DOWNLOAD HERE: NAMAZ PRAYERS and DUA - according to Quran and Dua #TeluguBukhari @TeluguBukhari

 

DOWNLOAD HERE: NAMAZ PRAYERS and DUA

https://docs.google.com/document/d/1-DWK6knV7Nbw_5yvRPKhjYpIIfRspBLW/edit?usp=share_link&ouid=101627634137561034494&rtpof=true&sd=true

నమాజు యొక్క దుఆలుస్మరణలు

1- వుజూకు ముందు పలకండి

బిస్మిల్లాహ్.
(
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను). (అబూ దావూద్ 101).

2- వుజూ తర్వాత చదవండి

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ రసూలుహూ.

అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరు భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను. (ముస్లిం 234).

3- అజాన్ సమాధానం, దాని పిదప దుఆ

అజాన్ విన్నప్పుడు ముఅజ్జిన్ అన్నట్లు మీరు అనండి, కాని అతనుహయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్అన్నప్పుడు మాత్రంలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం  అల్లాహ్ యే ప్రసా దించువాడు) అనండి. తర్వాత దరూదె ఇబ్రాహీం చదవండి. తర్వాత దుఆ కూడా చదవండిః

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ
అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ. (బుఖారి 614).

పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసినమఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠింప జేయి).

పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, వసీల అంటే స్వర్గంలో ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.”

4- మస్జిదు వైపునకు వెళ్తూ చదవండి

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, వమిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

( అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసా- దించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

వెలుగు అంటే ధర్మం మరియు సత్యాన్ని స్పష్ట పరచడం అని భావం.    

5- మస్జిదులో ప్రవేశించినప్పుడు చదవండి

اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

( అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు). (ముస్లిం 713).

6- మస్జిద్ నుండి బైటికి వెళ్తూ చదవండి

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.

( అల్లాహ్ నీతో నీ దయను కోరుతున్నాను.) (ముస్లిం 713).

7- తక్బీరె తహ్రీమ తర్వాత చదవండి

1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

( అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్రమవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి). (బుఖారి 744, ముస్లిం 598).

2- సుబ్ హానకల్లాహుమ్మ బిహమ్దిక తబార కస్ముక తఆలా జద్దుక లాఇలాహ ఘైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

(అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (అబూదావూద్ 775, తిర్మిజి 242. అల్బానీ సహీ అని అన్నారు).

3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

الْحَمْدُ لِله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే). (ముస్లిం 600).

4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా సుబ్ హానల్లాహి బుక్రతవ్ అసీలా.

اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا

(అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు). (ముస్లిం 601).

5- అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల మీకాఈల ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి అంత తహ్ కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్ ఇహ్ దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇజ్నిక ఇన్నక తహ్ దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీం.

اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنْ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

( అల్లాహ్! జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువా! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీవే నీ దాసుల మధ్య ఉన్న విభేదాలను గురించి తీర్పు చేయువానివి. సత్య విషయంలో విభేదించడం జరిగినదో అందులో నీ దయతో నాకు మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు). (ముస్లిం 770).

6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ నుసుకీ మహ్ యాయ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ బిజాలిక ఉమిర్తు అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లా హుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅతరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత లబ్బైక సఅదైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక అన బిక ఇలైక తబారక్త తఆలైత అస్తగ్ఫిరుక అతూబు ఇలైక.

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنْ الْمُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنْ الْمُسْلِمِينَ اللَّهُمَّ أَنْتَ الْمَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ ظَلَمْتُ نَفْسِي وَاعْتَرَفْتُ بِذَنْبِي فَاغْفِرْ لِي ذُنُوبِي جَمِيعًا إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ وَاهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفُ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ

(నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకుంటున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని. అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుడిని. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నిం చగల వాడెవడూ లేడు. నన్ను êత్పవర్తన వైపునకు నడిపించు, êత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీవు తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు  శుభప్రదమైనవాడివి, ఉన్నతుడివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను. (ముస్లిం 771).

8- రుకూలో చదవండి

1- సుబ్ హాన రబ్బియల్ అజీం      سُبْحَانَ رَبِّيَ الْعَظِيم                               

(ఘనుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).                             
పై దుఆ కనీసం ఒకసారైనా అనడం విధిగా ఉంది. అంతకు ఎక్కువగా అనడం ఉత్తమం.(ముస్లిం 773).  

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా బిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ.

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్.

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(
దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు). (ముస్లిం 487).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).
(
అబూదావూద్ 873, షేఖ్ అల్బానీ సహీ అని అన్నారు).

5- అల్లాహుమ్మ లక రకఅతు బిక ఆమంతు లక అస్లమ్ తు ఖషఅ లక సమ్ఈ బసరీ ముఖ్ఖీ అజమీ అసబీ.

اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِي وَبَصَرِيْ وَمُخِّي وَعَظَمِي وَعَصَبِي

(అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసిం చాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి). (ముస్లిం 771).

9- రుకూ నుండి నిలబడి చదవండి

1- రబ్బనా లకల్ హమ్ద్. رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 722). 

లేదా – రబ్బనా వలకల్ హమ్ద్   رَبَّنَا وَلَكَ الحَمْد                                                                        
(
సర్వ స్తోత్రములు నీకే మా ప్రభువా). (బుఖారి 689, ముస్లిం 392).

లేదా – అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 796, ముస్లిం 404).

లేదా – అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్ద్.  اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الحَمْد
(
అల్లాహ్! మా ప్రభువా! సర్వ స్తోత్రములు నీకే). (బుఖారి 795).  

నోట్: కొందరురబ్బనా లకల్ హందు వష్షుక్ర్అని అంటారు. అయితే దీని ప్రస్తావన హదీసులో రాలేదు, (గనక దానిని వదలుకోవాలి).

2- అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు మిల్ అస్సమావాతి మిల్అల్ అర్జి మిల్అ మా బైనహుమా మిల్అ మా షిఅ మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

(మా ప్రభువైన అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండి పోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే). (ముస్లిం 476).

3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి మిల్ఉ మా షిఅ మిన్ షైఇమ్ బఅదు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత లా ముఅతియ లిమా మనఅ వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).

رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ  وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(భూమ్యాకాశాలు నిండిపోవునంత, తర్వాత నీవు కోరిన ప్రతీది నిండి- పోవునంత ప్రశంసలు నీ కొరకే మా ప్రభువా! ఘనతలకు, పొగడ్తలకు అధిపతి అయిన, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవైనవాడా!. మేమందరమూ నీకే దాసులం. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఇచ్చేవాడూ లేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

4- రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ
(
మా ప్రభువా! ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు నీకే).(బుఖారి 799).

10- సజ్దాలో చదవండి

1-    సుబ్ హాన రబ్బియల్ అఅలా.   سُبْحَانَ رَبِّيَ الأعلَى

(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు). (ముస్లిం 772).
ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా బిహమ్దిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ.

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(
మా ప్రభువైన అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, అల్లాహ్ నన్ను మన్నించు). (బుఖారి 794, ముస్లిం 484).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్.

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(
దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు). (ముస్లిం 487).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ
(
సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు
(
అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ హదీసు సహీ అని అన్నారు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ జిల్లహు అవ్వలహూ ఆఖిరహూ అలానియతహూ సిర్రహూ.

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
(
అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గ తమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు). (ముస్లిం 483).

6- అల్లాహుమ్మ లక సజత్తు బిక ఆమంతు లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు సవ్వరహు షక్క సమ్అహు బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్.

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ
(
అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు). (ముస్లిం 771).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(
అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).(ముస్లిం 486).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం హదీసు ఆధారంగాఃదాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి”. (ముస్లిం 482).

11- రెండు సజ్దాల మధ్యలో చదవండి

1- రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ.     رَبِّ اغْفِرْ لِي ، رَبِّ اغْفِرْ لِي                                
(
ప్రభువా నా పాపాలను మన్నించు). (అబూదావూద్ 874).

2- అల్లాహుమ్ మగ్ఫిర్లీ వర్ హమ్నీ ఆఫినీ వహ్ దినీ వర్ జుఖ్నీ

اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي
(
అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు). (అబూదావూద్ 850).

12- తషహ్హుద్ లో చదవండి

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్ని యూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ అలా ఇబ్రా హీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్. (బుఖారి 3370).

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

( అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి.).

13- తషహ్హుద్ తర్వాత చదవండి

1- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజా బిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతి ల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ

( అల్లాహ్! సమాధి శిక్ష నుండి, నరక యాతన నుండి, జీవన్మర ణాల విపత్తు నుండి మరియు మసీహుద్దజ్జాల్ ఉపద్రవం  నుండి నీ శరణు వేడుచున్నాను.) (బుఖారి 1377, ముస్లిం 588).

2- అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరవ్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇందిక వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం.

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ

( అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చ యంగా నీవు క్షమించే- వాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).

3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్తు వమా అఖ్ఖర్తు వమా అస్ రర్తు వమా అఅలన్తు వమా అస్ రఫ్తు వమా అంత అఅలము బిహీ మిన్నీ అంతల్ ముఖద్దిము అంతల్ ముఅఖ్ఖిరు లా ఇలాహ ఇల్లా అంత.

اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).

4- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్ లి అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాత్.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ

( అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండ కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను). (ముస్లిం 2706, బుఖారి 2823).

14- సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “ తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).

15- నమాజ్ తర్వాత జిక్ర్

1-అస్తగ్ ఫిరుల్లాహ్ , అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వమిన్కస్స లాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్.

اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.

(అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నానుఅల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్ప దనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి). (ముస్లిం 592).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅ వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (బుఖారి 844).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునే- వాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు). (ముస్లిం 593).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్స నాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లి సీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్(ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

(అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసాదించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము).

తర్వాత సుబ్ హానల్లాహ్ 33 సార్లుఅల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్కసారి అనాలిఃలాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్“. (ముస్లిం 597).

16- జనాజ నమాజులోని దుఆ

అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు ఆఫిహీ వఅఫు అన్ హు అక్రిమ్ నుజులహూ వస్సిఅముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ అహ్లన్ ఖైరమ్మిన్ అహ్లిహీ జౌజన్ ఖైరమ్మిన్ జౌజిహీ అద్ ఖిల్ హుల్ జన్నత అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి అజాబిన్నార్(ముస్లిం 963).

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مُدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنْ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنْ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ أَوْ مِنْ عَذَابِ النَّارِ

(అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారాన్నీ, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు).

17- విత్ర్ నమాజ్ తర్వాత చదవండి

సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్     سُبْحَانَ المَلِكُ القُدُّوس           

(పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు). (నిసాయీ 1729).
ముడూ సార్లు అనాలి. మూడవసారి శబ్దాన్ని కొంచెం పెంచాలి.

18- ఇస్తిఖార నమాజు యొక్క దుఆ

(ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు తషహ్హుద్ చివరిలో లేదా సలాం తింపిన తర్వాత క్రింది దుఆ చేయవలెను. అయితేఅన్న హాజల్ అమ్రఅన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి).

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక అస్తఖ్దిరుక బి ఖుద్రతిక అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు తఅలము వలా అఅలము అంత అల్లాముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ మఆషీ ఆఖిబతి అమ్రీ ఖాల ఆజిలి అమ్రీ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ మఆషీ ఆఖిబతి అమ్రీ ఖాల ఫీ ఆజిలి అమ్రీ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ.

اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي به

(అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం పని ధార్మి కంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి) (బుఖారి 1166).

రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ 

విషయ సూచిక 

  1. నిద్ర నుండి మేల్కొని
  2. కాలకృత్వాలు తీర్యుకునే ముందు, తర్వాత
  3. వుజూకు ముందు, తర్వాత
  4. దుస్తులు ధరిస్తూ, తీస్తూ
  5. ఇంటి నుండి వెళ్తూఇంట్లో ప్రవేశిస్తూ
  6. మస్జిద్ వైపునకు వెళ్తూ / మస్జిద్లో ప్రవేశిస్తూ
  7. అజాన్‌ సమాధానం, దుఆలు
  8. తక్బీరే  తహ్రీమ తర్వాత దుఆలు
  9. రుకూలో/ రుకూ నుండి నిలబడి
  10. సజ్దాలో
  11. రెండు సజ్దాల మధ్య
  12. సజ్దాయె తిలావత్‌ లో
  13. తషహ్హుద్‌ లో
  14. సలాంకు ముందు
  15. సలాం తర్వాత
  16. ఇస్తిఖారా నమాజులో
  17. ఉదయసాయంకాలపు జిక్ర్‌, వాటి లాభాలు
  18. పడుకునే ముందు
  19. రాత్రి వేళ ప్రక్క మారుస్తూ
  20. నిద్రలో భయాందోళన…, చెడు కల  చూస్తే….?
  21. విత్ర్ నమాజులో/ విత్ర్ నమాజ్‌ తర్వాత
  22. జనాజా నమాజులో

23. నిద్ర నుండి మేల్కొని

24.  [1] అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅ మా అమాతనా ఇలైహిన్ నుషూర్(బుఖారి 6312).

الْـحَمْدُ لِلهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ

(
అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి బ్రతికించాడు. మళ్ళీ ఆయన వైపునకే మరలిపోవలసి ఉన్నది).

