FIVE QURAN VERSES ABOUT RAMADAN AND FASTING #TELUGUBUKHARI @TELUGUBUKHARI - Quran & Hadith

 FIVE QURAN VERSES ABOUT RAMADAN AND FASTING #TELUGUBUKHARI @TELUGUBUKHARI - Quran & Hadith

                                                                https://youtu.be/84DUMAFr-nU

FIVE QURAN VERSES ABOUT RAMADAN AND FASTING·       

RAMAZAN

https://docs.google.com/document/d/1Wa-J23pYkoYeE5OPDyKZVQXxJq4_ewYr/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true

·       ఒక్క రోజు ఉపవాసానికి ఎంత పుణ్యం?

·       ఉపవాసికి స్వర్గంలోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన ద్వారం?

·       ఉపవాసం, తరావీ నమాజ్, ఎతేకాఫ్, లైలతుల్ కధర్ గొప్పదనం

·       10 to 700 రెట్లు అధికంగా పుణ్యం 

·       రంజాన్ మొదటి రాత్రి ఏంజరుగుతుంది? రంజాన్ ముందురాత్రి ఏంజరుగుతుంది? చివరి రాత్రులలో ఏంజరుగుతుంది?0

·       ఉపవాసం, ఖురాన్ఈ 2 వసీలా ప్రళయదినం రోజు

·       1000 నెలలకంటే విలువైన ఒక గొప్పరాత్రి - రంజాన్ లో

·       రంజాన్ నెల ను ఎలా గుర్తించాలి?

·       నెలకు ఎన్ని రోజులు ?

·       రెండు పండుగలు గొప్పవే

·       ట్రైనింగ్ ఉపవాసాలు

·       షాబాన్ నెలలో ఎక్కువ నఫిల్ ఉపవాసాలు?

·       సహరీ, ఇఫ్తార్ & విశాల్ గురించి ప్రవక్త () ఎంచెప్పరంటే..

·       సహరీ తినేటప్పుడు అజాన్ అయితే ఏంచేయాలి?

  • ఉపవాసం ఎలా విరమిచ్చాలి?
  • ఇఫ్తార్ విందు చేయించేవారికి ఎటువంటి శుభాలు లభిస్తాయి?
  • ఉపవాసం విడిచేటప్పుడు ఎం దువా చదవాలి?
  • ఉపవాసం విడిచే టప్పుడు టైం పట్టించుకోకపోతే జెరిగే భవిష్యవాణి - ప్రవక్త() ఎం చెప్పారు?
  • ఎవరి ఉపవాసం వృధా అయిపోతుంది?
  • విషయాల వల్ల ఉపవాసం భంగం కాదు?
  • ఉపవాసంలో భార్య భర్తలు రమిస్తే ఎంత పాపం?
  • ప్రయాణం లో ఉన్నప్పుడు ఉపవాస నియమ నిబంధనలు?
  • ఆడవారి బహిష్టు స్థితిలో ఉపవాసాలు, నమాజులు సంగతేంటి?
  • ఉపవాసాలు పూర్తి కాకుండా చనిపోతే?
  • షాబాన్ నెలలో ఎన్ని ఉపవాసాలుండొచ్చు?
  • రంజాన్ తర్వాత - ఎక్కువ పుణ్యాలు కలిగిన ఉపవాసం/నమాజ్ ఏవి?
  • రంజాన్ తో సంబంధం వున్నషవ్వాల్ నెల 6 ఉపవాసాలు ఏంటి?
  • రంజాన్ నెల కాకుండా ఇతర నెలల్లో ఉపవాసం ఉండకూడని దినాలు ఏవి?
  • రంజాన్ తర్వాత నఫిల్ ఉపవాసాలు ఎలా ఉండాలి?
  • షబ్బే బరాత్/ఖదర్/లైలతుల్ ఖదర్ ఎప్పుడు? అది ఏంటి?
  • ఎతేకాఫ్ మరియు లైలతుల్ ఖదర్ గురించి ప్రవక్త () గారు ఎం చెప్పారు?
  • సూర్యుడు ఉదయిస్తే కిరణాలతో ఉదయించడు రోజు?
  • షబ్బే ఖదర్ రోజు ఎం దువా చేయాలి?
  • ఎతేకాఫ్ ఆడవారు కూడా ఉండవచ్చా? ఆడవారు మస్జీద్ కి వెళ్లవచ్చా?
  • రంజాన్ లో ఖురాన్ చదవడం, దానధర్మాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి?
  • ఎతేకాఫ్ లో ఉన్నప్పుడు ఎవరినైనా కలవొచ్చా?
  • తరావీహ్ నమాజ్ చదివితే ఎం లాభం? ప్రవక్త () ఎలా ఆచరించేవారు?
  • ఇంట్లో నఫిల్ నమాజ్ చదవడం వల్లమ్ ఏంటి ప్రయోజనం?
  • లైలతుల్ ఖదర్ కోసం, రోజులలో కుటుంబం / సమాజం తో కలిపి ప్ర() ఎలా తరావీ నమాజులు చేశారు?
  • ఉమర్ () గారు తరావీ నమాజు కోసం మస్జీద్ లో ఎం చేశారు?
  • తరావీ నమాజ్ ఎన్ని రకాతులు?
  • తహజ్జుద్ నమాజ్, విత్ర్ నమాజ్, ఇష్రాక్ & ఛాప్త్ నమాజులు, సలాత్ తస్బీహ్ నమాజ్, దువాయే ఖునూత్ - వీటన్నిటి గురించి తెలుగు బుఖారీ లో తెలుసు కోవడం జరిగింది...
  • ఫిత్రాదానం అంటే ఏంటి? ఎవరివ్వాలి? ఎలా/ఎప్పుడు ఇవ్వాలి?
  • జకాత్ అంటే ఏమిటి, సద్కా అంటే ఏమిటి? కైరాత్ అంటే ఏమిటి? ఎవరు ఇవ్వాలి? ఇవ్వరు తీసుకోవచ్చు? ఇస్తే ఎం పుణ్యం, ఇవ్వకపోతే ఏమైనా పాపమా? వీటిగురించితెలుగు బుహారీలో చెప్పబడ్డాయి.
  • పండుగ నమాజ్ కి ముందు ఎం చేయాలి, నమాజ్ ఎకాడ/ఎలా చేయాలి?

