- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
DAWA - importance - IMAM / OLIMA –VS- DAYEE - islamic Social Work #TeluguBukhari
https://docs.google.com/document/d/1ojGakISzpO2GEO2Cmf30h-pg8QhcSc4n/edit?usp=sharing&ouid=101627634137561034494&rtpof=true&sd=true
IMAM
/ OLIMA –VS- DAYEE
అస్సలాము అలైకుమ్ వారహ్మతుల్లాహి వా బరకాతుహు - బిస్మిల్లాహ్ ఇర్రహ్మాన్ నిర్రహీమ్
Quran
& ఇస్లాం & హదీసుల ఆధారంగా...
ఒళిమాలు, ఇమాములు, మొల్వీలు, ఆలీములు, హాఫీజులు, ముహద్దసీన్ లు ఎవరు ? మరి దాయీలు, బ్రదర్ లు ఎవరు?
నమాజులు ఎవరు చదివించవచ్చు, ఎవరు చదివించకూడదు. ఖురాన్ ఎవరు చదవచ్చు, ఎవరు చదవాలి? ఎవరు చదవ కూడదు, ఖురాన్ కేవలం అరబ్బీక్ భాషలో మాత్రమే చదవాలా? మరి నమాజ్? ఇస్లాం గురించి ప్రవక్తలు, సహాబాలు పనిచేసినట్టుగా ఇప్పుడు ఎవరు చేయాలి?
మరి సమాజం లో కొంతమంది ఖురాన్ మరియు ఇస్లాం ని ఆదాయపు వనరులుగా మార్చుకున్నారు అది ఎంతవరకు సరైనది? పెద్దవ్యక్తుల పేరుతో ఖురఆన్ కథం చూపించడం, తావీజుల రూపంలో అనేక రకాల నాపాక్ ప్రదేశాలలోకి ఖురాన్ వాక్యాలను తీసుకెళ్లడం ఎంతవరకు సరైంది?
అసలు ఖురాన్ ని ఎందుకు చదవాలి, వినాలి? విన్పించాలి, అర్థంచేసుకోవాలి? ఇతరులదాకా చేర్చాలి? ఎందుకు?
2:41 وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
మీ వద్దనున్న గ్రంథాలకు ధృవీకరణగా నేను అవతరింపజేసిన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) విశ్వసించండి. దీని పట్ల అందరికంటే ముందు మీరే తిరస్కారులు కాకండి. ఇంకా నా ఆయతులను కొద్దిపాటి ధరకు అమ్ముకోకండి. నాకు మాత్రమే భయపడండి.
2:42 وَلَا
تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
సత్యాన్ని అసత్యంతో కలిపి కలగాపులగం చేయకండి. తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి.
2:174 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.
2:175 أُولَٰئِكَ
الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ
فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా, శిక్షను క్షమాభిక్షకు బదులుగా కొనుక్కున్నవారు వీరే. వారు నరకాగ్నిని ఎలా భరిస్తారో?!
4:59 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి - మీకు నిజంగా అల్లాహ్పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అవశ్యం)! ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది.
3. సూరా
ఆలి
ఇమ్రాన్
3:104 وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
3:105 وَلَا
تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ
الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ
తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే.
3:106 يَوْمَ
تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ
وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ
تَكْفُرُونَ
ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారినుద్దేశించి, ''మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి'' (అని అనబడుతుంది).
3:107 وَأَمَّا
الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ
తెల్లగా ప్రకాశిస్తున్న మొహాలవారు దైవకారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు.
3:108 تِلْكَ
آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا
لِّلْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!)
ఇవి
అల్లాహ్
వచనాలు.
వాటిని
మేము
నీకు
ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్కు ఎంతమాత్రం లేదు.
3:109 وَلِلَّهِ
مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తమూ అల్లాహ్కే చెందుతుంది. సకల వ్యవహారాలూ అల్లాహ్ వైపుకే మళ్ళించ బడతాయి.