25.  [2] అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ ఫీ జసదీ వరద్ద అలయ్య రూహీ అజినలీ బిజిక్రిహీ. (తిర్మిజి 3401).

الْـحَمْدُ لِله الَّذِي عَافَانِي فِي جَسَدِي وَرَدَّ عَلَيَّ رُوحِي وَأَذِنَ لِي بِذِكْرِهِ

(
అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, ఆయనే నా శరీరం లో క్షేమాన్ని ప్రసాదించాడు. నా ఆత్మను తిరిగి పంపాడు, అయన్ను స్మరించే అనుమతి (భాగ్యం) ప్రసాదించాడు).

26. రాత్రి వేళ నిద్ర మధ్యలో మేల్కుంటే చదవాలి

27. 
1- లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్ హందులిల్లాహి సుబ్ హానల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్.

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ الْحَمْدُ لِلهِ وَسُبْحَانَ الله وَلَا إِلَهَ إِلَّا اللهُ وَاللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ

28.  దుఆ చదివిన వెంటనేఅల్లాహ్ నన్ను క్షమించుఅని లేదా మరేదైనా దుఆ చేస్తే స్వీకరించ బడుతుంది. ఒకవేళ వుజూ చేసుకొని నమాజు చేస్తే అదీ అంగీకరింపబడుతుంది. (బుఖారి 1154)

29.  2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి మేల్కొన్నప్పుడు సూర ఆలె ఇమ్రాన్ యొక్క చివరి పది ఆయతులు (3: 190-200) పారాయణం చేసేవారు. (ముస్లిం 763, బుఖారి 183).

30. కాలకృత్యాలు తీర్చుకునే ముందు

31.  బిస్మిల్లాహిఅల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్(తిర్మిజి 606. బుఖారి 142.).

بِسمِ اللهِ اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الخُبُثِ وَالخَبَائِثِ

(
అల్లాహ్ పేరు తో, అల్లాహ్! నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).

32. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత

33.  గుఫ్రానక
غُفْرَانَكَ
(
నీ క్షమాపణ కోరుతున్నాను). (తిర్మిజి 7).

34. వుజూకు ముందు అనండి

35.  బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో). (అబూదావూద్ 101).

36. వుజూ తర్వాత

37.  [1] అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. (ముస్లిం 234).

أَشْهَدُ أَن لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ

(
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు వెరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ భాగస్వాములు లేరని సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని కూడా సాక్ష్యమిచ్చుచున్నాను).

38.  పై దుఆ చదివినవారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అతను ఎందులో నుండైనా ప్రవేశించవచ్చు. మరో హదీసులో పదాలు అదనంగా ఉన్నాయిః

39.  అల్లాహుమ్మజ్అల్ నీ మినత్తవ్వాబీన వజ్ అల్ నీ మినల్ ముతతహ్హిరీన్. (తిర్మిజి 55).

اللَّهُمَّ اجْعَلْنِي مِنْ التَّوَّابِينَ وَاجْعَلْنِي مِنْ الْمُتَطَهِّرِينَ

(
అల్లాహ్! నన్ను నీ వైపు మరలేవానిగా మరియు పరిశుభ్రంగా ఉండేవానిగా చేయుము)

40.  [2] సుబ్ హానకల్లాహుమ్మ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక అతూబు ఇలైక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَسْتَغْفِرُكَ وَ أَتُوبُ إِلَيكَ

(
అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే సర్వస్తోత్రములు, నీవు తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. నీ వైపునకే మరలుచున్నాను మరియు నా పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటున్నాను).

41.  వుజూ తర్వాత పై దుఆ చదివినవారి పేరు తోలు పత్రంపై వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు. (నిసాయీ ఫిల్ కుబ్రా 9909. 6/25. సహీహుత్తర్గీబ్ 225. సహీహుల్ జామిఅ’ 6170.).

42. దుస్తులు ధరిస్తూ

43.  అల్ హందులిల్లాహిల్లజీ కసానీ హాజస్సౌబ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్.

الْـحَمْدُ لِلهِ الَّذِي كَسَانِي هَذَا الثَّوْبَ وَرَزَقَنِيهِ مِنْ غَيْرِ حَوْلٍ مِنِّي وَلَا قُوَّةٍ

(
అల్లాహ్ కే సర్వస్తోత్రములు, ఆయనే వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు, ప్రసాదించాడు, అందులో నా స్వయం శక్తి, సామర్థ్యం మాత్రం లేదు). (అబూదావూద్ 4033).

44.  పై దుఆ చదివిన వారి పూర్వపు మరియు వెనకటి పాపాలన్నీ క్షమించబడతాయి.

45. కొత్త దుస్తులు ధరిస్తూ

46.  అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహీ ఖైర మా సునిఅ లహూ అఊజుబిక మిన్ షర్రిహీ వషర్రి మాసునిఅ లహ్. (అబూదావూద్ 4020).

اللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ كَسَوْتَنِيهِ أَسْأَلُكَ مِنْ خَيْرِهِ وَخَيْرِ مَا صُنِعَ لَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صُنِعَ لَهُ

(
అల్లాహ్! సర్వ స్తోత్రములు నీకే, నీవే నాకు దుస్తులు తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).

47. కొత్త వస్త్రాలు తొడిగిన వ్యక్తిని చూసి

48.  తుబ్లీ యుఖ్లిఫుల్లాహు తఆలా

تُبْلِى وَيُخْلِفُ اللهُ تَعَالَى

(
నీవు దీనిని పాతబడే వరకు తొడుగు, అల్లాహ్ దానికి బదులుగా మరొకటి ప్రసాదిస్తాడు). (అబూదావూద్ 4020).

49.  వస్త్రాలు తీయునప్పుడు బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో) అనాలి. (సహీహుల్ జామి 3610).

50. ఇంటి నుండి బైటికి వెళ్తూ

51.  1- బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్(అబూదావూద్ 5095).

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله

(
అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, అల్లాహ్ పై మాత్రమే నా నమ్మకం. పుణ్యం చేసే మరియు పాపం నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు).

52.  పై దుఆ చదివిన వారికి సన్మార్గం ప్రాప్తిస్తుంది, కీడు, బాధలతో రక్షణ లభిస్తుంది మరియు షైతాన్ అతని నుండి దూరముంటాడు.

53.  2- అల్లాహుమ్మ అఊజుబిక అన్ అజ్దిల్ల ఉజ్దల్ల అజిల్ల ఉజల్ల అజ్లిమ ఉజ్లమ అజ్ హల యుజ్ హల అలయ్య.

اللَّهُمَّ أَعُوذُ بِكَ أَنْ أَضِلَّ أَوْ أُضَلَّ أَوْ أَزِلَّ أَوْ أُزَلَّ أَوْ أَظْلِمَ أَوْ أُظْلَمَ أَوْ أَجْهَلَ أَوْ يُجْهَلَ عَلَيَّ

(
నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను అల్లాహ్!).

54.  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తమ దృష్టి ఆకాశం వైపు సారించి పై దుఆ పఠించేవారు. (అబూ దావూద్ 5094).

55. ఇంట్లో ప్రేవేశిస్తూ

56.  అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా. (అబూదావూద్ 5096).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا

(
అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము).

57.  మనిషి ఇంట్లో ప్రవేశిస్తూ, భోజనం చేస్తూ అల్లాహ్ ను స్మరిస్తే, షైతాన్ తన తోటివాళ్ళతో ఇంట్లో మీకు నివాస స్థలం లేదు, భోజనం లేదు అని అంటాడు. (ముస్లిం 2018).

58. మస్జిదు వైపునకు వెళ్తూ

59.  అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, మవిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

(
అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

60.  ఇందులో వెలుగు అంటే ధర్మం, సత్యం స్పష్టపరచడం అని భావం.

61. మస్జిదులో ప్రవేశించినప్పుడు

62.  [1] అఊజు బిల్లాహిల్ అజీం బివజ్ హిహిల్ కరీం సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.

أَعُوذُ بِاللهِ الْعَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيمِ وَسُلْطَانِهِ الْقَدِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

(
ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణు కోరుతున్నాను).

63.  పై దుఆ మస్జిదులోనికి వెళ్తూ చదివేవారు, రోజం- తా షైతాన్ నుండి రక్షింపబడతారు. (అబూ దావూద్ 466).

64.  [2] బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

بِسْمِ الله وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله

(
అల్లాహ్ నామముతో. ప్రవక్తపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణలు కురుయుగాక). (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314).

65.  [3] అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ముస్లిం 713).

اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(
అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు).

66.  [4] అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబీ వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక. (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314)

اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(
అల్లాహ్! నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు).

67. మస్జిద్ నుండి బయటికి వెళ్తూ

68.  [1] బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్(ఇబ్నుస్సినీ, అబూదావూద్).

بِسْمِ الله وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله

69.  [2] అల్లాహుమ్మ సిమ్ నీ మినష్షైతానిర్రజీం. (ఇబ్ను మాజ 773).

اللَّهُمَّ اعْصِمْنِي مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ

(
అల్లాహ్! నన్ను ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి కాపాడుము).

70.  [3] అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

(
అల్లాహ్ నీతో నీ దయను కోరుతున్నాను). (ముస్లిం 713).

71.  [4] అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబీ వఫ్ తహ్ లీ అబ్వాబ ఫజ్లిక. (ఇబ్నుమాజ 771, తిర్మిజి 314)

اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ فَضْلِكَ

(
అల్లాహ్! నా పాపాలు క్షమించు మరియు నా కొరకు నీ కృప, దయ ద్వారాలను తెరుచు).

72. అజాన్ సమాధానం, దాని పిదప దుఆ

73.  మనస్ఫూర్తిగా అజాన్ యొక్క జవాబిచ్చిన వారికి స్వర్గం లభించును. కాని హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్విన్నప్పుడులా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (పుణ్యం చేసే మరియు పాపల నుండి దూరం ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు) అనాలి. దాని తర్వాత దరూదె ఇబ్రాహీం చదివిన వారిపై అల్లాహ్ యొక్క పది కరుణలు కురుస్తాయి. తర్వాత క్రింది దుఆ చదివిన వారికి ప్రళయదినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు లభిస్తుంది. (ముస్లిం 385, 384.).

74. 
1- అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅవతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(
పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసినమఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి).

75.  పై దుఆలో పరిపూర్ణ ఆహ్వానం అంటే అజాన్ అని, ‘వసీలఅంటే స్వర్గంలో ఉన్నత స్థానం అని, అల్లాహ్ దాసుల్లో కేవలం ఒక్కడే దానికి అర్హుడు అని అర్థం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః ఒక్కణ్ణి నేనే అవుతానని ఆశిస్తున్నాను.

76.  2- అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.

وَأَنَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ رَضِيتُ بِالله رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا وَبِالْإِسْلَامِ دِينًا

(
అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు వేరొకడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవరూ సాటి లేరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).

77.  పై దుఆ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి.

78. తక్బీరె తహ్రీమ తర్వాత క్రింది దుఆల్లో ఏదైనా ఒకటి చదవండి

79.  1- అల్లాహుమ్మ బాఇద్ బైనీ బైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనసి అల్లాహుమ్మగ్ సిల్ ఖతాయాయ బిల్ మాఇ వస్సల్ జి వల్ బర్ద్. (బుఖారి 744, ముస్లిం 598).

اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ اللَّهُمَّ نَقِّنِي مِنْ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنْ الدَّنَسِ اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ

అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్ను పాపాలకు అంతే దూరంగా ఉంచు. అల్లాహ్ మాసిన బట్ట తెల్లనిబట్టలా ఎలా శుభ్ర మవుతుందో నా పాపాలను అలా శుద్ధి చెయ్యి. నా పాపాలను నీరు, మంచు, వడగండ్లతో కడిగివెయ్యి.

80.  2- సుబ్ హానకల్లాహుమ్మ బిహందిక తబార కస్ముక తఆలా జద్దుక లాఇలాహ ఘైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

(
అల్లాహ్ నీవు అన్ని రకాల లోపాలకు అతీతునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామమే శుభము గలది. నీ ఔన్నత్యం, అనుగ్రహం ఉన్నతమైనది. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. (తిర్మిజి 242. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

81.  3- అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్.

الْحَمْدُ لِله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(
ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు అల్లాహ్ కొరకే).

82.  పై పదాలు వ్రాయడానికి 12 దైవదూతలు పరస్పరం పోటిపడ్డారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (ముస్లిం 600).

83.  4- అల్లాహు అక్బరు కబీరా వల్ హందు లిల్హాహి కసీరా సుబ్ హానల్లాహి బుక్రతవ్ అసీలా.

اللهُ أَكْبَرُ كَبِيرًا وَالْحَمْدُ لِله كَثِيرًا وَسُبْحَانَ الله بُكْرَةً وَأَصِيلًا

(
అల్లాహ్ చాలా గొప్పవాడు, ఎనలేని స్తోత్రములు అల్లాహ్ కొరకే, ఉదయం, సాయంత్రం ఆయనకే పవిత్రతలు).

