Finance System in the World 🌍 #quran #hadees #Riba #Sood #business #SlefEmployment #telugu #shorts


RIBA IN THE QURAN

https://docs.google.com/document/d/1T9NYZ362RTV8C3ooHM_PIQnVinwaxtJ0/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true

4. సూరా అన్ నిసా

4:160  فَبِظُلْمٍ مِّنَ الَّذِينَ هَادُوا حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَاتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ اللَّهِ كَثِيرًا

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ,

4:161  وَأَخْذِهِمُ الرِّبَا وَقَدْ نُهُوا عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَالَ النَّاسِ بِالْبَاطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا

నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లనూ, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లనూ (వారికీ దుర్గతి పట్టింది). వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమయిన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.

 

3. సూరా ఆలి ఇమ్రాన్

3:130  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్కు భయపడండి.

3:131  وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ

అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.

3:132  وَأَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

అల్లాహ్కూ, ప్రవక్తకూ విధేయత చూపండి - తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.

3:133  وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ

మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.

3:134  الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ

వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.

 

2. సూరా అల్ బఖర

2:275  الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణంవ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.

2:276  يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ

అల్లాహ్వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్సుతరామూ ప్రేమించడు.

2:277  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

విశ్వసించి (సున్నత్ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

2:278  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ

విశ్వసించినవారలారా! అల్లాహ్కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి.

2:279  فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ

ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు.

2:280  وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.

2:281  وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

మీరు అంతా అల్లాహ్వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.

2:195  وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ

అల్లాహ్మార్గంలో ఖర్చుపెట్టండి. చేజేతులా మిమ్మల్ని మీరు వినాశం పాలు చేసుకోకండి. ఉత్తమంగా మసలుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ఉత్తమంగా వ్యవహరించేవారిని ప్రేమిస్తాడు.

2:214  أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ

ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, ( ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).

2:215  يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

తాము ఏం ఖర్చు చెయ్యాలి? అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. మీరేం ఖర్చు చేసినా అది మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చేయాలి. మీరు మేలు చేసినా అల్లాహ్కు దాని గురించి తెలుసు అని ( ప్రవక్తా!) వారికి చెప్పు.

2:219  يَسْأَلُونَكَ عَنِ الْخَمْرِ وَالْمَيْسِرِ ۖ قُلْ فِيهِمَا إِثْمٌ كَبِيرٌ وَمَنَافِعُ لِلنَّاسِ وَإِثْمُهُمَا أَكْبَرُ مِن نَّفْعِهِمَا ۗ وَيَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ قُلِ الْعَفْوَ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ

ప్రజలు నిన్ను మద్యపానం గురించి, జూదం గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వు వారికి చెప్పు: “రెండింటిలోనూ చాలా పెద్ద పాపం ఉంది. ప్రజలకు దీనివల్ల కొన్ని ప్రాపంచిక లాభాలు కూడా చేకూరుతాయి. కాని వీటి ద్వారా చేకూరే లాభం కన్నా పాపం చాలా ఎక్కువ.” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతారు. 'మీ ఖర్చులు పోగా మిగిలినది' అని నువ్వు వారికి చెప్పు. మీరు యోచన చేసేటందుకు గాను అల్లాహ్ విధంగా తన ఆదేశాలను స్పష్టంగా వివరిస్తున్నాడు.

2:261  مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్మార్గంలో తమ ధనాన్ని ఖర్చుచేసేవారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకువస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్తాను కోరినవారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.

2:262  الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండకుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు.

2:263  قَوْلٌ مَّعْرُوفٌ وَمَغْفِرَةٌ خَيْرٌ مِّن صَدَقَةٍ يَتْبَعُهَا أَذًى ۗ وَاللَّهُ غَنِيٌّ حَلِيمٌ

దానం చేసిన తరువాత మనసు నొప్పించటం కంటే మంచి మాట పలకటం, క్షమించటం ఎంతో మేలు. అల్లాహ్అక్కరలేనివాడు, సహనశీలుడు.

2:264  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ فَمَثَلُهُ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌ فَأَصَابَهُ وَابِلٌ فَتَرَكَهُ صَلْدًا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّمَّا كَسَبُوا ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ

విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.

2:265  وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.