3:110 كُنتُمْ
خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ
عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ
لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
47:24 أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
ఏమిటి, వారు ఖుర్ఆన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?
47:25 إِنَّ
الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ
الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ
ఎవరయితే తమకు సన్మార్గం తేటతెల్లమైన తరువాత కూడా వీపు త్రిప్పుకుని మరలిపోయారో వారి కొరకు షైతాను ఒక విషయాన్ని (వారి చేష్టను) అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి (మోసపూరితమైన) గడువును ఇచ్చాడు.
47:26 ذَٰلِكَ
بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّهُ سَنُطِيعُكُمْ فِي
بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّهُ يَعْلَمُ إِسْرَارَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో, "మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము" అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాహ్కు తెలుసు.
16:125 ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
7:6 فَلَنَسْأَلَنَّ الَّذِينَ أُرْسِلَ إِلَيْهِمْ وَلَنَسْأَلَنَّ الْمُرْسَلِينَ
ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని తప్పకుండా అడుగుతాము. ప్రవక్తలను కూడా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము.
41:33 وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّن دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ
అల్లాహ్ వైపు (జనులను) పిలుస్తూ, సత్కార్యాలు చేస్తూ 'నేను విధేయుల (ముస్లింల)లో ఒకడను' అని పలికేవాని మాటకంటే మంచిమాట మరెవరిది కాగలదు?
41:34 وَلَا
تَسْتَوِي الْحَسَنَةُ وَلَا السَّيِّئَةُ ۚ ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ
فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ
మంచీ - చెడు (ఎట్టి పరిస్థితిలోనూ) సమానం కాలేవు. (ఓ ప్రవక్తా!) చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తరువాత (నువ్వే చూద్దువుగాని), నీకూ- తనకూ మధ్య బద్ధవిరోధం ఉన్న అతను సైతం నీకు ప్రాణస్నేహితుడైపోతాడు.
2:109 وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఈ గ్రంథవహుల్లోని అనేకులు, సత్యమేదో స్పష్టంగా తెలిసి పోయినప్పటికీ - కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుంచి అవిశ్వాసం వైపు మళ్ళించాలని చూస్తున్నారు. కాబట్టి అల్లాహ్ తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకూ మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి, వారిని పట్టించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు.
2:110 وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا
الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ
اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
మీరు మాత్రం నమాజును నెలకొల్పుతూ, జకాత్ను ఇస్తూ ఉండండి, మీరు మీ కోసం ఏ మంచి పనులను ముందుగా పంపుకున్నా అల్లాహ్ వద్ద వాటిని పొందుతారు. నిస్సందేహంగా అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు.
2:145 وَلَئِنْ أَتَيْتَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ بِكُلِّ آيَةٍ مَّا تَبِعُوا قِبْلَتَكَ ۚ وَمَا أَنتَ بِتَابِعٍ قِبْلَتَهُمْ ۚ وَمَا بَعْضُهُم بِتَابِعٍ قِبْلَةَ بَعْضٍ ۚ وَلَئِنِ اتَّبَعْتَ أَهْوَاءَهُم مِّن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ ۙ إِنَّكَ إِذًا لَّمِنَ الظَّالِمِينَ
ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా, వారు నీ 'ఖిబ్లా'ను అనుసరించరు. వారి 'ఖిబ్లా'ను అంగీకరించటం అన్నది నీవల్ల కూడా కానిపని. వారిలో కూడా కొందరు మరికొందరి 'ఖిబ్లా'ను అనుసరించరు. ఒకవేళ నువ్వు- జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా - వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా!
2:146 الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمْ ۖ وَإِنَّ فَرِيقًا مِّنْهُمْ لَيَكْتُمُونَ الْحَقَّ وَهُمْ يَعْلَمُونَ
మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని (అనగా ముహమ్మద్-సఅసం-ను) గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది.