84.  పై పదాల వల్ల నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకనగ వాటి వల్ల ఆకాశ ద్వారాలు తెరువబడ్డాయి అని ప్రవక్త చెప్పారు. ఇబ్ను ఉమర్ ప్రవక్తగారి మాట విన్నప్పటి నుండి ఎన్నడూ వీటిని చదవడం మానుకోలేదు. (ముస్లిం 601). మరో ఉల్లేఖనంలో ఉందిః పై దుఆ మూడు సార్లు చదివి, తర్వాత ఇది చదవాలి అనిః అఊజు బిల్లాహి మినష్షైతాని మిన్ నఫ్ ఖిహీ నఫ్ సిహీ హంజిహీ. أَعُوذُ بِالله مِنَ الشَّيْطَانِ مِنْ نَفْخِهِ وَنَفْثِهِ وَهَمْزِهِ (అబూ దావూద్/ మా యుస్తఫ్తహు బిహిస్సలాతు… 764).

85.  5- అల్లాహుమ్మ రబ్బ జిబ్రాఈల మీకాఈల ఇస్రాఫీల ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి అంత తహ్ కుము బైన ఇబాదిక ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్ ఇహ్ దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇజ్నిక ఇన్నక తహ్ దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీం. (ముస్లిం 770).

اللَّهُمَّ رَبَّ جَبْرَائِيلَ وَمِيكَائِيلَ وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَاوَاتِ وَالْأَرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنْ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ

(
జిబ్రాఈల్, మీకాఈల్ మరియు ఇస్రాఫీల్ యొక్క ప్రభువైన అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్త, గోచర అగోచరాల జ్ఞాని, నీవే నీ దాసుల మధ్య ఉన్న విభే దాలను గురించి తీర్పు చేయువానివి. సత్య విష- యంలో విభేదం ఉందో అందులో నీ దయతో నాకు సన్మార్గం చూపుము, నిశ్చయంగా నీవు కోరినవారికి సన్మార్గం చూపుతావు.

6- వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ హనీఫవ్ వమా అన మినల్ ముష్రికీన్ ఇన్న సలాతీ నుసుకీ మహ్ యాయ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహూ బిజాలిక ఉమిర్తు అన అవ్వలుల్ ముస్లిమీన్ అల్లాహుమ్మ అంతల్ మలికు లాఇలాహ ఇల్లా అంత, అంత రబ్బీ అన అబ్దుక జలంతు నఫ్సీ వఅతరఫ్ తు బిజంబీ ఫగ్పిర్ లీ జునూబీ జమీఅన్ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత, వహ్ దినీ లిఅహ్ సనిల్ అఖ్లాఖి లా యహ్ దీ లిఅహ్ సనిహా ఇల్లా అంత, వస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్ రిఫ్ అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత, లబ్బైక సఅదైక వల్ ఖైరు కుల్లుహూ ఫీ యదైక వష్షర్రు లైస ఇలైక, అన బిక ఇలైక, తబారక్త తఆలైత, అస్తగ్ఫి- రుక అతూబు ఇలైక. (ముస్లిం 771).

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ المُشْرِكِينَ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنْ المُسْلِمِينَ اللَّهُمَّ أَنْتَ المَلِكُ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْتَ رَبِّي وَأَنَا عَبْدُكَ ظَلَمْتُ نَفْسِي وَاعْتَرَفْتُ بِذَنْبِي فَاغْفِرْ لِي ذُنُوبِي جَمِيعًا إِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ وَاهْدِنِي لِأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ وَاصْرِفْ عَنِّي سَيِّئَهَا لَا يَصْرِفُ عَنِّي سَيِّئَهَا إِلَّا أَنْتَ لَبَّيْكَ وَسَعْدَيْكَ وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ أَنَا بِكَ وَإِلَيْكَ تَبَارَكْتَ وَتَعَالَيْتَ أَسْتَغْفِرُكَ وَأَتُوبُ إِلَيْكَ

(
నేను నా ముఖాన్ని ఏకాగ్రచిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన ప్రభువు వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహు- దైవారాధకులలోనివాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు భాగస్వామీ లేడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాణ్ణి. అల్లాహ్! నీవే యజమానివి. నీవే ఆరాధ్యుడవు. నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నీవే నా ప్రభువువి. నేను నీ దాసుణ్ణి. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. కనుక నా పాపాలన్నింటినీ మన్నించు. నీవు తప్ప పాపాలను మన్నించగల వాడెవడూ లేడు. నన్ను సత్పవర్తన వైపునకు నడిపించు, సత్పవర్తన వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నా దుర్గుణాలను నా నుండి దూరం చెయ్యి. నన్ను దుర్గుణాల నుండి దూరం చేయువాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నీ సమక్షంలో హాజరవుతున్నాను. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. సర్వ మేళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయి. నీ తరఫు నుండి ఎన్నటికీ కీడు ఉండదు. నేను నీ వల్లనే ఉన్నాను. నీ వైపే మరలుతాను. నీవు శుభప్రదమైన వాడివి, ఉన్నతునివి. పాపాల మన్నింపుకై నిన్నే వేడుకుంటు- న్నాను. పశ్చాత్తాప భావంతో నీ వైపునకే మరలుతున్నాను.

86.  7-అల్లాహుమ్మ లకల్ హందు అంత ఖయ్యిము స్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు లక ముల్కుస్సమావాతి వల్ అర్జి వమ న్ ఫీహిన్న వలకల్ హందు అంత నూరుస్సమావాతి వల్ అర్జి వమన్ ఫీహిన్న వలకల్ హందు అంత మలికుస్సమా- వాతి వల్ అర్జి వలకల్ హందు అంతల్ హఖ్కు వఅదుకల్ హఖ్ఖు వలిఖాఉక హఖ్ఖున్ వకౌలుక హఖ్ఖున్ వల్ జన్నతు హఖ్ఖున్ వన్నారు హఖ్ఖున్ వన్నబియ్యూన హఖ్ఖున్ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం హఖ్ఖున్ వస్సాఅతు హఖ్ఖ్. అల్లాహుమ్మ లక అస్లమ్తు బిక ఆమంతు అలైక తవక్కల్తు ఇలైక అనబ్తు బిక ఖాసంతు ఇలైక హాకమ్తు ఫగ్ఫిర్లీ మా ఖద్దమ్తు మా అఖ్ఖర్తు మా అస్రర్తు మా అఅలంతు అంతల్ ముఖద్దిము అంతల్ ముఅ- ఖ్ఖిరు లాఇలాహ ఇల్లా అంత. (బుఖారి 1120).

87.  اللَّهُمَّ لَكَ الْحَمْدُ أَنْتَ قَيِّمُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ لَكَ مُلْكُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ أَنْتَ نُورُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَمَنْ فِيهِنَّ وَلَكَ الْحَمْدُ أَنْتَ مَلِكُ السَّمَوَاتِ وَالْأَرْضِ وَلَكَ الْحَمْدُ أَنْتَ الْحَقُّ وَوَعْدُكَ الْحَقُّ وَلِقَاؤُكَ حَقٌّ وَقَوْلُكَ حَقٌّ وَالْجَنَّةُ حَقٌّ وَالنَّارُ حَقٌّ وَالنَّبِيُّونَ حَقٌّ وَمُحَمَّدٌ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَقٌّ وَالسَّاعَةُ حَقٌّ اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ وَإِلَيْكَ حَاكَمْتُ فَاغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

88.  తర్వాత చదవండిః

89.  అఊజు బిల్లాహిస్సమీఇల్ అలీమ్, మినష్షైతానిర్రజీం, మిన్ హంజిహీ, నఫ్ ఖిహీ నఫ్సిహీ

أَعُوذُ بِالله السَّمِيعِ الْعَلِيمِ مِنْ الشَّيْطَانِ الرَّجِيمِ مِنْ هَمْزِهِ وَنَفْخِهِ وَنَفْثِهِ

(
వినేవాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణులో వస్తున్నాను, ధూత్కరింపబడిన షైతాన్ మరియు వాని ప్రేరేపణలు, గర్వం, మరియు చేతబడి నుండి). (అబూదావూద్ 775).

90.  తర్వాత చదవండిః

91.  బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తఈన్, ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ అలైహిమ్, గైరిల్ మగ్ జ్దూబి అలైహిమ్ వలజ్దాల్లీన్. (ఆమీన్).

[
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ، الحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ، الرَّحْمَنِ الرَّحِيمِ، مَالِكِ يَوْمِ الدِّينِ، إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ ، اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ،]. {آمين}

92.  తర్వాత చదవండిః

93.  ఖుర్ఆనులోని ఏదైనా ఒక సూర, లేదా కొన్ని ఆయతులు. తర్వాత రుకూ చేయండి.

94. రుకూలో

95.  1- సుబ్ హాన రబ్బియల్ అజీం (ముస్లిం 773).

سُبْحَانَ رَبِّيَ الْعَظِيم (ఘనుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా బిహందిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(
మా ప్రభువైన అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్(ముస్లిం 487).

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ

(
దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظمَةِ

(
సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).
(
అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).

6- అల్లాహుమ్మ లక రకఅతు బిక ఆమంతు లక అస్లమ్ తు ఖషఅ లక సమ్ఈ బసరీ ముఖ్ఖీ అజమీ అసబీ(ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ رَكَعْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ خَشَعَ لَكَ سَمْعِي وَبَصَرِيْ وَمُخِّي وَعَظَمِي وَعَصَبِي

(
అల్లాహ్ నీ కొరకు రుకూ చేశాను. నిన్ను విశ్వసించాను. నీకే శిరసవహించాను. నా చెవులు, కళ్ళు, మెదడు, ఎముక మరియు నరాలు నీ కొరకే నమ్రత చూపుతున్నాయి).

96. రుకూ నుండి నిలబడి

97. 
1- రబ్బనా లకల్ హంద్. (బుఖారి 722).
رَبَّنَا لَكَ الحَمْد (సర్వ స్తోత్రములు నీకే ప్రభువా).

లేదా రబ్బనా వలకల్ హంద్(బుఖారి 689, ముస్లిం 392).
رَبَّنَا وَلَكَ الحَمْد

లేదా అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్.
اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْد (బుఖారి 796, ముస్లిం 404).

లేదా అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హంద్. (బుఖారి 795).
اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الحَمْد

నోట్: కొందరురబ్బనా లకల్ హందు వష్షుక్ర్అని అంటారు. అయితే దీని ప్రస్తావన హదీసులో రాలేదు, గనక దానిని వదులు కొనుటయే మేలు.

2- అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు మిల్ అస్సమావాతి మిల్అల్ అర్జి మిల్అ మా బైనహుమా మిల్అ మా షిఅ మిన్ షైఇమ్ బఅదు(ముస్లిం 476).

اللَّهُمَّ رَبَّنَا لَكَ الحَمْدُ مِلْءَ السَّمَاوَاتِ وَمِلْءَ الْأَرْضِ وَمِلْءَ مَا بَيْنَهُمَا وَمِلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

(
మా ప్రభువైన అల్లాహ్! ఆకాశాలు నిండిపోయేంత, భూమి నిండిపోయేంత, భూమ్యాకాశాల మధ్య నిండిపోయేంత మరియు తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే).

3- రబ్బనా లకల్ హందు మిల్ఉస్సమావాతి వల్ అర్జి మిల్ఉ మా షిఅ మిన్ షైఇమ్ బఅదు అహ్ లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు కుల్లునా లక అబ్దున్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత లా ముఅతియ లిమా మనఅ వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు. (ముస్లిం 477).

رَبَّنَا لَكَ الْحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ أَحَقُّ مَا قَالَ الْعَبْدُ وَكُلُّنَا لَكَ عَبْدٌ اللَّهُمَّ لَا مَانِعَ لِـمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(
భూమ్యాకాశాలు నిండిపోయేంత, తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోయేంత ప్రశంసలు నీ కొరకే మా ప్రభువా! ఘనతకు, పొగడ్తలకు అధిపతి, దాసుడు పొగిడే దానికి నీవు అర్హుడవు. మేమందరం నీకే దాసులం. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

4- రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (బుఖారి 799).

رَبَّنَا وَلَكَ الْحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ

(
మా ప్రభువా! ఎనలేని ఉత్తమమైన, శుభప్రదమైన స్తోత్రములు నీకే).

98. సజ్దాలో

99.  1-సుబ్ హాన రబ్బియల్ అఅలా. (ముస్లిం 772).
سُبْحَانَ رَبِّيَ الأعلَى
(
ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).
ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ(బుఖారి 794, ముస్లిం 484).
سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي
(
మా ప్రభువైన అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్. (ముస్లిం 487).
سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ
(
దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్.
(
అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).
سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ
(
సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ జిల్లహు అవ్వలహూ ఆఖిరహూ అలానియతహూ సిర్రహూ. (ముస్లిం 483).

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ
(
అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు).

6- అల్లాహుమ్మ లక సజత్తు బిక ఆమంతు లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు సవ్వరహు షక్క సమ్అహు బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ
(
అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ
(
అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).

100.                   సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం హదీసు ఆధారంగాఃదాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి. (ముస్లిం 482).

101.                         రెండు సజ్దాల మధ్యలో

102.                   1- రబ్బిగ్ ఫిర్లీ, రబ్బిగ్ ఫిర్లీ. (అబూదావూద్ 874).

رَبِّ اغْفِرْ لِي ، رَبِّ اغْفِرْ لِي
(
ప్రభువా నా పాపాలను మన్నించు (2).