FIVE QURAN VERSES ABOUT RAMADAN AND FASTING

2:183  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ

విశ్వసించినవారలారా! ఉపవాసాలుండటం మీపై విధిగా నిర్ణయించబడింది - మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది.

2:184  أَيَّامًا مَّعْدُودَاتٍ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۚ وَعَلَى الَّذِينَ يُطِيقُونَهُ فِدْيَةٌ طَعَامُ مِسْكِينٍ ۖ فَمَن تَطَوَّعَ خَيْرًا فَهُوَ خَيْرٌ لَّهُ ۚ وَأَن تَصُومُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

అదీ లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో, ప్రయాణీకులుగానో ఉన్నవారు ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి. స్థోమత ఉన్న వారు (ఉపవాసం పాటించకపోయినందుకు) పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి. కాని ఎవరైనా స్వచ్ఛందంగా ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. మీరు గ్రహించ గలిగితే ఉపవాసం ఉండటమే మీ కొరకు శ్రేయస్కరం.

2:185  شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

రమజాను నెల - ఖుర్ఆన్అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణీకుని గానో ఉన్న వారు ఇతర దినాలలో లెక్కను పూర్తిచేయాలి. అల్లాహ్మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్టపెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తిచేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్అభిలాష!

2:186  وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ

( ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని (నువ్వు వారికి చెప్పు). కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసావహించాలి, నన్ను విశ్వసించాలి ( విషయం నీవు వారికి తెలియజేయి). తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగల్గుతారు.

2:187  أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنتُمْ تَخْتَانُونَ أَنفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ

ఉపవాస కాలంలోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహ్కు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి, మీ తప్పును మన్నించాడు. ఇకనుంచి మీరు మీ భార్యలతో (ఉపవాసపు రాత్రులందు) రమించడానికీ, అల్లాహ్మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించటానికీ మీకు అనుమతి ఉంది. తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకూ తినండి, త్రాగండి. తరువాత (వీటన్నింటినీ పరిత్యజించి) రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి. ఇంకా - మీరు మస్జిదులలో 'ఏతెకాఫ్‌' పాటించేకాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్‌ (నిర్ధారించిన) హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకుగాను అల్లాహ్తన ఆయతులను ఇలా విడమరచి చెబుతున్నాడు.