2:213 كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. ప్రజల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలపై తీర్పు చేయటానికిగాను వారివెంట (అనగా ప్రవక్తల వెంట) సత్య బద్ధమైన గ్రంథాలను పంపాడు. మరి వాళ్ళే (అనగా ప్రజలే) - స్పష్టమైన ఆదేశాలు వొసగబడిన తరువాత కూడా - పరస్పర వైర భావం, అసూయ మూలంగా అందులో విభేదించుకున్నారు. అందుచేత అల్లాహ్ విశ్వాసులకు ఈ భేదాభిప్రాయం నుండి కూడా తన ఆజ్ఞానుసారం సత్యం వైపుకు దర్శకత్వం వహించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
3:19 إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
3:20 فَإِنْ
حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل
لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ
أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ
ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే, ''నేనూ, నా అనుచరులు దైవ విధేయతకు తలఒగ్గాము'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి. ''మరి మీరు కూడా దైవాజ్ఞకు తలఒగ్గుతున్నారా?'' అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారేగనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్ తన దాసులను చూస్తూనే ఉన్నాడు.
3:64 قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!)
వారికి
స్పష్టంగా
చెప్పు:
''ఓ
గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.'' ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ''మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని వారికి చెప్పేయండి.
3:65 يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?!
3:66 هَا
أَنتُمْ هَٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ
فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్కు తెలుసుగాని మీకు తెలియదు.
3:68 إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ
وَهَٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ
అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్ విశ్వాసులకు మాత్రమే నేస్తం.
3:69 وَدَّت
طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا
أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు.
3:70 يَا
أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ
''ఓ గ్రంథవహులారా!
మీరు
స్వయంగా
అల్లాహ్
ఆయతులకు
సాక్షిగా
ఉండి
కూడా
వాటిని
ఎందుకు
తిరస్కరిస్తున్నారు?''
3:71 يَا
أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ
وَأَنتُمْ تَعْلَمُونَ
''గ్రంథం కల ఓ ప్రజలారా!
తెలిసి
కూడా
మీరు
సత్యానికి
అసత్యపు
రంగు
పులిమి
దానిని
ఎందుకు
అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??''
3:72 وَقَالَت
طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ
آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ''విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!''
3:73 وَلَا
تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن
يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ
قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ
عَلِيمٌ
''మీరు మీ ధర్మాన్ని
అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు'' (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''నిశ్చయంగా అల్లాహ్ చూపే మార్గమే సన్మార్గం.'' (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ''మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).'' ఓ ప్రవక్తా! వారితో అను: ''అనుగ్రహాలన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.''
3:74 يَخْتَصُّ
بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
''ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం
కొరకు
ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.''
3:75 وَمِنْ
أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم
مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ
عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي
الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు - నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ''నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు'' అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు.
3:76 بَلَىٰ
مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు.
3:77 إِنَّ
الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا
أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا
يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ
أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది.
3:78 وَإِنَّ
مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ
الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ
وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ
يَعْلَمُونَ
వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు - అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ''అది అల్లాహ్ తరఫు నుంచి వచ్చినది'' అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్కు అసత్యాన్ని అంటగడుతున్నారు.
3:79 مَا
كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ
ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن
كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ
تَدْرُسُونَ
అల్లాహ్ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్ను) ప్రసాదించిన మీదట కూడా 'మీరు అల్లాహ్ను వదలిపెట్టి నాకు దాసులుకండి' అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, 'మీరంతా ప్రభువు వారైపోండి' అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం).
3:80 وَلَا
يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ
أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).
3:81 وَإِذْ
أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ
ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ
وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ
قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ
అల్లాహ్ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ''నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా, ''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు. ''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్ అన్నాడు.
3:82 فَمَن
تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.
3:83 أَفَغَيْرَ
دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ
طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా - తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.
3:84 قُلْ
آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ
وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ
وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ
لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!)
వారితో
అను:
''మేము
అల్లాహ్ను, మాపై అవతరింపజెయ్యబడిన
దానినీ
విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.''