2- అల్లాహుమ్ మగ్ఫిర్లీ వర్ హమ్నీ ఆఫినీ వహ్ దినీ వర్ జుఖ్నీ. (అబూదావూద్ 850).

اللَّهُمَّ اغْفِرْلِي وَارْحَمْنِي وَعَافِنِي وَاهْدِنِي وَارْزُقْنِي
(
అల్లాహ్ నన్ను క్షమించు, కరుణించు, నాకు స్వస్తత, సన్మార్గం మరియు ఆహారం ప్రసాదించు).

103.                         సజ్దయే తిలావత్ చేయునప్పుడు

104.                   ఖుర్ఆనులో 15 సజ్దా ఆయతులున్నాయి, ఖుర్ఆన్ పారాయణ సందర్భంగా వాటిలో ఒక్క ఆయతు వచ్చినా అచ్చట ఆగి సజ్దా చేయాలి. అప్పుడు క్రింది దుఆ చదవాలి.

1-సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ షక్క సమ్అహూ బసరహూ బిహౌలిహీ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).

سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ بِحَوْلِهِ وَقُوَّتِهِ {فَتبَارَك اللهُ أَحسَنَ الخَالِقِين}
(
నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

2- అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, జఅఅన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్. (తిర్మిజి 579, 3424).

اللَّهُمَّ اكْتُبْ لِي بِهَا عِنْدَكَ أَجْرًا وَضَعْ عَنِّي بِهَا وِزْرًا وَاجْعَلْهَا لِي عِنْدَكَ ذُخْرًا وَتَقَبَّلْهَا مِنِّي كَمَا تَقَبَّلْتَهَا مِنْ عَبْدِكَ دَاوُدَ
(
సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).

105.                         తషహ్హుద్ లో

106.                   అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా- హిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

(
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను).

107.                         ప్రవక్తపై దరూద్

108.                   అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (బుఖారి 3370).

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

(
అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాంను, వారి కుటుంబీ- కులను కరుణించినట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. అల్లాహ్ నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మ ద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి.).

109.                         సలాంకు ముందు

110.                   1- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజా బిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్. (ముస్లిం 589, బుఖారి 833).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْمَأْثَمِ وَالْمَغْرَمِ
(
అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులోకి వస్తున్నాను, మసీహుద్దజ్జాల్ ఉపద్రవము నుండి నీ శరణులోకి వస్తున్నా- ను, జీవన్మరణాల విపత్తు నుండి నీ శరణులోకి వస్తున్నాను, పాపం మరియు అప్పు నుండి నీ శరణులోకి వస్తున్నాను).

2- అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరవ్ వలా యగ్ఫి రుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇందిక వర్ హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం.

اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ وَارْحَمْنِي إِنَّك أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
(
అల్లాహ్ నా ఆత్మకు నేను చాలా అన్యాయం చేసు కున్నాను. నీవు తప్ప పాపాలను క్షమించేవారు మరెవ్వరూ లేరు. నీవు నీ ప్రత్యేక అనుగ్రహంతో నన్ను క్షమించు, నా మీద దయచూపు, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు). (బుఖారి 834).

3- అల్లాహుమ్ మగ్ఫిర్లీ మా ఖద్దమ్ తు వమా అఖ్ఖర్ తు వమా అస్ రర్ తు వమా అఅలంతు వమా అస్ రఫ్ తు వమా అంత అఅలము బిహీ మిన్నీ అంతల్ ముఖద్ది- ము అంతల్ ముఅ ఖ్ఖిరు లాఇలాహ ఇల్లా అంత.

اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ وَمَا أَسْرَفْتُ وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي أَنْتَ الْمُقَدِّمُ وَأَنْتَ الْمُؤَخِّرُ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(
అల్లాహ్! నా పూర్వ పాపాలను, జరగబోయే పాపాలను, రహస్యంగా చేసిన పాపాలను, బహిరంగంగా చేసిన పాపాలను మరియు నా మితిమీరినతనాన్ని కూడా క్షమించు. మరికొన్ని పాపాలు ఉండవచ్చు, వాటి గురించి నా కంటే ఎక్కువ నీకే బాగా తెలుసు, వాటిని కూడా నీవు క్షమించు. ముందుకు నడిపించేవాడివి, వెనక్కి నెట్టేవాడివి నీవే. నీవు తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు).

4- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ అజ్ జి వల్ కసలి వల్ జుబ్ని వల్ హరమి వల్ బుఖ్ లి అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాత్. (ముస్లిం 2706, బుఖారి 2823).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْعَجْزِ وَالْكَسَلِ وَالْجُبْنِ وَالْهَرَمِ وَالْبُخْلِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ
(
అల్లాహ్ (మంచి పనులు) చేయలేకపోవటం నుంచి, శక్తి ఉండి కూడా సోమరితనానికి లోనవటం నుంచి, పిరికితనం నుంచి, నికృష్టమైన వృద్ధాప్యం నుంచి నీ శరణు కోరుతున్నాను. ఇంకా సమాధి శిక్ష నుండి మరియు జీవన్మరణాల ఉపద్రవం నుంచి నీ శరణు కోరుతున్నాను).

111.                   5-అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక యా అల్లాహుల్ వాహిదుల్ అహదుస్ సమదుల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్. అన్ తగ్ఫిరలీ జునూబీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీం(అబూదవూద్ 985).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ يَا أَللهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ أَنْ تَغْفِرَ لِي ذُنُوبِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ
(
అద్వితీయునివి, నిరపేక్షాపరునివి, సంతానము, తల్లి దండ్రులు లేని మరియు ఒక్కరికి సరిసమానము కాని అల్లాహ్! నీవు నా పాపాల ప్రక్షాలనం చేయా లని కోరుతున్నాను. నిశ్చయంగా నీవు క్షమించే, కరుణించేవానివి).

112.                   ఒక వ్యక్తి తషహ్హుద్ లో దుఆ చదువుతున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని ఇతడు క్షమించబడ్డాడు అని శుభవార్త ఇచ్చారు.

6- అల్లాహుమ్మ బిఇల్మికల్ గైబ ఖుద్రతిక అలల్ ఖల్ఖ్, అహ్ యినీ మా అలిమ్ తల్ హయాత ఖైరల్లీ తవఫ్ఫనీ ఇజా అలిమ్ తల్ వఫాత ఖైరల్లీ, అస్అలుక ఖష్ యతక ఫిల్ గైబి వష్షహాద, కలిమతల్ ఇఖ్లాసి ఫిర్రిజా వల్ ఘజబ్, అస్అలుక నఈమల్ లా యన్ ఫద్, ఖుర్రత ఐనిల్ లా తన్ ఖతిఅ’, వఅస్అలుకర్ రిజా బిల్ ఖజా, బర్దల్ ఐషి బాదల్ మౌత్, లజ్జతన్ నజరి ఇలా వజ్ హిక ష్షౌఖ ఇలా లిఖాఇక్, అఊజు బిక మిన్ జర్రాఅ ముజిర్రతిన్ ఫిత్నతిమ్ ముజిల్లహ్, అల్లాహుమ్మ జయ్యిన్నా బిజీనతిల్ ఈమాన్, వజ్అల్నా హుదాతమ్ ముహ్తదీన్.

اللَّهُمَّ بِعِلْمِكَ الْغَيْبَ وَقُدْرَتِكَ عَلَى الْخَلْقِ أَحْيِنِي مَا عَلِمْتَ الْحَيَاةَ خَيْرًا لِي وَتَوَفَّنِي إِذَا عَلِمْتَ الْوَفَاةَ خَيْرًا لِي اللَّهُمَّ وَأَسْأَلُكَ خَشْيَتَكَ فِي الْغَيْبِ وَالشَّهَادَةِ وَأَسْأَلُكَ كَلِمَةَ الْحَقِّ فِي الرِّضَا وَالْغَضَبِ وَأَسْأَلُكَ الْقَصْدَ فِي الْفَقْرِ وَالْغِنَى وَأَسْأَلُكَ نَعِيمًا لَا يَنْفَدُ وَأَسْأَلُكَ قُرَّةَ عَيْنٍ لَا تَنْقَطِعُ وَأَسْأَلُكَ الرِّضَاءَ بَعْدَ الْقَضَاءِ وَأَسْأَلُكَ بَرْدَ الْعَيْشِ بَعْدَ الْمَوْتِ وَأَسْأَلُكَ لَذَّةَ النَّظَرِ إِلَى وَجْهِكَ وَالشَّوْقَ إِلَى لِقَائِكَ فِي غَيْرِ ضَرَّاءَ مُضِرَّةٍ وَلَا فِتْنَةٍ مُضِلَّةٍ اللَّهُمَّ زَيِّنَّا بِزِينَةِ الْإِيمَانِ وَاجْعَلْنَا هُدَاةً مُهْتَدِينَ

(
అల్లాహ్! నీవు అగోచర జ్ఞానంగలవానివి, నీ సృష్టిపై సంపూర్ణ అధికారంగలవానివి కనుక, జీవితం నా కొరకు ఎంత వరకు మేలు అని నీకు తెలియునో అంత వరకు నన్ను సజీవంగా ఉంచు, మరెప్పుడైతే మరణం నా కొరకు మేలు అని నీకు తెలియునో అప్పుడే నాకు మరణం ప్రసాదించు, గోచర (బాహ్యం) మరియు అగోచర (అంతర్యం) సర్వ స్థితుల్లో నీ భయం ఉండాలని కోరుతున్నాను, కోపం, ప్రశాంతం అన్ని వేళల్లో సత్యంపలికాలని వేడుకుంటున్నాను, కలిమిలోనైనా, లేమిలోనైనా (హెచ్చుతగ్గులకు గురి కాకుండా) మధ్యేమార్గంలో ఉండాలని కోరుతున్నాను, ఎన్నడూ నశించని అనుగ్రహం నీతో కోరుతున్నాను, ఎన్నాడూ అంతంకాని కంటి చలువ నీతో కోరుతు- న్నాను, నీ నిర్ణయాలపై తృప్తి చెందే భాగ్యం నీతో తలుస్తున్నాను, మరణం తర్వాత చల్లని/సుఖమయ జీవితం నీతో కోరుతున్నాను, నీ ముఖదర్శనభాగ్య ఆనందం మరియు నిన్ను కలుసుకునే కాంక్ష నీతో కోరుతున్నాను, ఇవి ఎలాంటి బాధకరమైన కష్టంతో మరియు మార్గభ్రష్టతకు గురి చేయని ఉపద్రవంతో ప్రాప్తించు. అల్లాహ్! మమ్మల్ని విశ్వాస అంకరణతో అలంకరించు, మమ్మల్ని సన్మార్గగామి మరియు మార్గదర్శిగా చేయు.

7- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత అఊజు బిక మినన్నార్(అబూదావూద్ 792, ఇబ్నుమాజ 910).
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْجَنَّةَ وَأَعُوذُ بِكَ مِنَ النَّارِ

113.                   సలాంకు ముందు ఎక్కువ దుఆ చేయాలి

అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో తషహ్హుద్ దుఆ నేర్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః తర్వాత తనకిష్టమైన దుఆ చేసుకోవాలి”. (బుఖారి 835).

114.                         సలాం తర్వాత

115.                   1- అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం మిన్కస్సలాం తబారక్త యాజల్ జలాలి వల్ ఇక్రామ్. (ముస్లిం 592).

اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَسْتَغْفِرُ الله ، اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
(
అల్లాహ్ నీ క్షమాభిక్ష కోరుతున్నానుఅల్లాహ్ నీవే సలాం. శాంతి నీ నుండి లభిస్తుంది. ఔన్నత్యం, గొప్పదనాలు గలవాడా నీవు గొప్ప శుభాలు కలవాడివి).

2- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అల్లా హుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅ వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు(బుఖారి 844, ముస్లిం 593).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ

(
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. అల్లాహ్! నీవు ప్రసాదించే దానిని అడ్డుకునేవాడెవడూ లేడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వలేడు. ఎవరి పెద్దరికం, ఐశ్వర్యం నీ శిక్ష ముందు వారికి లాభం చేకూర్చ లేవు).

3- లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వలా నఅబుదు ఇల్లా ఇయ్యా- హు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్స నాఉల్ హసన్ లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లి సీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్(ముస్లిం 594).

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الْـمُلكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله لَا إِلَهَ إِلَّا اللهُ وَلَا نَعْبُدُ إِلَّا إِيَّاهُ لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ لَا إِلَهَ إِلَّا اللهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

(
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన ఏకైకుడు, సాటిలేనివాడు. విశ్వసామ్రాజ్యం ఆయనదే. స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయన సర్వాధికారుడు. పుణ్యాలు చేసే, పాపాల నుండి దూరముండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు, అల్లాహ్ తప్ప వెరొక ఆరాధ్యుడు లేడు. మేము ఆయన్నే ఆరాధిస్తాము. వరాలు, అనుగ్రహాలు ఆయన ప్రసా దించినవే. మంచి స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. సత్యతిరస్కారులకు ఎంత అయిష్టకరంగా ఉన్నా సరే మేము మా ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకున్నాము.).

116.                   4-సుబ్డహానల్లాహ్ 33 సార్లు, అల్ హం దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు అనాలి. వంద పూర్తి చేయుటకు ఒక్క సారి అనాలిఃలాఇ లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్”. (ముస్లిం 597).