2:266  أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ

మీలో ఎవరికయినా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల తోట ఉండి, అందులో పిల్ల కాలువలు ప్రవహిస్తూ, అందులో అతనికి అన్ని రకాల ఫలాలు కూడా లభిస్తూ ఉండి, అతను ముసలివాడైపోగా, మరోవైపు అతని పిల్లలు బలహీనులుగా ఉండగా - అకస్మాత్తుగా తోటపై నిప్పులు చెరిగే వడగాలి వచ్చి తోట కాలిపోవటాన్ని మీలో ఎవరయినాసరే ఇష్టపడతారా? మీరు ఆలోచించేటందుకుగాను అల్లాహ్ విధంగా తన ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు.

2:267  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ

విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తిచేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి- మీరు స్వయంగా వాటిని తీసుకోరు. ఒకవేళ కళ్లు మూసుకొని ఉంటే అది వేరే విషయం. అల్లాహ్అక్కరలేనివాడు, సర్వస్తోత్రములకు అర్హుడని తెలుసుకోండి.

2:268  الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

షైతాన్మీకు దారిద్య్రం గురించి భయపెడతాడు. నీతిమాలిన పనులకై పురికొల్పుతాడు. కాగా; అల్లాహ్మిమ్మల్ని క్షమిస్తాననీ, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్గొప్ప ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు.

https://docs.google.com/document/d/1GGUpDZvQ3vOHtGQYbZxNkc04UmwAbrN7/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true


2:269  يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ

ఆయన తాను కోరిన వారికి విజ్ఞతా వివేచనలను ప్రసాదిస్తాడు. ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే. హితబోధను బుద్ధిమంతులు తప్ప మరొకరు గ్రహించరు.

2:270  وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

మీరు (దైవమార్గంలో) ఎంత ఖర్చు చేసినా, మొక్కుబడి చేసుకున్నా అల్లాహ్కు దాని గురించి పూర్తిగా తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసే వారెవరూ లేరు.

2:271  إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

ఒకవేళ మీరు బహిరంగంగా దానధర్మాలు చేసినా మంచిదే గాని, గోప్యంగా నిరుపేదలకు ఇస్తే అది మీ కొరకు ఉత్తమం. (దీనివల్ల) అల్లాహ్మీ పాపాలను తుడిచిపెడతాడు. అల్లాహ్కు మీరు చేసేదంతా తెలుసు.

2:272  لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ

( ప్రవక్తా!) వారిని సన్మార్గంపై తెచ్చి నిలబెట్టే బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు.

2:273  لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

దైవమార్గంలో నిమగ్నులైన కారణంగా , (బ్రతుకు తెరువు కోసం) భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు. వారి నిజస్థితిని గురించి తెలియనివారు, (ఆత్మాభిమానం వల్ల) వారెవరినీ అడగకపోవటం చూసి, వారిని అవసరాలు లేనివారుగా తలపోస్తారు. మీరు వారి వాలకాన్ని చూసి వాస్తవస్థితిని ఊహించవచ్చు. తమకు సహాయం చెయ్యమంటూ వారు ప్రజల వెంటపడరు. (అటువంటి త్యాగధనుల సహాయార్థం) మీరు ఎంత సొమ్ము వెచ్చించినా, నిశ్చయంగా దాని గురించి అల్లాహ్కు తెలుసు.

2:274  الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

ఎవరయితే తమ సిరిసంపదలను రేయింబవళ్లు రహస్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుచేస్తారో వారి కొరకు వారి ప్రభువు వద్ద (గొప్ప) పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.

2:275  الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణంవ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.

74. సూరా అల్ ముద్దస్సిర్

74:6  وَلَا تَمْنُن تَسْتَكْثِرُ

ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు.

74:7  وَلِرَبِّكَ فَاصْبِرْ

నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.

 https://docs.google.com/document/d/1acL0wF8wReTdQcuUhFo4R7Ywmj3QBbWm/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true

30. సూరా ఆర్ రూమ్

30:38  فَآتِ ذَا الْقُرْبَىٰ حَقَّهُ وَالْمِسْكِينَ وَابْنَ السَّبِيلِ ۚ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ اللَّهِ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

కనుక సమీప బంధువుకు అతని హక్కును ఇవ్వు. అగత్యపరునికి, బాటసారికి కూడా (వారి హక్కులను ఇవ్వాలి). అల్లాహ్సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరేవారికి పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారంటే వీరే.