3:85 وَمَن
يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ
مِنَ الْخَاسِرِينَ
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
3:86 كَيْفَ
يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ
الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ
الظَّالِمِينَ
(తొలుత) విశ్వసించి,
ఈయన
ప్రవక్త
అనే
విషయం
సత్యమేనని
సాక్ష్యం
(కూడా)
యిచ్చి,
తీరా
తమ
వద్దకు
స్పష్టమైన
సూచనలు
వచ్చేసిన
మీదట
అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు.
3:87 أُولَٰئِكَ
جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ
أَجْمَعِينَ
వారి పాపఫలంగా వారిపై అల్లాహ్ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది.
3:88 خَالِدِينَ
فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
ఈ (శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు.
3:98 قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ
''ఓ గ్రంథవహులారా!
మీరు
అల్లాహ్
ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు?
మీరు
చేసే
కర్మలకు
అల్లాహ్
సాక్షిగా
ఉన్నాడు''
అని
(ఓ
ప్రవక్తా!)
వారికి
చెప్పు.
3:99 قُلْ
يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ
تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا
تَعْمَلُونَ
''గ్రంథవహులారా!
అల్లాహ్
మార్గం
నుంచి
మీరు
విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:100 يَا
أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا
الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు.
3:101 وَكَيْفَ
تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ
وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మీకు అల్లాహ్ ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే.
4:171 يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انتَهُوا خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَن يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا
ఓ గ్రంథవహులారా! మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరోమాట అల్లాహ్కు ఆపాదించకండి. మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవప్రవక్త మరియు (అయిపో అన్న) దైవవాక్కు (ద్వారా పుట్టించబడినవారు) మాత్రమే. దాన్ని ఆయన మర్యమ్ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన (ఈసా), దేవుని దగ్గరి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాహ్నూ, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు 'ముగ్గురు' అని అనకండి. ఈ (త్రిత్వం) వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లాహ్ ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్య నిర్వాహకారిగా అల్లాహ్ ఒక్కడే చాలు.
4:47 يَا أَيُّهَا الَّذِينَ أُوتُوا الْكِتَابَ آمِنُوا بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰ أَدْبَارِهَا أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّا أَصْحَابَ السَّبْتِ ۚ وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا
ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న పని ఇక అయిపోయినట్లే.
5:79 كَانُوا لَا يَتَنَاهَوْنَ عَن مُّنكَرٍ فَعَلُوهُ ۚ لَبِئْسَ مَا كَانُوا يَفْعَلُونَ
వారు, తాము చేసే చెడు పనుల నుండి ఒండొకరిని నిరోధించేవారు కారు. వారు చేస్తూ ఉండినది బహుచెడ్డది.
5:80 تَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يَتَوَلَّوْنَ الَّذِينَ كَفَرُوا ۚ
لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ أَنفُسُهُمْ أَن سَخِطَ اللَّهُ عَلَيْهِمْ وَفِي
الْعَذَابِ هُمْ خَالِدُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు అవిశ్వాసులతో స్నేహసంబంధాలు పెట్టుకుంటారు. వారు తమ స్వయం కోసం ఏదయితే ముందుకు పంపుకున్నారో అది చాలా చెడ్డది. అందుకే అల్లాహ్ వారిపట్ల అప్రసన్నుడయ్యాడు. వారు కలకాలం శిక్షలో పడి ఉంటారు.
5:81 وَلَوْ كَانُوا يُؤْمِنُونَ بِاللَّهِ وَالنَّبِيِّ وَمَا أُنزِلَ
إِلَيْهِ مَا اتَّخَذُوهُمْ أَوْلِيَاءَ وَلَٰكِنَّ كَثِيرًا مِّنْهُمْ فَاسِقُونَ
వారికి అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిపట్ల విశ్వాసమే గనక ఉంటే వారు అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకునేవారే కాదు. కాని వారిలో చాలా మంది దైవవిధేయతకు దూరమైపోయారు.
5:15 يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ
ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సఅసం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది.