117.                   పై జిక్ర్ వంద లెక్క పూర్తి చేసినవారి పాపాలు సముద్రపు నురగంత ఉన్నా మన్నించబడతాయి. (ముస్లిం 597).

118.                   5-అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక షుక్రిక హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).

اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك
(
అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).

119.                   6-అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ జుబ్ని వఅఊజు బిక మిన్ అన్ అరుద్ద ఇలా అర్జలిల్ ఉమురి అఊజు బిక మిన్ ఫిత్నతిద్దున్యా అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్(బుఖారి 2822).

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْجُبْنِ وَأَعُوذُ بِكَ أَنْ أُرَدَّ إِلَى أَرْذَلِ الْعُمُرِ وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الدُّنْيَا وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ
(
అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుతున్నాను. నికృష్టమైన వృద్ధాప్యానికి చేరుకోవటం నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రాపంచిక ఉపద్రవాల నుండి నీ శరణు వేడుతున్నాను. సమాధి యాతనల నుండి నీ శరణు వేడుతున్నాను).

120.                   7- (1) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్, వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్. (2) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మిన్ షర్రి మా ఖలఖ్, మిన్ షర్రి గాసిఖిన్ ఇజా వఖబ్, మిన్ షర్రిన్ నఫ్ఫాసాతి ఫిల్ ఉఖద్, వమిన్ షర్రి హాసిదిన్ ఇజా హసద్. (3) బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్”. (అబూదావూద్ 1523).

[
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ هُوَ اللهُ أَحَدٌ ، اللهُ الصَّمَدُ ، لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ، وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ]. [بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ ، مِنْ شَرِّ مَا خَلَقَ ، وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ، وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ ، وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ]. [بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ] [قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ ، مَلِكِ النَّاسِ ، إِلَهِ النَّاسِ ، مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ ، الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ ، مِنَ الجِنَّةِ وَالنَّاسِ]

((1)
ఇలా అనుః ఆయనే అల్లాహ్, ఏకైకుడు, అల్లాహ్ ఎవరి అక్కరా లేనివాడు, ఆయనకు సంతానం లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ కాడు, ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు. (2) ఇలా అనుః నేను ఉదయ కాలపు ప్రభువు శరణులోకి వస్తున్నాను, ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, చిమ్మచీకటి కీడు నుండి ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో, ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి, మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో. (3) ఇలా అనుః నేను మానవుల ప్రభువు, మానవుల సార్వభౌముడు, మానవుల ఆరాధ్య దైవం యొక్క శరణులోకి వస్తున్నాను, కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి, ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో, వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు).

121.                   8-అల్లాహు లాఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం లా తాఖుజుహూ సినతుఁ వలా నౌం, లహూ మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జి మన్ జల్లజీ యష్ ఫఉ ఇందహూ ఇల్లా బిఇజ్నిహీ యఅలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇమ్ మిన్ ఇల్మిహీ ఇల్లా బిమా షాఅ వసిఅ కుర్సియ్యుహు- స్సమావాతి వల్ అర్జ వలా యఊదుహూ హిఫ్జు- హుమా వహువల్ అలీయ్యుల్ అజీం. (సూ. బఖర 255). ( ఆయతునుఆయతుల్ కుర్సీఅని అంటారు).

[
اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ]

(
అల్లాహ్! ఆయన తప్ప మరొక సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన నిత్యుడు, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకురాదు మరియు నిదురరాదు. భూమ్యా- కాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే, ఆయన సమ్ముఖంలో -ఆయన అనుజ్ఞ లేకుండా- సిఫారసు చేయగలవాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు, మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో విషయమునూ వారు గ్రహించజాలరు, ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన అత్యున్నతుడు, సర్వోత్తముడు).

122.                   ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదివిన వారు స్వర్గంలో ప్రవేశించడానికి చావు మాత్రమే అడ్డు ఉంటుంది. (సహీహ 972).

9- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, అమలమ్ ముతఖబ్బల(ఇబ్ను మాజ 925).

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا
(
అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను).

123.                   నమాజు తర్వాతగల దుఆల మరికొన్ని ఘనతలు తెలుసుకొనుటకునమాజు నిధులుఅన్న మా పుస్తకం చదవండి.

124.                         ఇస్తిఖార నమాజులో

125.                   (ఏదైనా పని గురించి ఆలోచించి, ఎలా చేస్తే మేలుంటుంది అనుకున్నప్పుడు ఒక నిర్ణయానికి రాక ముందు ఫర్జ్ నమాజు కాకుండా రెండు రకాతుల నఫిల్ నమాజు చేసి సలాంకు ముందు లేదా సలాం తింపిన తర్వాత క్రింది దుఆ పఠించాలి. అయితేఅన్నహాజల్ అమ్రఅన్న చోట తన అవసరాన్ని గురించి ఆలోచించుకోవాలి, లేదా అవసరాన్ని ప్రస్తావించాలి. దుఆ ఇలా ఉందిః)

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక అస్తఖ్దిరుక బి ఖుద్రతిక అస్అలుక మిన్ ఫజ్లికల్ అజీం ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు తఅలము వలా అఅలము అంత అల్లా ముల్ గుయూబ్, అల్లాహుమ్మ ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర ఖైరుల్లీ ఫీ దీనీ మఆషీ ఆఖిబతి అమ్రీ ఖాల ఆజిలి అమ్రీ ఆజిలిహీ ఫఖ్దుర్ హు లీ యస్సిర్ హు లీ సుమ్మ బారిక్ లీ ఫీహి ఇన్ కుంత తఅలము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ మఆషీ ఆఖిబతి అమ్రీ ఖాల ఫీ ఆజిలి అమ్రీ ఆజిలిహీ ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్ దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ అర్జినీ బిహీ. (బుఖారి 1166).

اللَّهُمَّ إِنِّي أَسْتَخِيرُكَ بِعِلْمِكَ وَأَسْتَقْدِرُكَ بِقُدْرَتِكَ وَأَسْأَلُكَ مِنْ فَضْلِكَ الْعَظِيمِ فَإِنَّكَ تَقْدِرُ وَلَا أَقْدِرُ وَتَعْلَمُ وَلَا أَعْلَمُ وَأَنْتَ عَلَّامُ الْغُيُوبِ اللَّهُمَّ إِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ خَيْرٌ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاقْدُرْهُ لِي وَيَسِّرْهُ لِي ثُمَّ بَارِكْ لِي فِيهِ وَإِنْ كُنْتَ تَعْلَمُ أَنَّ هَذَا الْأَمْرَ شَرٌّ لِي فِي دِينِي وَمَعَاشِي وَعَاقِبَةِ أَمْرِي أَوْ قَالَ فِي عَاجِلِ أَمْرِي وَآجِلِهِ فَاصْرِفْهُ عَنِّي وَاصْرِفْنِي عَنْهُ وَاقْدُرْ لِي الْخَيْرَ حَيْثُ كَانَ ثُمَّ أَرْضِنِي به

(
అల్లాహ్! నీ జ్ఞానంతో నేను శుభాలను అడుగుతున్నాను. నీ అధికార సాయంతో శక్తిని ప్రసాదించమని కోరుతున్నాను. మహోత్తరమైన నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని అభ్యర్తి- స్తున్నాను. నిశ్చయంగా నువ్వు అధికారం గలవాడివి. నాకు ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. అగోచర జ్ఞానివి నీవే. అల్లాహ్! నీ జ్ఞానం ప్రకారం పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయోజనకరమైతే దాన్ని నా అదృష్టంలో ఉంచు. దాని సాధనను నా కొరకు సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ నీ జ్ఞానం ప్రకారం పని ధార్మికంగా, ప్రాపంచికంగా, పరలోక పరిణామం రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని నా నుండి దూరంగా ఉంచు. దాని బారి నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడున్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. తర్వాత నా మనసు దానిపై కుదుటపడేలా చెయ్యి).

126.                         ఉదయసాయంకాలపు జిక్ర్ ఘనత

127.                   నేను, ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం, మరియు అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారితో కూర్చుండడం ఇస్మాఈల్ అలైహిస్సలాం సంతానంలోని నలుగురు బానిసలను విడుదల చేయుటకంటే ఎక్కువ ఇష్టం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. (అబూదావూద్ 3667). షొఅబుల్ ఈమాన బైహఖీ (556)లో ఎనిమిది మంది బానిసల ప్రస్తావన ఉంది. అలాగే ప్రపంచం అందులో ఉన్న సర్వానికంటే ఎక్కువ ఇష్టం అని కూడా ఉంది. (555).

128.                   ఎవరైనా సామూహికంగా ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత అల్లాహ్ ను స్మరిస్తూ ఉండి, సూర్యోదయం తర్వాత రెండు రకాతులు చేస్తాడో అతనికి ఒక ఉమ్రా, ఒక హజ్ చేసినంత సంపూర్ణ పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 586).

129.                   ఫజ్ర్ నమాజ్ చేసి అదే స్థలంలో కూర్చొని ఉండే వ్యక్తిపైఅల్లాహ్ ఇతడిని క్షమించు, ఇతడిని కరుణించుమని దైవ దూతలు దుఆ చేస్తారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అహ్మద్ 1/144).

నోట్: అల్లాహ్ స్మరణ అంటే క్రింద తెలుపబడిన దుఆలు, ఖుర్ఆన్ పారాయణం, సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్, దరూదె ఇబ్రాహీం వైగారాలు చదవడం.

130.                         ఉదయం మరియు సాయంకాలం చదవండి

131.                   1- ఆయతుల్ కుర్సీ.

132.                   ఉదయం ఆయతుల్ కుర్సీ చదివినవారు సాయం- కాలం వరకు మరియు సాయంకాలం చదివినవారు ఉదయం వరకు షైతానుల నుండి రక్షింపబడతారు. (హాకిం 2064).

2- ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్. 3 సార్లు.

133.                   పై మూడు సూరాలు ఉదయం 3 సార్లు, సాయం- కాలం 3 సార్లు చదివినవారికి ప్రతి కీడు నుండి రక్షణకై ఇవి సరిపోతాయి. (అబూ దావూద్ 5082, తిర్మిజి 3570).

134.                   3- అమ్ సైనా అమ్సల్ (అస్బహ్ నా అస్బ హల్) ముల్కు లిల్లాహి, వల్ హందులిల్లాహి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. రబ్బి అస్అలుక ఖైర మా ఫీ హాజిహిల్లైలతి (హాజల్ యౌమి) ఖైర మా బఅదహా (హూ) అఊజు బిక మిన్ షర్రి మా ఫీ హాజిహిల్లైలతి (హాజల్ యౌమి) షర్రి మా బఅదహా (హూ), రబ్బి అఊజు బిక మినల్ కసలి సూఇల్ కిబరి అఊజు బిక మిన్ అజాబిన్ ఫిన్నారి అజాబిన్ ఫిల్ ఖబ్ర్(ముస్లిం 2723).

أَمْسَيْنَا وَأَمْسَى (أَصْبَحْنَا وَأَصْبَحَ) الْمُلْكُ لِله وَالْحَمْدُ لِله لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ لَهُ الـْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ رَبِّ أَسْأَلُكَ خَيْرَ مَا فِي هَذِهِ اللَّيْلَةِ (هَذا اليَوْمِ) وَخَيْرَ مَا بَعْدَهَا (هُ) وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِي هَذِهِ اللَّيْلَةِ (هَذَا اليَوْمِ) وَشَرِّ مَا بَعْدَهَا (هُ) رَبِّ أَعُوذُ بِكَ مِنْ الْكَسَلِ وَسُوءِ الْكِبَرِ رَبِّ أَعُوذُ بِكَ مِنْ عَذَابٍ فِي النَّارِ وَعَذَابٍ فِي الْقَبْرِ. (مسلم 2723).

(
మేము మరియు అల్లాహ్ యొక్క రాజ్యము సాయంకాలానికి చేరుకున్నాము. సర్వస్తోత్రములు అల్లాహ్ కొరకే, అల్లాహ్ తప్ప సత్యఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు, రాజ్యమంతా అయనదే, స్తోత్రము- లన్నియూ అయనకే, ఆయన సర్వముపై అధికారంగలవాడు. ప్రభువా! రాత్రిలోని మేలును దీని తర్వాత వచ్చే మేలును నీతో కోరుతున్నాను. రాత్రిలోని కీడు మరియు దీని తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణు కోరుతున్నాను. ప్రభువా! బద్ధకం మరియు చెడు వృద్ధాప్యం నుండి నీ శరణు కోరుతున్నాను. నరక శిక్ష మరియు సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాము).

నోట్: పైన ఇవ్వబడిన దుఆ సాయంకాలము చదివినప్పుడు బ్రాకెట్లోని పదాలు చదవకూడదు. ఉదయం చదివినప్పుడు గీత మీద ఉన్న పదాలు చదవకూడదు

4- అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా బిక అమ్ సైనా వబిక నహ్ యా బిక నమూతు ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199).
اللَّهُمَّ بِكَ أّصْبَحْنَا وَبِكَ أَمْسَينَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ النُّشُور

సాయంకాలం చదివినప్పుడు ఇలా చదవండిః

అల్లాహుమ్మ బిక అమ్ సైనా బిక అస్ బహ్ నా వబిక నహ్ యా బిక నమూతు ఇలైకల్ మసీర్.