 


16:128
  إِنَّ اللَّهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ

నిశ్చయంగా అల్లాహ్తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి, సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.

49:13  يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ

మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యదార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు.

33:35  إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

నిశ్చయంగా ముస్లిం పురుషులు - ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు - విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు - సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు - సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు - అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు - దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు - ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు - కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్ను అత్యధికంగా స్మరించే పురుషులు - స్మరించే స్త్రీలు - వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.

9:112  التَّائِبُونَ الْعَابِدُونَ الْحَامِدُونَ السَّائِحُونَ الرَّاكِعُونَ السَّاجِدُونَ الْآمِرُونَ بِالْمَعْرُوفِ وَالنَّاهُونَ عَنِ الْمُنكَرِ وَالْحَافِظُونَ لِحُدُودِ اللَّهِ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ

వారు ఎలాంటి వారంటే; (దైవసన్నిధిలో) పశ్చాత్తాపం చెందుతూ, ఆరాధనలు చేస్తూ ఉంటారు, అల్లాహ్స్తోత్రం చేస్తారు, ఉపవాసాలుంటారు (లేక అల్లాహ్మార్గంలో భూమి మీద సంచారం చేస్తూ ఉంటారు), అల్లాహ్సమక్షంలో వంగుతూ, సాష్టాంగపడుతూ ఉంటారు. మంచి పనుల గురించి ప్రబోధిస్తూ, చెడు విషయాల నుంచి నిరోధిస్తూ ఉంటారు. ఇంకా అల్లాహ్నిర్థారించిన హద్దులను కాపాడుతారు. ఇలాంటి విశ్వాసులకు ( ప్రవక్తా!) శుభవార్తను వినిపించు.

 

97. సూరా అల్ ఖద్ర్


97:1  إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ

నిశ్చయంగా మేము దీనిని ( ఖుర్ఆనును) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.

97:2  وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ

ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?

97:3  لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ

ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.

97:4  تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ

రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.

97:5  سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ

రాత్రి అసాంతం శాంతియుతమైనదితెల్లవారే వరకూ (అది ఉంటుంది).

 

 

 

 

 

 

 

ఉపవాసికి స్వర్గంలోకి వెళ్ళడానికి ప్రత్యేకమైన ద్వారం?

 

ఉపవాసం, తరావీ నమాజ్, ఎతేకాఫ్, లైలతుల్ కధర్ గొప్పదనం

 

700 రెట్లు అధికంగా పుణ్యం 

 

 

రంజాన్ మొదటి రాత్రి ఏంజరుగుతుంది?

ఉపవాసం, ఖురాన్ఈ 2 వసీలా ప్రళయదినం రోజు

 

1000 నెలలకంటే విలువైన ఒక గొప్పరాత్రి - రంజాన్ లో

 

రంజాన్ నెల ను ఎలా గుర్తించాలి?

 

 

నెలకు ఎన్ని రోజులు ?

రెండు పండుగలు గొప్పవే

ట్రైనింగ్ ఉపవాసాలు

 

షాబాన్ నెలలో ఎక్కువ నఫిల్ ఉపవాసాలు?

సహరీ, ఇఫ్తార్ & విశాల్ గురించి ప్రవక్త () ఎంచెప్పరంటే..

 

సహరీ తినేటప్పుడు అజాన్ అయితే ఏంచేయాలి?

ఉపవాసం ఎలా విరమిచ్చాలి?

ఇఫ్తార్ విందు చేయించేవారికి ఎటువంటి శుభాలు లభిస్తాయి?

ఉపవాసం విడిచేటప్పుడు ఎం దువా చదవాలి?

 

ఉపవాసం విడిచే టప్పుడు టైం పట్టించుకోకపోతే జెరిగే భవిష్యవాణి - ప్రవక్త() ఎం చెప్పారు?

ఎవరి ఉపవాసం వృధా అయిపోతుంది?

 

విషయాల వల్ల ఉపవాసం భంగం కాదు?

 

 

ఉపవాసంలో భార్య భర్తలు రమిస్తే ఎంత పాపం?