5:16 يَهْدِي
بِهِ اللَّهُ مَنِ اتَّبَعَ رِضْوَانَهُ سُبُلَ السَّلَامِ وَيُخْرِجُهُم مِّنَ
الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِهِ وَيَهْدِيهِمْ إِلَىٰ صِرَاطٍ
مُّسْتَقِيمٍ
దాని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను అనుసరించేవారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన అనుమతి మేరకు వారిని చీకట్లలో నుంచి వెలికితీసి, కాంతి వైపుకు తీసుకువస్తాడు. రుజుమార్గం వైపుకు వారికి దర్శకత్వం వహిస్తాడు.
5:61 وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
వారు మీ వద్దకు వచ్చినప్పుడు, “మేము విశ్వసించాము” అని అంటారు. నిజానికి వారు అవిశ్వాసంతోనే వచ్చారు. మరి ఆ అవిశ్వాసంతోనే తిరిగి వెళ్ళిపోయారు. వారు దాచిపెట్టే దాన్ని అల్లాహ్ బాగా ఎరుగు.
5:62 وَتَرَىٰ
كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ
السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.
5:63 لَوْلَا
يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ
وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
వారు ఇలాంటి పాపిష్టిమాటలు చెప్పకుండా, అధర్మమైన సొమ్మును తినకుండా వారి మతాచార్యులు, పండితులు వారిని ఎందుకు ఆపరు? వారు చేస్తున్నది చాలా చెడ్డ పని.
29:44 خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ
فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
అల్లాహ్ ఆకాశాలనూ, భూమినీ సత్య బద్ధంగా (పరమార్ధం దృష్ట్యా) సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది.
29:45 اتْلُ
مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ
تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ
وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!)
నీ
వైపుకు
పంపబడిన
(వహీ
చేయబడిన)
గ్రంథాన్ని
పారాయణం
చేస్తూ
ఉండు.
నమాజును
నెలకొల్పు.
నిశ్చయంగా
నమాజ్
సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు.
29:46 وَلَا
تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ
ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ
إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). "మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము" అని స్పష్టంగా చెప్పేయండి.
29:47 وَكَذَٰلِكَ
أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ
بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا
الْكَافِرُونَ
మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల (పూర్వం) మేము గ్రంథం వొసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో (మక్కా ముష్రిక్కులలో) కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసి పుచ్చుతారు.
57:28 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَآمِنُوا بِرَسُولِهِ يُؤْتِكُمْ كِفْلَيْنِ مِن رَّحْمَتِهِ وَيَجْعَل لَّكُمْ نُورًا تَمْشُونَ بِهِ وَيَغْفِرْ لَكُمْ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. అతని ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యం నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. ఇంకా మీకు జ్యోతిని అనుగ్రహిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. ఆయన మీ పాపాలను కూడా క్షమిస్తాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి.
57:29 لِّئَلَّا
يَعْلَمَ أَهْلُ الْكِتَابِ أَلَّا يَقْدِرُونَ عَلَىٰ شَيْءٍ مِّن فَضْلِ اللَّهِ
ۙ وَأَنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو
الْفَضْلِ الْعَظِيمِ
దైవానుగ్రహంలోని ఏ భాగంపై కూడా తమకెలాంటి అధికారం లేదని, అనుగ్రహమంతా దేవుని చేతిలోనే ఉందని, ఆయన తను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని (ఆయన ఈ విధంగా చేశాడు). అల్లాహ్ గొప్ప అనుగ్రహం కలవాడు.
2:1 الم
అలిఫ్ లామ్ మీమ్.
2:2 ذَٰلِكَ
الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపు తుంది.
2:3 الَّذِينَ
يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ
يُنفِقُونَ
వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు, నమాజును నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో (సంపదలో) నుంచి ఖర్చుపెడతారు.