اللَّهُمَّ بِكَ أَمْسَينَا وَبِكَ أّصْبَحْنَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ الْـمَصِير
(
అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే తిరిగి రానున్నాము).

5- అల్లాహుమ్మ ఇన్నీ అస్ బహ్ తు ఉష్ హిదుక ఉష్ హిదు హమలత అర్షిక మలాఇకతక జమీఅ ఖల్ ఖిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత అన్న ముహమ్మదన్ అబ్దుక రసూలుక.

اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ

(
అల్లాహ్! నిశ్చయంగా నేను ఉదయానికి చేరాను. నిన్ను సాక్షిగా పెడుతున్నాను మరియు నీ సింహాసన పీఠాన్ని ఎత్తి ఉన్నవారిని, దైవ దూతలందరిని ఇంకా సర్వసృష్టిని సాక్షిగా పెడుతున్నాను; నీవు మాత్రమే అల్లాహ్ అని, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని, మరియు ముహమ్మద్ సల్లల్లా- హు అలైహి వసల్లం నీ దాసుడు మరియు నీ ప్రవక్త అని).

135.                   పై దుఆ ఉదదయం, సాయంకాలం నాలుగు సార్లు చదివిని వారిని అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షిస్తాడు. (అబూదావూద్ 5069).

6- అల్లాహుమ్మ మా అస్బహబీ మిన్ నిఅమతిన్ ఫమిన్క వహ్ దక లా షరీక లక ఫలకల్ హందు వలకష్షుక్ర్.

اللَّهُمَّ مَا أَصْبَحَ بِي مِنْ نِعْمَةٍ فَمِنْكَ وَحْدَكَ لَا شَرِيكَ لَكَ فَلَكَ الْحَمْدُ وَلَكَ الشُّكْرُ

(
అల్లాహ్! ఉదయకాలమున నాకు లభించిన అనుగ్రహాలన్నియూ నీ తరఫునే, నీవు ఏకైకునివి, నీకు భాగస్వామి లేడు, సర్వ స్తోత్రములు నీకే, సర్వ కృతజ్ఞతలు నీకే).

నోట్: పై దుఆ ఉదయం చదవాలి. సాయంకాలం చదివినప్పుడుఅస్బహబీఉన్న చోటఅమ్సాబీఅని చదవాలి.

136.                   పై దుఆ ఉదయం చదివిన వ్యక్తి పగటి కృతజ్ఞత చెల్లించినవాడవుతాడు, సాయంకాలం చదివిన వ్యక్తి రాత్రి కృతజ్ఞత చెల్లించినవాడవుతాడు. (అబూదావూద్ 5073).

7- అస్బహ్నా అలా ఫిత్రతిల్ ఇస్లామి అలా కలిమతిల్ ఇఖ్లాసి వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫమ్ ముస్లిమవ్ వమాకాన మినల్ ముష్రికీన్. (ముస్నద్ అహ్మద్ 3/406, సహీహుల్ జామి ).

أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَعَلَى كَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِينِ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى مِلَّةِ أَبِينَا إِبْرَاهِيمَ حَنِيفًا مُسْلِمًا وَمَا كَانَ مِنْ الْمُشْرِكِينَ

(
మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రులు, విశ్వాసులు, ముష్రికులలోని వారు కారు).

నోట్:పై దుఆ ఉదయం చదవాలి. సాయంకాలం చదివినప్పుడుఅస్బహ్నాఉన్న చోటఅమ్ సైనాఅని చదవాలి.

8- బిస్మిల్లాహిల్లజి లా యజుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ వహువస్సమీఉల్ అలీం.

بِسْمِ اللهِ الَّذِي لاَ يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الأَرْضِ وَلاَ فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ العَلِيم
(
అల్లాహ్ పేరుతో, ఆయన పేరుతో వస్తువు నష్టపరచదు, ఆకాశంలోగాని, భూమిలోగాని, ఆయన వినువాడు, సర్వజ్ఞాని).

137.                   పై దుఆ ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు చదివినవారికి ఏదీ నష్టపరచదు. (అబూదావూద్ 5088).

9- రజీతు బిల్లాహి రబ్బౌఁ వబిల్ ఇస్లామి దీనౌఁ బిముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ నబియ్య.

رَضِيتُ بِاللهِ رَبًّا وَ بِالإِسْلامِ دِ ينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا
(
అల్లాహ్ ను ప్రభువుగా, ఇస్లాంను ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా నమ్మి సంతోషపడ్డాను).

138.                   పై దుఆ ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు చదివినవారితో అల్లాహ్ ప్రళయదినాన తప్పక సంతో- షంగా ఉంటాడు. (తిర్మిజి 3870).

139.                   నేను పై దుఆ ఉదయం చదివినవారి చేయి పట్టుకొని స్వర్గంలో తీసుకెళ్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారు. (సహీహుత్ తర్గీబ్ 657).

140.                   10- హస్బియల్లాహు లాఇలాహ ఇల్లాహువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. 7సార్లు(అబూదావూద్ 5081).

حَسْبِيَ الله لاَ إِلهَ إلاَّ هُوَ عَلَيهِ تَوَكَّلْتُ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيم
(
నాకు అల్లాహ్ యే చాలు, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, ఆయనపైనే నేను నమ్మకం ఉంచాను, ఆయన గొప్ప సింహాసనం యొక్క ప్రభువు).

11- అల్లాహుమ్మ అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్ తనీ అనా అబ్దుక వఅన అలా అహ్దిక వఅదిక మస్తతఅతు అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు అబూఉ లక బినిఅమతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

(
అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చు- చున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తు- న్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).

141.                   పై దుఆ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివిన వ్యక్తి సాయంకాలముకు ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదవి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. (బుఖారి 6306).

12- అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బదనీ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ సమ్ఈ అల్లాహుమ్మ ఆఫినీ ఫీ బసరీ లాఇలాహ ఇల్లా అంత, అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ కుఫ్రి వల్ ఫక్రి అఊజు బిక మిన్ అజాబిల్ కబ్రి లాఇలాహ ఇల్లా అంత. (అబూ దావూద్ 5090).

اللَّهُمَّ عَافِنِي فِي بَدَنِي اللَّهُمَّ عَافِنِي فِي سَمْعِي اللَّهُمَّ عَافِنِي فِي بَصَرِي لَا إِلَهَ إِلَّا أَنْتَ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ الْكُفْرِ وَالْفَقْرِ وَأَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ لَا إِلَهَ إِلَّا أَنْتَ

(
అల్లాహ్! నా శరీరంలో నాకు స్వస్థత ప్రసాదించు, అల్లాహ్! నా చెవిలో స్వస్థత ప్రసాదించు, అల్లాహ్! నా దృష్టిలో స్వస్థత ప్రసాదించు, నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అల్లాహ్! సత్యతిరస్కారం మరియు బీదరికం నుండి నీ శరణు వచ్చాను, అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణులో వచ్చాను. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు).

13- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిర, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ దున్యాయ అహ్లీ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య మిన్ ఖల్ఫీ అన్ యమీనీ అన్ షిమాలీ మిన్ ఫౌకీ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِيْنِي وَ دُنْيَايَ وَأَهْلِيْ وَمَالِيْ اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِيْ وَآمِنْ رَوْعَاتِي اللَّهُمَّ احْفَظْنِيْ مِنْ بَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِيْ وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي وَأَعُوذُ بِعَظْمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي

(
అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యంతో నీ శరణులో వచ్చాను).

14- అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ షర్రిష్ షైతాని షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ అజుర్రహూ ఇలా ముస్లిమ్.

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرَّهُ إِلَى مُسْلِمٍ

(
అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల- గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.).

15- యా హయ్యు యా ఖయ్యూమ్ బిక అస్తగీస్, ఫఅస్లిహ్ లీ షఅనీ వలా తకిల్నీ ఇలా నఫ్సీ తర్ఫత ఐన్. (అబూ దావూద్ 5090).

يَا حَيُّ يَا قَيُّومُ بِكَ اَسْتَغِيثُ فَأَصْلِحْ لِيْ شَأْنِي وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْن
(
సజీవుడా, విశ్వవ్యవస్థకు ఆధారభూతుడా! నీతోనే నేను మొరపెట్టుకుంటున్నాను. అందుకని నా ప్రతి కార్యాన్ని సజావుగా చేయు, కనురెప్ప కొట్టే అంత కూడా నన్ను నాకై అప్పగించకు).

16- లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్.

لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِير

142.                   పై జిక్ర్ ఉదయం పది సార్లు చదివినవారికి పది పుణ్యాలు అల్లాహ్ వ్రాస్తాడు, పది పాపాలు మన్నిస్తాడు, పది స్థానాలను పెంచుతాడు, నాలుగు బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది మరియు సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు. సాయంకాలం పది సార్లు చదివితే అలాంటి ఘనతే ఉంది. (ఇబ్నుహిబ్బాన్ 2021, సహీహుత్ తర్గీబ్ 474). బద్ధకం ఉంటే ఒకసారైనా చదవాలి. (అబూదావూద్ 5077).

పై జిక్ర్ 100 సార్లు చదివితే పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది, 100 పుణ్యాలు వ్రాయబడతాయి, 100 పాపాలు తొలగించబడతాయి, సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షింపబడతాడు, అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు. (బుఖారి 6403, ముస్లిం 2691).

143.                   15- సుబ్ హానల్లాహి వబిహందిహీ.

سُبْحَانَ اللهِ وَ بِحَمْدِهِ (100 مرة)

పై జిక్ర్ ఉదయం 100 సార్లు, సాయంకాలం 100 సార్లు చదివినవారికంటే ఉత్తములు ప్రళయదినాన మరెవరూ ఉండరు, కేవలం అతని పరిమాణంలో, లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప. (ముస్లిం 2692).

144.                   పై జిక్ర్ ఉదయం, సాయంకాలం వంద, వంద సార్లు చదివిన వారి పాపాలు సముద్రపు నురుగుకు సమానమైనా క్షమించబడతాయి. (సహీహుత్ తర్గీబ్ 653).

145.                   16- అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఆ, రిజ్ఖన్ తయ్యిబా, అమలమ్ ముతకబ్బలా(కేవలం ఫజ్ర్ నమాజు తర్వాత). (ఇబ్ను మాజ 925)

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَ عَمَلاً مُتَقَبَّلاً

(
అల్లాహ్! ప్రయోజనకరమైన విద్య, పవిత్ర ఆహారం మరియు అంగీకారయోగ్యం పొందే ఆచరణ భాగ్యం ప్రసాదించమని నిన్నే వేడుకుంటున్నాను).

17- సుబ్ హానల్లాహి బిహందిహీ అదద ఖల్కిహీ రిజా నఫ్సిహీ జినత అర్షిహీ మిదాద కలిమాతిహ్.

سُبْحَانَ الله وَبِحَمْدِهِ عَدَدَ خَلْقِهِ وَرِضَا نَفْسِهِ وَزِنَةَ عَرْشِهِ وَمِدَادَ كَلِمَاتِهِ

(
అల్లాహ్ స్తోత్రముతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు తున్నాను, ఆయన సృష్టి పరిమాణంలో, ఆయనకు ఇష్టమైనంత, ఆయన సింహాసనంత బరువులో మరియు ఆయన పవిత్ర వచనాలు వ్రాయబడే సిరా అంత పరిమాణంలో).

146.                   పై దుఆ ఫజ్ర్ తర్వాత 3 సార్లు చదివితే, ఫజ్ర్ నుండి చాష్త్ వరకు చేసే జిక్ర్ కు సమానమైన పుణ్యం లభిస్తుంది. (ముస్లిం 2726).

18- అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్.

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِن شَرِّ مَا خَلَق
(
అల్లాహ్ సంపూర్ణ వచనాలతో నేను శరణు కోరుతున్నాను, ఆయన సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి).

147.                   పై దుఆ సాయంకాలం 3 సార్లు చదివినవారికి రాత్రి విషపురుగు హాని కలిగించదు. (ముస్లిం 2709).

19- అస్తగ్ ఫిరుల్లాహ అతూబు ఇలైహ్.

148.                   జిక్ర్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ వసల్లం ప్రతి రోజు వందసార్లు చదివేవారు. (ముస్లిం 2702).

149.                   20- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్.

150.                   ఉదయం 10 సార్లు, సాయంకాలం 10 సార్లు దరూద్ చదివినవారి పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు. (సహీహుల్ జామి 6357).

151.                   21- సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు 100 సార్లుసుబ్ హానల్లాహ్, 100 సార్లుఅల్ హందులిల్లాహ్, 100 సార్లుఅల్లాహు అక్బర్’.

152.                   అది (అల్లాహ్ మార్గంలో వదిలిన) 100 ఒంటెలకంటే ఉత్తమం.
అది అల్లాహ్ మార్గంలో వదిలిన 100 గుర్రాల కంటే ఉత్తమం.
అది 100 బానిసలను విముక్తి కలిగించుటకంటే ఉత్తమం. (సహీ తర్గీబ్ 658).

153.                         పడుకునే ముందు

154.                   1- ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్ మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్.

రెండు అరచేతులు కలిపి, పై మూడు సూరాలు చదివి, అందులో ఊదుకొని ముఖము, శరీర ముందు భాగం ఇంకా సాధ్యమైనంత వరకు మిగిత భాగంలో తుడుచు కోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. (బుఖారి 5018).