 

 

ప్రయాణం లో ఉన్నప్పుడు ఉపవాస నియమ నిబంధనలు?

 

 

 

 

 

ఆడవారి బహిష్టు స్థితిలో ఉపవాసాలు, నమాజులు సంగతేంటి?

ఉపవాసాలు పూర్తి కాకుండా చనిపోతే?

షాబాన్ నెలలో ఎన్ని ఉపవాసాలుండొచ్చు?

 

రంజాన్ తర్వాత - ఎక్కువ పుణ్యాలు కలిగిన ఉపవాసం/నమాజ్ ఏవి?

 

ఇతర ఉపవాసాలు : షవ్వాల్ నెలలో ఆరు ఉపవాసాలు, మొహరం పదవ తేదీ & ఆషూరా రోజు ఉపవాసాలు కూడా మంచివే,  జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ, ప్రతినెలా మూడు రోజులు, సోమవారం ఉపవాసం (ప్రవక్త .. పుట్టిన రోజు/ఖురాన్ అవతరణ ప్రారంభ మైన రోజు )

రంజాన్ తో సంబంధం వున్నషవ్వాల్ నెల 6 ఉపవాసాలు ఏంటి?

రంజాన్ నెల కాకుండా ఇతర నెలల్లో ఉపవాసం ఉండకూడని దినాలు ఏవి?

రంజాన్ తర్వాత నఫిల్ ఉపవాసాలు ఎలా ఉండాలి?

షబ్బే బరాత్/ఖదర్/లైలతుల్ ఖదర్ ఎప్పుడు? అది ఏంటి?

ఎతేకాఫ్ మరియు లైలతుల్ ఖదర్ గురించి ప్రవక్త () గారు ఎం చెప్పారు?

 

 

 

సూర్యుడు ఉదయిస్తే కిరణాలతో ఉదయించడు రోజు?

షబ్బే ఖదర్ రోజు ఎం దువా చేయాలి?

ఎతేకాఫ్ ఆడవారు కూడా ఉండవచ్చా? ఆడవారు మస్జీద్ కి వెళ్లవచ్చా?

రంజాన్ లో ఖురాన్ చదవడం, దానధర్మాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి?

 

 

ఎతేకాఫ్ లో ఉన్నప్పుడు ఎవరినైనా కలవొచ్చా?

 

 

తరావీహ్ నమాజ్ చదివితే ఎం లాభం? ప్రవక్త () ఎలా ఆచరించేవారు?

 

 

 

 

ఇంట్లో నఫిల్ నమాజ్ చదవడం వల్లమ్ ఏంటి ప్రయోజనం?

లైలతుల్ ఖదర్ కోసం, రోజులలో కుటుంబం / సమాజం తో కలిపి ప్ర() ఎలా తరావీ నమాజులు చేశారు?

 

ఉమర్ () గారు తరావీ నమాజు కోసం మస్జీద్ లో ఎం చేశారు?

తరావీ నమాజ్ ఎన్ని రకాతులు?

 

 

తహజ్జుద్ నమాజ్, విత్ర్ నమాజ్, ఇష్రాక్ & ఛాప్త్ నమాజులు, సలాత్ తస్బీహ్ నమాజ్, దువాయే ఖునూత్ - వీటన్నిటి గురించి తెలుగు బుఖారీ లో తెలుసు కోవడం జరిగింది...

ఫిత్రాదానం అంటే ఏంటి? ఎవరివ్వాలి? ఎలా/ఎప్పుడు ఇవ్వాలి?

జకాత్ అంటే ఏమిటి, సద్కా అంటే ఏమిటి? కైరాత్ అంటే ఏమిటి? ఎవరు ఇవ్వాలి? ఇవ్వరు తీసుకోవచ్చు? ఇస్తే ఎం పుణ్యం, ఇవ్వకపోతే ఏమైనా పాపమా? వీటిగురించి -  తెలుగు బుహారీలో చెప్పబడ్డాయి.

పండుగ నమాజ్ కి ముందు ఎం చేయాలి, నమాజ్ ఎకాడ/ఎలా చేయాలి?

 

https://docs.google.com/document/d/1eyW-qkQsx83Z71tZvRSNVO0F4y7SrrXD/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true

Comments