2:4 وَالَّذِينَ
يُؤْمِنُونَ بِمَا أُنزِلَ إِلَيْكَ وَمَا أُنزِلَ مِن قَبْلِكَ وَبِالْآخِرَةِ
هُمْ يُوقِنُونَ
మేము నీ వైపుకు (అంటే ప్రవక్త వైపుకు) అవతరింపజేసిన దానినీ, నీకు పూర్వం అవతరింపజేసిన వాటినీ వారు విశ్వసి స్తారు. పరలోకం పట్ల కూడా వారు దృఢనమ్మకం కలిగిఉంటారు.
2:5 أُولَٰئِكَ
عَلَىٰ هُدًى مِّن رَّبِّهِمْ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఇలాంటి వారే తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు వీరే.
2:6 إِنَّ
الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا
يُؤْمِنُونَ
అవిశ్వాసులను నీవు భయపెట్టినా, భయపెట్టకపోయినా ఒకటే. ఇక వారు విశ్వసించరు.
2:7 خَتَمَ
اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَعَلَىٰ سَمْعِهِمْ ۖ وَعَلَىٰ أَبْصَارِهِمْ
غِشَاوَةٌ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
అల్లాహ్ వారి హృదయాలపై,వారి చెవులపై ముద్రవేశాడు. వారి కళ్ళపై పొరవుంది. ఇంకా వారికి మహా (ఘోరమైన) శిక్ష వుంది.
2:8 وَمِنَ
النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ وَبِالْيَوْمِ الْآخِرِ وَمَا هُم
بِمُؤْمِنِينَ
మేము అల్లాహ్ పట్ల, అంతిమదినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నామని కొందరంటున్నారు. కాని యదార్థానికి వారు విశ్వసించినవారు కారు.
2:9 يُخَادِعُونَ
اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا
يَشْعُرُونَ
వారు అల్లాహ్ను, విశ్వాసులనూ మోసపుచ్చుతున్నారు. అయితే వాస్తవానికి వారు స్వయంగా - తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. కాని ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు.
2:10 فِي
قُلُوبِهِم مَّرَضٌ فَزَادَهُمُ اللَّهُ مَرَضًا ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا
كَانُوا يَكْذِبُونَ
వారి హృదయాలలో రోగం ఉంది. ఆ రోగాన్ని అల్లాహ్ మరింతగా పెంచాడు. ఇంకా, వారు చెప్పే అబద్ధం మూలంగా వారి కొరకు వ్యధాభరితమయిన శిక్ష ఉంది.
2:11 وَإِذَا
قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ
“భూమిలో కల్లోలాన్ని
రేకెత్తించకండి” అని వారితో అన్నప్పుడల్లా, “మేము దిద్దుబాటుకు ప్రయత్నించేవారం మాత్రమే” అని వారు సమాధానమిస్తారు.
2:12 أَلَا
إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَٰكِن لَّا يَشْعُرُونَ
జాగ్రత్త! నిజానికి కల్లోల జనకులు వీరే. కాని వారికి ఆ విషయం తెలియటం లేదు.
2:13 وَإِذَا
قِيلَ لَهُمْ آمِنُوا كَمَا آمَنَ النَّاسُ قَالُوا أَنُؤْمِنُ كَمَا آمَنَ
السُّفَهَاءُ ۗ أَلَا إِنَّهُمْ هُمُ السُّفَهَاءُ وَلَٰكِن لَّا يَعْلَمُونَ
“ఇతరులు (అంటే ప్రవక్త ప్రియ సహచరులు) విశ్వసించినట్లే
మీరూ
విశ్వసించండి” అని వారితో చెప్పినప్పుడు, “మూర్ఖ జనులు విశ్వసించినట్లుగా మేము విశ్వసించాలా?” అని వారు (ఎదురు) ప్రశ్న వేస్తారు. తస్మాత్! ముమ్మాటికీ వీరే మూర్ఖులు. కాని ఆ సంగతి వీరికి తెలియటం లేదు.