2- ఆయతుల్ కుర్సీ.

పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివినవారి పై అల్లాహ్ ఒక రక్షకుడ్ని నియమిస్తాడు మరియు తెల్లారే వరకు షైతాన్ అతని దగ్గరికి రాడు. (బుఖారి 2311 తర్వాత).

3- ఆమనర్రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహీ వల్ ముఅమినూన్, కుల్లున్ ఆమన బిల్లాహి వమలాఇకతిహీ వకుతుబిహీ రుసులిహీ లా నుఫర్రిఖు బైన అహదిమ్ మిర్రుసులిహ్, ఖాలూ సమిఅనా అతఅనా గుఫ్రానక రబ్బనా ఇలైకల్ మసీర్. లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వఅలైహా మక్తసబత్ రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్నసీనా అఖ్ తఅనా రబ్బనా వలా తహ్ మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహూ అలల్లజీన మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మాలా తాఖత లనా బిహీ వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్ హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్.

(
ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి అవతరించిన దానిని విశ్వసించాడు, విశ్వాసులు కూడా దానిని విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారంటారుః మేము అల్లాహ్ ప్రవక్తలలో ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము, నీ క్షమాభిక్షకై అర్థిస్తున్నాము మా ప్రభువా! గమ్యస్థానం నీ వైపుకే ఉంది. అల్లాహ్ ప్రాణిపైననూ దాని శక్తికి మించిన భారం వేయడు, తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితం, తాను చేసిన పాపానికి దుష్ఫలితం ప్రతివ్యక్తి అనుభవిస్తాడు. (మీరు ఇలా వేడుకోండిః) మా ప్రభువా! మేము మరచినా, లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు. మా ప్రభువా! పూర్వం వారిపై మోపినటువంటి భారం మాపై మోపకు. మా ప్రభువా! మేము సహించలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు సహాయం నొసంగు).

పై ఆయతులు రాత్రి పడుకునే ముందు చదువు కునే వారికి అవి సరిపోతాయి. (బుఖారి 5040, ముస్లిం 807).

155.                   4- బిస్మిక రబ్బీ వజఅతు జంబీ బిక అర్ఫఉహూ ఇన్ అమ్సక్ నఫ్సీ ఫర్హమ్ హా వఇన్ అర్సల్ తహా ఫహ్ఫజ్ హా బిమా తహ్ఫజు బిహీ ఇబాదకస్సాలిహీన్. (బుఖారి 6320).

నిద్రించుటకు వెళ్ళినపుడు పడక బట్టల్ని బాగా దులుపుకోవాలి, అతను దాని నుండి దూరంగా ఉన్నపుడు అందులో ఏమి వచ్చి పడిందో అతనికి తెలియదు గనక, తర్వాత పై దుఆ చదవాలి

بِاسْمِكَ رَبِّ وَضَعْتُ جَنْبِي وَبِكَ أَرْفَعُهُ إِنْ أَمْسَكْتَ نَفْسِي فَارْحَمْهَا وَإِنْ أَرْسَلْتَهَا فَاحْفَظْهَا بِمَا تَحْفَظُ بِهِ عِبَادَكَ الصَّالِحِينَ

నా ప్రభూ! నీ పేరుతో (పడకపై) మేను వాల్చాను, తిరిగి నీ పేరుతోనే మేల్కొంటాను. ( మధ్యలో) నీవు నా ప్రాణాన్ని (నీ వద్ద) ఆపుకుంటే దానిని క్షమించి కరుణించు. ఒకవేళ దానిని తిరిగి (నా శరీరంలో) విడిచిపెడితే సజ్జనులైన నీ దాసుల్ని రక్షించినట్లు దానిని రక్షించు.

5- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకోవాలని ఉద్దేశించినప్పుడు తమ కుడి చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొని దుఆ 3 సార్లు చదివేవారుః అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక. (అబూ దావూద్ 5045).

اللَّهُمَّ قِنِي عَذَابَكَ يَوْمَ تَبْعَثُ عِبَادَكَ
అల్లాహ్! నీవు నీ దాసుల్ని మరణించిన తర్వాత తిరిగి బ్రతికించే రోజున నన్ను నీ శిక్ష నుండి కాపాడు.

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడకపై వచ్చి తమ చేతిని కుడి చెంప క్రింద పెట్టుకొనిఅల్లాహుమ్మ బిస్మిక అమూతు అహ్ యాచదివేవారు. (బుఖారి 6314).

اللَّهُمَّ بِاسْمِكَ أَمُوتُ وَأَحْيَا
అల్లాహ్! నీ పేరుతోనే మృత్యు ఒడిలోకి పోతున్నాను మళ్ళీ నీ పేరుతోనే బ్రతుకుతున్నాను.

156.                   7- మీరు మీ పడకపై వచ్చి నిద్రపోయే ముందు అల్లాహు అక్బర్ 34 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, సుబ్ హానల్లాహ్ 33 సార్లు చదవండి. ఇది మీ కొరకు బానిస కంటే ఎంతో ఉత్తమం. (బుఖారి 3113).

157.                   8- ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅబుదు మా తఅబుదూన్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్. వలా అనా ఆబిదుమ్ మాఅబత్తుమ్, వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్, లకుమ్ దీనుకుమ్ వలియ దీన్.

(
ఇలా అనుః సత్యతిరస్కారులారా! మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను. నేను ఆరాధించే ఆయన(అల్లాహ్) ను మీరు ఆరాధించేవారు కారు. మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను. నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు. మీ ధర్మం మీకు, నా ధర్మం నాకు).

158.                   పై సూరా పఠించి వెంటనే పడుకో, నీవు షిర్క్ నుండి దూరంగా ఉన్నావని ఇది ఒక నిరూపణ. (అబూ దావూద్ 5055).

159.                   9- నీవు నీ పడకపై వచ్చే ముందు నమాజు కొరకు చేసిన విధంగా వుజూ చేసి నీ కుడి ప్రక్కన పడుకొని దుఆ చదువుః అల్లాహుమ్మ అస్లమ్ తు వజ్ హీ ఇలైక ఫవ్వజ్ తు అమ్రీ ఇలైక అల్ జఅతు జహ్రీ ఇలైక రగ్బతౌఁ రహ్బతన్ ఇలైక లా మల్ జఅ వలా మంజా మిన్క ఇల్లా ఇలైక అల్లాహుమ్మ ఆమన్తు బికితాబికల్లజీ అంజల్త బినబియ్యికల్లజీ అర్సల్త.

اللَّهُمَّ أَسْلَمْتُ وَجْهِي إِلَيْكَ وَفَوَّضْتُ أَمْرِي إِلَيْكَ وَأَلْجَأْتُ ظَهْرِي إِلَيْكَ رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ لَا مَلْجَأَ وَلَا مَنْجَا مِنْكَ إِلَّا إِلَيْكَ اللَّهُمَّ آمَنْتُ بِكِتَابِكَ الَّذِي أَنْزَلْتَ وَبِنَبِيِّكَ الَّذِي أَرْسَلْتَ

(
అల్లాహ్ నీ సమక్షంలో నన్ను నేను సమర్పించు- కున్నాను. నా వ్యవహారాలన్నీ నీకు అప్పగించాను. ఇక నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ అనుగ్రహ భాగ్యం పొందే ఆరాటంతో, నీ ఆగ్రహ భయంతో నీ సన్నిధిలో హాజరయ్యాను. నీ నుండి పారిపోయి నేనెక్కడా రక్షణ పొందలేను. నీ సన్నిధిలో తప్ప నాకు మరెక్కడా ఆశ్రయం లేదు. అల్లాహ్! నీవు అవతరింప జేసిన నీ (ఖుర్ఆను) గ్రంథాన్ని, నీవు ప్రభవింపజేసిన నీ ప్రవక్తను (మనస్ఫూర్తిగా) విశ్వసించాను). (బుఖారి 247).

160.                   ఇదే రాత్రి నీవు చనిపోయావంటే ఇస్లాం ధర్మంపై నీవు చనిపోతావు. దుఆ నీ తుది పలుకులు కావాలి. (అంటే దుఆ తర్వాత నీ నోట ఎలాంటి ప్రాపంచిక విషయాలు వెలువడ కూడదు).

161.                   10- అల్లాహుమ్మ రబ్బస్సమావాతి రబ్బల్ అర్జి రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బనా రబ్బ కుల్లి షైఇన్ ఫాలిఖిల్ హబ్బి వన్నవా ముంజిలత్ తౌరాతి వల్ ఇంజీలి వల్ ఫుర్కాని అఊజు బిక మిన్ షర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిజుమ్ బినాసియతిహీ, అల్లాహుమ్మ అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్ అంతల్ ఆఖిరు ఫలైస బఅదక షైఉన్ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్ ఇఖ్ జి అన్నద్దైన అగ్నినా మినల్ ఫఖ్ర్.

اللَّهُمَّ رَبَّ السَّمَاوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيمِ رَبَّنَا وَرَبَّ كُلِّ شَيْءٍ فَالِقَ الْحَبِّ وَالنَّوَى وَمُنْزِلَ التَّوْرَاةِ وَالْإِنْجِيلِ وَالْفُرْقَانِ أَعُوذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيَتِهِ اللَّهُمَّ أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَيْءٌ وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدَكَ شَيْءٌ وَأَنْتَ الظَّاهِرُ فَلَيْسَ فَوْقَكَ شَيْءٌ وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُونَكَ شَيْءٌ اقْضِ عَنَّا الدَّيْنَ وَأَغْنِنَا مِنْ الْفَقْرِ

(
భూమ్యాకాశాలకు, గొప్ప సింహాసనానికి ప్రభువైన అల్లాహ్! మాకు మరియు ప్రతీదానికి ప్రభువైన ప్రభువా! బీజాన్ని, విత్తనాన్ని చీల్చువాడా! తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్కాన్ (ఖుర్ఆన్) అవతరింప జేసినవాడా! నేను ప్రతీ కీడు నుండి నీ శరణులో వచ్చాను, దాని జుట్టు నీ చేతిలోనే ఉంది. అల్లాహ్! నీవే అందరికీ ప్రథమం, నీకంటే ముందు ఎవడూ లేడు, నీవే అంతం, నీ తర్వాత ఎవడూ లేడు, నీవే అందరిపై ఆధిపత్యం గలవానివి, నీపై ఎవరి ఆధిపత్యం చెల్లదు, నీవే అందరికీ పరోక్షంగా ఉన్నవానివి, నీకంటే మరుగగా ఎవడూ లేడు, మాపై ఉన్న అప్పును తేర్చు, బీదరికం నుండి బైటికి తీసి మమ్మల్ని సరిసంపదలు గలవానివిగా చేయు). (ముస్లిం 2713).

11- అల్ హందులిల్లాహిల్లజీ అత్అమనా సఖానా కఫానా ఆవానా ఫకమ్ మిమ్మల్ లా కాఫియ లహూ వలా ముఅవియ. (ముస్లిం 2715).

الْحَمْدُ لِله الَّذِي أَطْعَمَنَا وَسَقَانَا وَكَفَانَا وَآوَانَا فَكَمْ مِمَّنْ لَا كَافِيَ لَهُ وَلَا مُؤْوِي

(
సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే! ఆయనే మాకు తినిపించాడు, త్రాగించాడు, సరిపోయాడు, నివాసమిచ్చాడు. లేకుంటే ఎంతో మందికి సరిపడు వాడు మరియు నివాసమిచ్చువాడు ఎవడూ లేడు).

12- అల్లాహుమ్మ ఫాతిరిస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇన్ మలీకహు అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ షర్రిష్షైతాని షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ అజుర్రుహూ ఇలా ముస్లిమ్.

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرُّهُ إِلَى مُسْلِمٍ

(
అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతి వస్తువు యొక్క ప్రభువా! మరియు వాటి యజమానీ! నీ తప్ప ఎవ్వరూ సత్య ఆరాధ్యుడు లేడు అని నేను సాక్ష్యమిచ్చు చున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్, ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్లగాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి.). (అబూదావూద్ 5083).

13- పడుకునే ముందు ఖుర్ఆనులోని సూర (32) అలిఫ్ లామ్ మీమ్ అస్సజ్దా మరియు సూర (67) ముల్క్ చదవాలి. (తిర్మిజి 3404).

162.                         రాత్రివేళ ప్రక్క మారుస్తూ

163.                   లాఇలాహ ఇల్లల్లాహుల్ వాహిదుల్ ఖహ్హార్, రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. (హాకిం, సహీహుల్ జామి 4693).

لاَ إِلَهَ إِلاَّ اللهُ الوَاحِدُ القَهَّارُ رَبُّ السَّمَاوَاتِ وَالأَرضِ وَمَا بَينَهُمَا العَزِيزُ الغَفَّار

(
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు, సర్వాధికారుడు, భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు).

164.                         నిద్రలో భయాందోళన కలిగినప్పుడు

165.                   అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ గజబిహీ ఇఖాబిహీ షర్రి ఇబాదిహీ మిన్ హమజాతిష్ షయాతీని అఐఁ యహ్ జురూన్. (తిర్మిజి 3528).

أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ غَضَبِهِ وَعِقَابِهِ وَشَرِّ عِبَادِهِ وَمِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ وَأَنْ يَحْضُرُونِ

(
అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల రక్షణలో వస్తున్నాను; ఆయన ఆగ్రహం నుండి, శిక్ష నుండి, ఆయన దాసుల కీడు నుండి మరియు షైతానుల ప్రేరేపణల నుండి ఇంకా అవి స్వయంగా దగ్గరకు రావడం నుండి).

166.                         చెడు స్వప్న చూస్తే ఏం చేయాలి?

167.                   ముడూ సార్లు తన ఎడమ ప్రక్కలో ఉమ్మి వేయాలి.
చెడు కల మరియు షైతాన్ నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి.
ప్రక్క మార్చాలి.
కల గురించి ఎవరికీ తెలుపకూడదు.
లేచి నమాజు చేసుకున్నా మంచిదే.
పై పనులు చేసినవానికి కల ద్వారా హానీ, అపాయం కలుగదు ఇన్షాఅల్లాహ్. (ముస్లిం 2261-2263).

168.                         విత్ర్ నమాజులో

169.                   1- అల్లాహుమ్మహ్ దినీ ఫీమన్ హదైత ఆఫినీ ఫీమన్ ఆఫైత వతవల్లనీ ఫీమన్ తవల్లైత బారిక్ లీ ఫీమా అఅతైత ఖినీ షర్ర మా ఖజైత ఇన్న తఖ్ జీ వలా యుఖ్ జా అలైక ఇన్నహూ లా యజిల్లు మన్ వాలైత వలా యఇజ్జు మన్ ఆదైత తబారక్త రబ్బనా తఆలైత

اللَّهُمَّ اهْدِنِي فِيمَنْ هَدَيْتَ وَعَافِنِي فِيمَنْ عَافَيْتَ وَتَوَلَّنِي فِيمَنْ تَوَلَّيْتَ وَبَارِكْ لِي فِيمَا أَعْطَيْتَ وَقِنِي شَرَّ مَا قَضَيْتَ إِنَّكَ تَقْضِي وَلَا يُقْضَى عَلَيْكَ وَإِنَّهُ لَا يَذِلُّ مَنْ وَالَيْتَ وَلَا يَعِزُّ مَنْ عَادَيْتَ تَبَارَكْتَ رَبَّنَا وَتَعَالَيْتَ

(
అల్లాహ్! నీవు సన్మార్గం ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ సన్మార్గం ప్రసాదించు, నీవు స్వస్థత ప్రసాదించిన వారిలో నన్ను చేర్చి నాకూ స్వస్థత ప్రసాదించు, నీ స్నేహితుల్లో చేర్చి నాకు నీ స్నేహం ప్రసాదించు, నీవు నాకొసంగిన దాంట్లో శుభం కలుగజేయి, నీవు నిర్ణయించిన కీడు నుండి నన్ను కాపాడుకో, నిర్ణయాలు చేసేవానివి నీవే, నీకు వ్యతిరేకమైన నిర్ణయం ఎవడూ చేయలేడు, నీవు మిత్రునిగా చేసుకున్నవాడు ఎన్నడూ అవమానం పాలుకాడు. నీవు ద్వేశించినవాడు ఎన్నటికీ గౌరవం పొందడు. మా ప్రభువా నీవు శుభాలుగల మహోన్నతునివి). (అబూదావూద్ 1425).

170.                   2- అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిరిజాక మిన్ సఖతిక బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ

(
అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించు కున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను). (అబూదావూద్ 1427).

171.                   3- అల్లాహుమ్మ ఇన్నా నస్తఈనుక నస్తగ్ ఫిరుక నుస్నీ అలైకల్ ఖైర కుల్లహూ నష్కురుక వలా నక్ఫురుక నఖ్ లఉ నత్రుకు మన్ యఫ్ జురుక అల్లాహుమ్మ ఇయ్యాక నఅబుదు వలక నుసల్లీ నస్జుదు వఇలైక నస్ఆ నహ్ ఫిదు నర్జూ రహ్మతక నఖ్ షా అజాబక ఇన్న అజాబక బిల్ కుఫ్ఫారి ముల్ హిఖ్

اللَّهُمَّ إِنَّا نَستَعِينُكَ وَنَستَغفِرُكَ وَنُثنِي عَلَيكَ الخَيرَ كُلَّهُ وَنَشكُرُكَ وَلاَ نَكفُرُكَ وَنَخلَعُ وَنَترُكُ مَن يَفجُرُكَ اللَّهُمَّ إِيَّاكَ نَعبُدُ وَلَكَ نُصَلِّي وَنَسجُدُ وَإِلَيكَ نَسعَى وَنَحفِدُ نَرجُو رَحمَتَكَ وَنَخشَى عَذَابَكَ إِنَّ عَذَابَكَ بِالكُفَّارِ مُلحِق

(
అల్లాహ్! నిశ్చయంగా మేము నీతో మాత్రమే సహాయం కోరుతాము, నీతోనే క్షమాభిక్ష అడుగుతాము, నీ సంపూర్ణ ఉత్తమ స్తోత్రములే స్తుతిస్తాము, నీ కృతజ్ఞత చెల్లిస్తాము, నీ కతఘ్నత పాటించము, నీతో పాపానికి ఒడిగట్టిన వారిని మానాన వదిలేస్తాము, అల్లాహ్! నిన్ను మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాము, నీ కొరకే నమాజు, సజ్దాలు చేస్తాము, నీ వైపునకే పరుగిడుతాము, ప్రయత్నము చేస్తాము, నీ కరుణను ఆశిస్తూ, నీ శిక్షతో భయపడుతాము, నీ శిక్ష అవిశ్వాసులకు కలుగనుంది). (ఇర్వాఉల్ గలీల్ 425, 2/164).

172.                         విత్ర్ నమాజ్ తర్వాత

173.                   సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్. (నిసాయీ 1729).

سُبْحَانَ المَلِكُ القُدُّوس
(
పరిశుద్ధుడైన చక్రవర్తి పరమపవిత్రుడు).
ముడూ సార్లు అనాలి. మూడవసారి కొంచెం శబ్దం పెంచాలి.

174.                         జనాజ నమాజులో

175.                   జనాజ నమాజు పద్ధతిః అల్లాహు అక్బర్ అని సనా, సూరె ఫాతిహా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని క్రింది దుఆలు చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని సలాం తింపాలి.

176.                   [1] అల్లాహుమ్ మగ్ఫిర్ లహూ వర్ హమ్ హు ఆఫిహీ వఅఫు అన్ హు అక్రిమ్ నుజులహూ వస్సిఅముద్ ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బర్ది నఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్ యజు మినద్దనసి అబ్దిల్ హు దారన్ ఖైరమ్ మిన్ దారిహీ అహ్లన్ ఖైరమ్ మిన్ అహ్లిహీ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహీ అద్ ఖిల్ హుల్ జన్నత అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి అజాబిన్నార్.

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مُدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ أَوْ مِنْ عَذَابِ النَّارِ

(
అల్లాహ్ ఇతడ్ని క్షమించు, ఇతనిని కరుణించు, శిక్ష నుండి కాపాడు, మన్నించు, ఇతడ్ని ఆదరించి మర్యాద చెయ్యి, ఇతని సమాధిని విశాల పరచు, ఇతడ్ని నీళ్ళతో, మంచుతో, వడగళ్ళతో కడిగి తెల్లని వస్త్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసినట్లు పాపాల నుండి ఇతన్ని పరిశుభ్రం చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లు కన్నా మంచి ఇల్లు, ఇహలోకపు పరివారంకన్నా ఉత్తమ పరివారం, ఇహలోకపు జంటకంటే మంచి జంట ఇవ్వు. ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు). (ముస్లిం 963).

177.                   [2] అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా మయ్యితినా షాహిదినా గాయిబినా సగీరినా కబీరినా జకరినా ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్ యిహీ అలల్ ఇస్లామ్, మన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రి మ్నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహ్. (ఇబ్ను మాజ 1498).

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ

(
అల్లాహ్! మాలోని బ్రతికి ఉన్నవారిని చనిపోయిన వారిని, హాజరున్నవారిని, దూరమున్నవారిని, చిన్న వారిని పెద్దవారిని, పురుషులను స్త్రీలను క్షమించు. అల్లాహ్ మాలో ఎవరిని బ్రతకనిచ్చినా ఇస్లాంపై బ్రతకనివ్వు, మాలో ఎవరికి మరణాన్ని ప్రసాదించినా విశ్వాస స్థితిలోనే మరణాన్ని ప్రసాదించు. అల్లాహ్! మరణించిన వ్యక్తి (విషయంలో సహనం వహించటం వల్ల లభించే) పుణ్యానికి మమ్మల్ని దూరం చేయకు. ఇతని తర్వాత మమ్మల్ని మార్గభ్రష్టత్వంలో పడవేయకు).

178.                   [3] అల్లాహుమ్మ ఇన్న ఫులానబ్న ఫులానిన్ ఫీ జిమ్మతిక హబ్లి జివారిక ఫఖిహీ ఫిత్నతల్ ఖబ్రి అజాబన్నారి అంత అహ్లుల్ వఫాఇ వల్ హంద్. అల్లాహుమ్మ ఫగ్ఫిర్లహూ వర్ హమ్ హు ఇన్నక అంతల్ గఫూరుర్రహీం(అబూదావూద్ 3202).

اللَّهُمَّ إنَّ فُلَانَ بنَ فُلَانٍ فِي ذِمَّتِكَ وَحَبلِ جِوَارِكَ فَقِهِ فِتْنَةَ الْقَبرِ وَعَذَابَ الْقَبرِ وَأنْتَ أهلُ الْوَفَاءِ وَالحَمْدِ اللَّهُمَّ فَاغْفِرْلَهُ وَارْحَمْهُ إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيم

(
అల్లాహ్ ఫలాన వ్యక్తి కుమారుడు నీ రక్షణలో, నీ చెంత ఉన్నాడు, నీవు అతడ్ని సమాధి శిక్ష నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు. నీవు వాగ్దానాన్ని నెరవేర్చువాడవు, స్తుతి పాత్రుడవు. అల్లాహ్ ఇతడ్ని మన్నించు, ఇతనిపై దయ చూపు. నిస్సందేహంగా నీవు అమితంగా మన్నించేవాడవు, అత్యధికంగా కరుణించేవాడవు).

179.                   [4] అల్లాహుమ్మ అబ్జుక వబ్ను అమతిక ఇహ్ తాజ ఇలా రహ్మతిక అంత గనియ్యున్ అన్ అజాబిహీ ఇన్ కాన ముహ్ సినన్ ఫజిద్ ఫీ ఇహ్ సానిహీ ఇన్ కాన ముసీఅన్ ఫతజావజ్ అన్ హు. (హాకిం 1/359).

اللَّهُمَّ عَبْدُكَ وَابْنُ أَمَتِكَ احْتَاجَ إِلَى رَحْمَتِكَ وَأَنْتَ غَنِيٌّ عَنْ عَذَابِهِ إِنْ كَانَ مُحسِنًا فَزِدْ فِي حَسَنَاتِهِ وَإِنْ كَانَ مُسِيئاً فَتَجَاوَزْ عَنْهُ

(
అల్లాహ్! నీ దాసుడు, నీ దాసి కుమారుడు నీ కరుణ అవసరమైనవాడు. అతన్ని శిక్షించే అవసరం నీకు మాత్రం లేదు. అతడు పుణ్యాత్ముడై ఉంటే అతనికి పుణ్యఫలితాలు రెట్టింపుగా ప్రసాదించు. అతడు పాపా త్ముడై ఉంటే అతన్ని మన్నించు).

180.                         పిల్లల జనాజలో

181.                   అల్లాహుమ్మజ్అల్ హు లనా ఫరతౌఁ సలఫౌఁ అజ్రా. (బుఖారి 1335కు ముందు).

اللَّهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَسَلَفًا وَأَجْرًا
(
అల్లాహ్! ఇతడ్ని మా కొరకు సారథిగా, ముందుగా ఉండి మా కొరకు ప్రతిఫల కారకునిగా చేయి).

182.                  
కృతజ్ఞతలు
స్తుతులకు పాత్రుడవు నీవే అల్లాహ్ ! కరుణామయుడా అల్లాహ్ !

 

సలఫ్ అంటే ఎవరు మరియు మన్హజె సలఫ్ అంటేమిటి ?

సలఫ్ అనే పదంసలఫ్ అస్-సాలిహ్అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటేపూర్వ కాలపు సజ్జనులు’. ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త () మూడు తరాలను ఉత్తమ ముస్లిం తరాలుగా అభివర్ణించారు.

عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «خَيْرُ النَّاسِ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُم»

మొదటిది: ప్రవక్త () మరియు ఆయన సహబా (సహచరులు). రెండవదితాబిఈన్ (సహచరుల అనుచరులు). మూడవదితబఎ తాబిఈన్ (సహచరుల అనుచరుల అనుచరులు) [బుఖారీ 2652, ముస్లిం 2533]

అయితే సలఫ్ ఎలా ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకున్నారో, ఆచరించారో అలాగే అర్థం చేసుకునే, ఆచరించే ప్రయత్నం చేసేవారినేసలఫీలేదాఅహ్లె హదీస్అని అంటారు. మరియునిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅవీరే.

 

YOUTUBE : TELUGU BUKHARI

https://www.youtube.com/@TeluguBukhari


Comments