تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِّنْهُم مَّن كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِن بَعْدِهِم مِّن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُم مَّنْ آمَنَ وَمِنْهُم مَّن كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
వీరు దైవప్రవక్తలు. వీరిలో కొందరికి మరికొందరిపై మేము ప్రాధాన్యతను వొసగాము. వీరిలో కొందరితో అల్లాహ్ సంభాషించాడు. కొందరి తరగతులను ఉన్నతం చేశాడు. ఇంకా మేము మర్యమ్ కుమారుడగు ఈసాకు స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తోడ్పాటునందించాము. ఒకవేళ అల్లాహ్‌యే గనక తలిస్తే వీరి తరువాత స్పష్టమయిన నిదర్శనాలు చూసిన ప్రజలు పరస్పరం తగవులాడుకునేవారు కాదు. కాని వారు విభేదాల్లో పడిపోయారు. వారిలో కొందరు విశ్వసించగా, మరి కొందరు అవిశ్వాసులుగా ఉండిపోయారు. అల్లాహ్ గనక కోరితే వీరు పరస్పరం కలహించుకునే వారు కారు. కాని అల్లాహ్ మాత్రం తాను తలచిందే చేస్తాడు.
2:254 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహబంధాలుగానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు.
2:255 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
2:256 لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్‌ను) తిరస్కరించి అల్లాహ్‌ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:257 اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
విశ్వసించినవారి సంరక్షకునిగా స్వయంగా అల్లాహ్ ఉంటాడు. ఆయన వారిని చీకట్ల నుంచి వెలుగు వైపుకు తీసుకుపోతాడు. కాగా; అవిశ్వాసుల నేస్తాలు షైతానులే (తాగూతే). వాళ్లు వారిని వెలుగు నుంచి చీకట్ల వైపుకు లాక్కు పోతారు. వారు నరకవాసులు, కలకాలం అందులోనే పడి ఉంటారు.
2:258 أَلَمْ تَرَ إِلَى الَّذِي حَاجَّ إِبْرَاهِيمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللَّهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّيَ الَّذِي يُحْيِي وَيُمِيتُ قَالَ أَنَا أُحْيِي وَأُمِيتُ ۖ قَالَ إِبْرَاهِيمُ فَإِنَّ اللَّهَ يَأْتِي بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِي كَفَرَ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అల్లాహ్ తనకు రాజ్యాధికారం ఇచ్చాడని (గర్వం కొద్దీ) ఇబ్రాహీంతో అతని ప్రభువు (ఎవరన్న) విషయంపై గొడవపడిన వానిని నీవు చూడలేదా? “జీవన్మరణాలను ఇచ్చేవాడు నా ప్రభువు” అని ఇబ్రాహీం అన్నప్పుడు, “నేనూ బ్రతికిస్తాను, చంపుతాను” అని అతనన్నాడు. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం), “సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు వైపు నుంచి ఉదయింపజేస్తున్నాడు కదా! మరి నువ్వు దాన్ని కాస్త పడమటి వైపు నుంచి ఉదయింపజెయ్యి” అని కోరినప్పుడు ఆ దైవతిరస్కారి బిత్తరపోయాడు. యదార్థమేమిటంటే అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.
2:284 لِّلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్‌దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌కు అన్నింటిపై అధికారం ఉంది.
2:285 آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
2:286 لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
112. సూరా అల్ ఇఖ్లాస్

112:1 قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు.
112:2 اللَّهُ الصَّمَدُ
అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు).
112:3 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.
112:4 وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
113. సూరా అల్ ఫలఖ్

113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –
113:2 مِن شَرِّ مَا خَلَقَ
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,
113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,
113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి,
113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).
114. సూరా అన్ నాస్

114:1 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.
114:2 مَلِكِ النَّاسِ
మానవుల చక్రవర్తిని,
114:3 إِلَٰهِ النَّاسِ
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –
114:4 مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,
114:5 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –
114:6 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!
1. సూరా అల్ ఫాతిహా

1:1 بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతొ
1:2 الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,
1:3 الرَّحْمَٰنِ الرَّحِيمِ
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.
1:4 مَالِكِ يَوْمِ الدِّينِ
ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని.
1:5 إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.
1:6 اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు.
1:7 صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ
నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం (చూపు).
సృష్టికర్త ఐన దేవుడు - మనందరికీ - ఈ లోకంలో - సమాధి జీవితంలో - ప్రళయదినం రోజు - పరలోకంలో కూడా సహాయపడు గాక - ఆమీన్. ప్రవక్తలందరిపై శాంతిసఔక్యాలూ కురియుగాక - ఆమీన్
- Get link
- X
- Other Apps






















Comments
Post a Comment