2:14 وَإِذَا
لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا إِلَىٰ شَيَاطِينِهِمْ
قَالُوا إِنَّا مَعَكُمْ إِنَّمَا نَحْنُ مُسْتَهْزِئُونَ
విశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు,”మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతానుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరిహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.
2:15 اللَّهُ
يَسْتَهْزِئُ بِهِمْ وَيَمُدُّهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
అల్లాహ్ కూడా వారితో పరిహాసమాడుతున్నాడు. వారి తలబిరుసుతనాన్ని మరింత అధికం చేస్తున్నాడు. ఫలితంగా వారు అంధులై గమ్యరహితంగా తిరుగుతూపోతున్నారు.
2:16 أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ
فَمَا رَبِحَت تِّجَارَتُهُمْ وَمَا كَانُوا مُهْتَدِينَ
అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొనితెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకమూ కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు.
2:168 يَا أَيُّهَا النَّاسُ كُلُوا مِمَّا فِي الْأَرْضِ حَلَالًا طَيِّبًا وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి. కాని షైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు.
2:169 إِنَّمَا
يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا
تَعْلَمُونَ
వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు.
2:170 وَإِذَا
قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا
أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ
شَيْئًا وَلَا يَهْتَدُونَ
“అల్లాహ్ అవతరింపజేసిన
గ్రంథాన్ని
అనుసరించండి”
అని
వారికి
చెప్పినప్పుడల్లా, “మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము” అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గ విహీనులైనప్పటికీ (వీళ్లు వారినే అనుసరిస్తారన్నమాట!)
2:255 اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
అల్లాహ్ (మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం). ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకుగానీ, నిద్రగానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్యపరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు.
2:256 لَا
إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَن
يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ
الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది. కనుక ఎవరయితే అల్లాహ్ తప్ప వేరితర ఆరాధ్యులను (తాగూత్ను) తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
2:284 لِّلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّهُ ۖ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఆకాశాలలో, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్దే. మీ మనసులలో ఉన్న దాన్ని మీరు వెల్లడించినా లేక దాచిపెట్టినా అల్లాహ్ మీ నుండి దాని లెక్క తీసుకుంటాడు. ఆ తరువాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్కు అన్నింటిపై అధికారం ఉంది.
2:285 آمَنَ
الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ
بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ
مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا
وَإِلَيْكَ الْمَصِيرُ
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.
2:286 لَا
يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا
اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ
رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن
قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ
عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى
الْقَوْمِ الْكَافِرِينَ
అల్లాహ్ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”
112. సూరా అల్ ఇఖ్లాస్![]()
112:1 قُلْ
هُوَ اللَّهُ أَحَدٌ
(ఓ ముహమ్మద్
సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు.
112:2 اللَّهُ الصَّمَدُ
అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు).
112:3 لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు.
112:4 وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.
113. సూరా అల్ ఫలఖ్![]()
113:1 قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ
చెప్పు: నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను –
113:2 مِن شَرِّ مَا خَلَقَ
ఆయన సృష్టించిన వాటన్నింటి కీడు నుండి,
113:3 وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
కటిక చీకటి క్రమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి,
113:4 وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي
الْعُقَدِ
(మంత్రించి)ముడులలో ఊదే వారి కీడు నుండి,
113:5 وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
అసూయపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి (నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను).
114. సూరా అన్ నాస్![]()
114:1 قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ
(ఈ విధంగా) చెప్పు: “నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను.
114:2 مَلِكِ النَّاسِ
మానవుల చక్రవర్తిని,
114:3 إِلَٰهِ النَّاسِ
మానవుల ఆరాధ్య దైవాన్ని (ఆశ్రయిస్తున్నాను) –
114:4 مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
దురాలోచనలను రేకెత్తించే,తప్పించుకునే వాడి కీడు నుండి,
114:5 الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ
النَّاسِ
వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు –
114:6 مِنَ الْجِنَّةِ وَالنَّاسِ
వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే!




- Get link
- X
- Other Apps
Comments
Post a Comment