30:39  وَمَا آتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَ فِي أَمْوَالِ النَّاسِ فَلَا يَرْبُو عِندَ اللَّهِ ۖ وَمَا آتَيْتُم مِّن زَكَاةٍ تُرِيدُونَ وَجْهَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الْمُضْعِفُونَ

ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్దృష్టిలో ఎంతమాత్రం వృద్ధి చెందదు. అయితే అల్లాహ్ముఖాన్ని చూచేందుకు (ప్రసన్నతను చూరగొనేందుకు) మీరు జకాతు దానం ఇచ్చినట్లయితే - అలాంటి వారే (తమ సంపదలను) ఎన్నోరెట్లు వృద్ధిపరచుకున్న వారవుతారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

..

 

 

 

 

2. సూరా అల్ బఖర

2:275  الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ

వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయినవాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణంవ్యాపారం కూడా వడ్డీ లాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్దనుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతడు గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవా ధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.

2:276  يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ

అల్లాహ్వడ్డీని హరింపజేస్తాడు, దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్సుతరామూ ప్రేమించడు.

2:277  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

విశ్వసించి (సున్నత్ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

2:278  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ

విశ్వసించినవారలారా! అల్లాహ్కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి.

2:279  فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ

ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు.

2:280  وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.

2:281  وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

మీరు అంతా అల్లాహ్వైపుకు మరలింపబడే రోజుకు భయపడండి. తర్వాత ప్రతి ఒక్కరికీ తాను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం వొసగబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.

 

 

3:86  كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ

(తొలుత) విశ్వసించి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం (కూడా) యిచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు.

3:87  أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ

వారి పాపఫలంగా వారిపై అల్లాహ్శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది.

3:88  خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ

(శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు.

3:89  إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

అయితే తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ నడవడికను సరిదిద్దుకుంటారో (వారు రక్షించబడతారు). నిశ్చయంగా అల్లాహ్క్షమించేవాడు, కరుణించేవాడు.

3:90  إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ

ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరామూ స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే.

3:91  إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ

మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరయినాసరే భూమి నిండా బంగారం సమర్పించినా, తమ పాపానికి పరిహారంగా ఇచ్చినాసరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడూ ఉండడు.

3:92  لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ

మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్కు తెలుసు.

3:98  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ

'' గ్రంథవహులారా! మీరు అల్లాహ్ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్సాక్షిగా ఉన్నాడు'' అని ( ప్రవక్తా!) వారికి చెప్పు.

3:99  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ

''గ్రంథవహులారా! అల్లాహ్మార్గం నుంచి మీరు విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు'' అని ( ప్రవక్తా!) వారికి చెప్పు.

3:100  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ

విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు.

3:101  وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

మీకు అల్లాహ్ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్‌ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే.

3:102  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ

విశ్వాసులారా! అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.

3:103  وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ

అల్లాహ్త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి - అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని విధంగా అల్లాహ్మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు.

3:104  وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ

మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.

3:105  وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ

తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే.

4:47  يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا

గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని ( గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్తలచుకున్న పని ఇక అయిపోయినట్లే.

5:15  يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ

గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.

5:16  يَهْدِي بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

దాని ద్వారా అల్లాహ్తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు.

5:61  وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ

వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాముఅని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్బాగా ఎరుగు.

5:62  وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ

వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే చేష్టలన్నీ పరమ చెడ్డవి.

5:63  لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ

వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని.


29:44
  خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ

అల్లాహ్ఆకాశాలనూ, భూమినీ సత్య బద్ధంగా (పరమార్ధం దృష్ట్యా) సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది.

29:45  اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ

( ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు.

29:46  وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ

ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). "మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము" అని స్పష్టంగా చెప్పేయండి.

29:47  وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ

మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల (పూర్వం) మేము గ్రంథం వొసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో (మక్కా ముష్రిక్కులలో) కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసి పుచ్చుతారు.

47:24  أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا

ఏమిటి, వారు ఖుర్ఆన్గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?

 

 

3:110  كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ

మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.

57:28  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.

57:29  لِّئَلَّا يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّهِ ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ

దైవానుగ్రహంలోని భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని (ఆయన విధంగా చేశాడు). అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.

 

 





















 

Comments